"విస్సా అప్పారావు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
 
వీరు తూర్పు గోదావరి జిల్లా [[పెద్దాపురం]]లో 1884 ఏప్రిల్ 24 తేదీన రామచంద్రుడు మరియు మాణిక్యాంబ దంపతులకు జన్మించారు. తండ్రి పెద్దాపురం సంస్థానంలో ఉన్నతోద్యోగిగా పనిచేశారు. వీరు పెద్దాపురం, అమలాపురం లో ప్రాథమిక విద్యను పూర్తిచేసి; రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో ఎఫ్.ఏ;, బి.ఎ. (1900-04) చదివి, ప్రెసిడెన్సీ కళాశాలలో ఎం.ఎ.ను భౌతికశాస్త్రం ప్రధానాంశంగా 1906లో చదివి; 1907 లో ఎల్.టి.ని పూర్తిచేశారు. అంతట రాజమండ్రిలోనే స్కూలు అసిస్టెంటుగా కొంతకాలం పనిచేసి; తదుపరి 1909లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతికశాస్త్ర అసిస్టెంటు ప్రొఫెసర్ గా నియమితులై ఆనర్సు విద్యార్థులకు బోధించారు. 1914 నుండి రాజమండ్రి, అనంతపురం కళాశాలలో పనిచేసి; 1927లో తిరిగి చెన్నై ప్రెసిడెన్సీ కళాశాలలో చేరారు. అక్కడ 1936 వరకు పనిచేసి ఉత్తమ ఆచార్యులుగా, పరిపాలకులుగా ప్రఖ్యాతిచెందారు. 1936-38 మధ్య రాజమండ్రి ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసి, తర్వాత కొంతకాలం [[ఆంధ్ర విశ్వకళా పరిషత్తు]] కళాశాల ప్రిన్సిపాల్ గా కూడా పనిచేసి; 1941 పదవీ విరమణ చేశారు.
 
రాజమండ్రిలోని గానకళా పరిషత్తు, రామారావు ఆర్టు గేలరీ, చిత్రకళాశాల మొదలైన సంస్థలను స్థాపించారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్తు పాలన మండలిలోను, ఆంధ్రప్రదేశ్ సంగీత, నాటక అకాడమీలోను, రేడియో మొదలైన సంస్థల సలహాసంఘాల సభ్యులుగా పనిచేశారు. మద్రాసు సంగీత అకాడమి మూలస్తంభాలలో వీరు ఒకరు.
వీరు 1966 జూలై 30 తేదీన హైదరాబాదులో పరమపదించారు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/849488" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ