"గుమ్మలూరి సత్యనారాయణ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:శ్రీకాకుళం జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
1911 జూన్ 3న శ్రీకాకుళం జిల్లా [[సంగం]] అగ్రహారంలో సత్యనారాయణ జన్మించారు. కోయంబత్తూరు వ్యవసాయ కళాశాల నుండి 1934లో వ్యవసాయ పట్టభద్రులై కొంతకాలం శాంతి నికేతన్ లో రవీంద్ర కవీంద్రుని అంతేవాసిగా చేరారు.
 
[[ఆకాశవాణి]] [[విజయవాడ]] కేంద్రంలో 1966-69 మధ్యకాలంలో వ్యవసాయ కార్యక్రమాల ప్రయోక్తగా పనిచేశారు. 1955-59 మధ్యకాలంలో హైదరాబాదులో[[హైదరాబాదు]]లో పంచవర్ష ప్రణాళిక ప్రాంతీయ ప్రచారాధికారిగా కార్యభారం నిర్వహించారు. 1970 నుండి సర్వారాయ షుగర్స్, చెల్లూరులో చెరకు ఆఫీసరుగా విశిష్ట కృషి చేశారు. 15 సం. పైగా యిక్కడ పనిచేశారు. 1979లో [[అమెరికా]], [[ఇంగ్లాండు]] దేశాలు, 1981 లో [[మలేషియా]] పర్యటించారు. 1980లో శాస్త్రీయ విజ్ఞాన సమితి కాకినాడలో స్థాపించారు.
 
సత్యనారాయణ గ్రంథకర్త కూడా, 1975లో డెల్టా శిల్పి-ఆర్థర్ కాటన్ అనే ఉద్గ్రంథం వ్రాశారు. [[రామాయణ]] హితోపదేశం పేర రామాయణ రహస్యాలను వెలువరించారు. నేటి రైతాంగం పేర 1969 నుండి [[ఆంధ్రప్రభ]] దినపత్రికలో ధారావాహిక వ్యాసాలు ప్రచురించారు. మాలి, చిన్నయ చెరువు, బ్రతుకు తెరువు, కళాపాసి నాటకములు వ్రాశారు. హాలిక సూక్తులు శతకం వెలువరించారు.
 
[[పశ్చిమ గోదావరి జిల్లా]] కృషిక్ సమాజ్ సంస్థవారు వ్యవసాయ కళోద్ధారక బిరుదంతో సత్కరించారు. [[కొత్తగూడెం]] [[ఆకాశవాణి]] కేంద్రం వారి కొరిక మేరకు వీరు రచించిన గోదావరి కిన్నెర రూపకానికి జాతీయ స్థాయి పోటీలలో 1990 సం.లో బహుమతి లభించింది. సహస్ర మాసొప జీవియైన గుమ్మలూరు చరమ జీవితాన్ని [[హైదరాబాదు]]లో గడుపుతున్నారు.
 
[[వర్గం:1911 జననాలు]]
1,91,098

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1945951" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ