ఆంధ్ర విశ్వవిద్యాలయం
![]() | |
| రకం | సార్వత్రిక |
|---|---|
| స్థాపితం | ఏప్రిల్ 26,1926 |
| వైస్ ఛాన్సలర్ | జి. నాగేశ్వరరావు |
| రెక్టర్ | డి.గాయత్రి |
| డీన్ | కె.రామమోహన రావు |
| స్థానం | విశాఖపట్టణం, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశము |
| ప్రాంగణం | పట్టణ ప్రాంతం |
| అనుబంధాలు | యుజిసి |
| జాలగూడు | http://www.andhrauniversity.edu.in |

ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఆంధ్ర విశ్వకళా పరిషత్,ఆంధ్రా యూనివర్సిటీ (Andhra University)), భారతదేశంలోని ప్రాచీన విశ్వవిద్యాలయాలలో ఒకటి. ఇది విశాఖపట్టణంలో ఉంది. ఈ విశ్వవిద్యాలయం మద్రాస్ యూనివర్సిటీకి అప్పుడు అనుబంధంగా ఉన్న సర్కారు, రాయలసీమ లలో ఉన్న కళాశాలతో 1926లో ఏర్పడింది. ఏర్పడింది. 1925 నాటి మద్రాసు విశ్వవిద్యాలయం అనుసరించి ఆంధ్ర విశ్వవిద్యాలయ చట్టం ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది. రావు బహదూర్ సర్ అన్నెపు పరశురామ్ దాస్ పాత్రో ఈ విషయంలో కృషి చేశారు. గౌరవ సూచకంగా ఆంధ్ర విశ్వకళాపరిషత్, విశాఖపట్నం ప్రాంగణంలో పాత్రో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.[1] 1926 నుండి 1931 వరకు, మరలా రెండవ విడత 1936 నుండి 1949 వరకు విశ్వవిద్యాలయ ఉపకులపతిగా కట్టమంచి రామలింగారెడ్డి వ్యవహరించాడు. ఆ మధ్య కాలములో సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యక్షునిగా ఉన్నాడు. పేరుగాంచిన ఈ ఉత్తమ ఉపాధ్యాయుని నోటి మాటల్లో ఈ విశ్వవిద్యాలయం "కొత్తవారికి సరైన విశ్వవిద్యాలయం". ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రముఖ విద్యావేత్త న్యూమెన్ ఆదర్శ విశ్వవిద్యాలయం ఊహకు అనుగుణంగా తీర్చిదిద్దబడింది.
1954 లో రాయలసీమ జిల్లాలతో తిరుపతి కేంద్రంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఏర్పడింది. 1967లో గుంటూరు లో, ఈ విశ్వవిద్యాలయం ఒక పోస్టుగ్రాడ్యుయేటు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది 1976 లో నాగార్జున విశ్వవిద్యాలయంగా అవతరించింది.
ఆంధ్ర విశ్వ విద్యాలయము ఉత్తర, దక్షిణ ప్రాంగణము (క్యాంపస్)లుగా ఉంది. దక్షిణ ప్రాంగణం (ఇదే మొదటి నుంచీ ఉన్న ఆవరణ) లో పాలనా విభాగముతో పాటు కళలు, మానవీయ శాస్త్రాలు, శాస్త్రీయ విజ్ఞానాల శాఖలు ఉన్నాయి. 1962 లో కొత్తగా ఏర్పరచిన ఉత్తర ప్రాంగణములో ఇంజనీరింగ్ కళాశాల ఉంది.
విశ్వవిద్యాలయ పోస్టు గ్రాడ్యుయేటు విద్య అవసరాల కొరకు ఉమ్మడి శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాలలో ఎచ్చెర్ల, కాకినాడ, తాడేపల్లిగూడెం, విజయనగరంలో పోస్టు గ్రాడ్యుయేటు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2006లో రాజమండ్రిలో ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయమును ఏర్పాటు చేసి దాని పరిధి లోనికి ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలోని కళాశాలలను తెచ్చారు. ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాలలోని కళాశాలలకు ఆంధ్ర విశ్వ విద్యాలయం పరిధి పరిమితమైంది. విశ్వవిద్యాలయ నాణ్యతకు గుర్తింపు నాక్ (NAAC) సంస్థ ఇచ్చిన "ఎ" గ్రేడు.
విశ్వవిద్యాలయ చిహ్నం
[మార్చు]
- ఆంధ్ర విశ్వవిద్యాలయ చిహ్నాన్ని కట్టమంచి రామలింగారెడ్డి (సిఆర్‌రెడ్డి) ఉప కులపతిగా ఉన్న సమయంలో కౌతా రామమోహన శాస్త్రి రూపకల్పన చేశాడు. చిహ్నంలో ఉన్న తామరపుష్పం సిరి సంపదల దేవత లక్ష్మీదేవి, చదువుల దేవత సరస్వతీదేవి ల ఆసనానికి గుర్తు. స్వస్తిక్ ముద్ర ఆర్యుల ఆశీర్వచనానికి గుర్తు. బయటి వృత్తంలో ఉన్న 64 తామర రేకులు 64 కళలకు గుర్తులు. చిహ్నంలో ఉన్న తేజస్వినావధీతమస్తు అనే వాక్యానికి "నీ దివ్యమైన కాంతితో మా జ్ఞానాన్ని పెంపొందించు" అని అర్ధం. చిహ్నంలో ఉన్న రెండు పాములు విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, కాపాడుకోవడానికి గుర్తులు. ప్రాచీన నాగ వంశీకులలో ఆంధ్రుల మూలాలు ఉన్నాయంటారు. ఆ విధంగా ఈ రెండు పాములు ఆంధ్రుల ప్రాచీన మూలాలను గుర్తుకు తెస్తాయి.[2]
ప్రత్యేకతలు
[మార్చు]
- ఆంధ్ర విశ్వవిద్యాలయం భారతదేశం లోనే మొదటిసారిగా 1934 నుండే కామర్సులో ఆనర్సు డిగ్రీ మొదలుపెట్టింది, 1957లో దేశంలోనే మొట్టమొదటి సారిగా ఎంబిఎ కోర్సును ప్రవేశపెట్టింది.[3]
- ఫార్మసీ విభాగం ఏర్పాటులో భారతదేశంలో రెండవ స్థానం (మొదట బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం).
- మానవ వనరులను, సాఫ్టువేరు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దటానికి, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ మధ్యనే (2008 నుండి) "స్కూల్ ఆఫ్ ఐటి" అనే సంస్థను నెలకొల్పింది.[4]
కళాశాలలు
[మార్చు]
- ఆంధ్ర విశ్వవిద్యాలయం కళలు , వాణిజ్యం కళాశాల (Estd. 1931)
- ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగం
- ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల (Estd. 1955)
- ఆంధ్ర విశ్వవిద్యాలయం స్త్రీల ఇంజనీరింగ్ కళాశాల (Estd. 2010)
- ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల (Estd. 1945)
- ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాల (Estd. 1951)
- ఆంధ్ర విశ్వవిద్యాలయం శాస్త్ర , సాంకేతిక కళాశాల (Estd. 1931)
- ఆంధ్ర విశ్వవిద్యాలయం దూర విద్య పాఠశాల (Estd. 1972)
ఉపకులపతులు
[మార్చు]ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితా:
| క్రమసంఖ్య | ఉపకులపతి పేరు | పనిచేసిన కాలం | ఇతర వివరాలు |
|---|---|---|---|
| 1 | కట్టమంచి రామలింగారెడ్డి | 26-04-1926 నుండి 19-07-1930 | మొట్టమొదటి ఉపకులపతి |
| 2 | సర్వేపల్లి రాధాకృష్ణన్ | 20-07-1930 నుండి 19-05-1936 | |
| 3 | కట్టమంచి రామలింగారెడ్డి | 20-05-1936 నుండి 07-12-1949 | |
| 4 | వాసిరెడ్డి శ్రీకృష్ణ | 08-12-1949 నుండి 16-06-1961 | |
| 5 | అప్పడవేదుల లక్ష్మీనారాయణ | 17-06-1961 నుండి 30-06-1966 | |
| 6 | కె.ఆర్.శ్రీనివాస అయ్యంగారు | 01-07-1966 నుండి 29-11-1968 | |
| 7 | లంకపల్లి బుల్లయ్య | 30-11-1968 నుండి 12-12-1974 | |
| 8 | మేకా రంగయ్య అప్పారావు | 13-12-1974 నుండి 12-12-1980 | |
| 9 | ఆవుల సాంబశివరావు | 13-12-1980 నుండి 14-11-1983 | |
| 10 | కోనేరు రామకృష్ణారావు | 05-06-1984 నుండి 23-03-1988 | |
| 11 | కనిశెట్టి వెంకటరమణ | 24-03-1988 నుండి 23-03-1991 | |
| 12 | మద్ది గోపాలకృష్ణారెడ్డి | 18-09-1991 నుండి 15-09-1997 | |
| 13 | ఆర్.రాధాకృష్ణ | 22-04-1998 నుండి 04-03-2001 | |
| 14 | వై. సి. సింహాద్రి | 03-04 -2002 నుండి 02-04-2005 | |
| 15 | ఎల్. వేణుగోపాలరెడ్డి | 06-05-2005 నుండి 03-05-2008 | |
| 16 | బీలా సత్యనారాయణ | 20-06-2008 నుండి 19-11-2011 | |
| 17 | జి.ఎస్.ఎన్.రాజు | 05-02-2013 నుండి 16-07-2016 | |
| 18 | జి.నాగేశ్వరరావు | 17-07-2016 నుండి | |
| 19 | |||
| 20 | పి.వి.జి.డి. ప్రసాదరెడ్డి | 19-07-2019 నుండి ప్రస్తుతం |
కళా ప్రపూర్ణ
[మార్చు]కళా ప్రపూర్ణ ఒక బిరుదు లేదా పురస్కారం. ఇది, విద్యా సాహిత్య సాంస్కృతిక విషయాలలో విశేషమైన కృషి చేసిన వారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రదానం చేసే గౌరవ డాక్టరేట్.
పూర్వ విద్యార్థులు
[మార్చు]ఈ విశ్వవిద్యాలయంలో చదువుకున్న కొందరు ప్రముఖ వ్యక్తుల పాక్షిక జాబితా:
- అంబటి చంటిబాబు
- అడుసుమిల్లి శ్రీకృష్ణ
- అబ్బూరి గోపాలకృష్ణ
- అవని పంచాల్
- ఇప్సిత పతి
- ఈడుపుగంటి వెంకట సుబ్బారావు
- ఎ. ఎల్. రావు
- ఎక్కిరాల వేదవ్యాస
- ఎస్.గంగప్ప
- ఎస్.వి. రాఘవేంద్రరావు
- ఎస్.వై.పి.సి.ప్రసాదరావు
- ఓల్గా (రచయిత్రి)
- కూనపులి వెంకటేశ్వర్లు
- కృష్ణ పాలెపు
- కె.దేవసహాయం
- కెంబూరి రామ్మోహన్ రావు
- కొణతాల రామకృష్ణ
- కొత్తపల్లి గీత
- కొరిటాల శేషగిరిరావు
- కొల్లూరు శ్రీకృష్ణ
- గంటేడ గౌరునాయుడు
- గూటాల కృష్ణమూర్తి
- గొడవర్తి సత్యనారాయణ వరప్రసాద్
- గొల్లపూడి మారుతీరావు
- చిత్తూరు మహమ్మద్ హబీబుల్లా
- చెన్నుపాటి విద్య
- చెఱువు సత్యనారాయణ శాస్త్రి
- చెళ్ళపిళ్ళ సీతారామమూర్తి
- జి. ఎస్. ఆర్. సుబ్బారావు
- జి. రోహిణి
- జి.ఎం.సి.బాలయోగి
- టి. సి. రావు
- డీన్ బద్రూ
- తుమ్మల సీతారామమూర్తి
- తూమాటి దోణప్ప
- తోట చంద్రశేఖర్
- దేవదాస్ కనకాల
- ద్వాదశి నాగేశ్వరశాస్త్రి
- నండూరి సాంబశివరావు
- నంబాల కేశవ రావు
- నాదెళ్ళ నందగోపాల్
- నిడిగట్టు సంజయ్
- నిర్మలా విశ్వేశ్వరరావు
- పి.ఎస్.ఆర్. అప్పారావు
- పిన్నమనేని నరసింహారావు
- పిళ్లా రామారావు
- పివిఆర్ రాజా
- పీడిక రాజన్నదొర
- పుష్పలత దాస్
- పెద్దింటి రామస్వామి నాయిడు
- పెమ్మరాజు శ్రీనివాసరావు
- ప్రసాద్ వి. తేతలి
- బర్రి రామచంద్రరావు
- బి. ఎస్. దయా సాగర్
- బి.వి.పరమేశ్వరరావు
- బులుసు శివశంకరరావు
- బూదరాజు రాధాకృష్ణ
- బూదాటి వెంకటేశ్వర్లు
- బొడ్డుపల్లి పురుషోత్తం
- భాగవతుల దత్తగురు
- మతుకుమిల్లి వీర వెంకట సత్యనారాయణ మూర్తి
- మద్దాళి రఘురామ్
- మద్దూరి నగేష్ బాబు
- మధునాపంతుల సూర్యనారాయణ మూర్తి
- మాధవపెద్ది మీనాక్షి
- మెంటే పద్మనాభం
- మేడపాటి వెంకటరెడ్డి
- రవి వడ్లమాని
- రాజ మోహన్
- రావిప్రోలు సుబ్రహ్మణ్యం
- రొక్కం రాధాకృష్ణ
- వండాన శేషగిరిరావు
- విప్పర్తి ప్రణవమూర్తి
- వులిమిరి రామలింగస్వామి
- వెంకయ్య నాయుడు
- వెన్నా వల్లభరావు
- వై. సవితా దేవి
- శకుంతలా నరసింహన్
- శీలం జేసుదాస్
- శుద్ధానంద బ్రహ్మచారి
- శ్రీనివాసన్ వరదరాజన్
- సంధ్యా దేవనాథన్
- సత్తుపాటి ప్రసన్న శ్రీ
- సత్యనారాయణ్ రాజ్గురు
- సయ్యద్ సలీం
- సిరందాసు వెంకట రామారావు
- సూరి బాలకృష్ణ
ప్రచురణలు
[మార్చు]తెలుగు పుస్తకాలు
[మార్చు]- పంచమి (రంగనాథ రామాయణాదిక వ్యాసములు) (1954)
- ఎవరెస్ట్ శిఖరారోహణము (1956)
- మానవ వంశావళి (1964)
- రాజశిల్పి (1964)
- శ్రీనివాస కల్యాణము (నాటకము) (1972)
- ఆంధ్ర వాజ్మయమున చారిత్రక కావ్యములు (1978)
- తెలుగు వ్యుత్పత్తి కోశము (1978-1995)
- కావ్య సమీక్షలు (1983)
- కాదంబరీ స్వాదము (1988)
- ఆదిభట్ట నారాయణ దాస సారస్వత స్వాదము (1992)
- ప్రబంధరత్నాకరము (1992)
- ప్రాణదాత యల్లాప్రగడ సుబ్బారావు జీవిత పరిచయం (1997)
- జ్ఞాపక శక్తి - చదివే పద్ధతులు (1998)
- మానవ మనుగడలో రసాయనశాస్త్ర విజ్ఞానము (2001)
- తెలుగుభాషా తత్త్వం (వ్యాస సంపుటి) (2002)
- వీరేశలింగం (2003)
- ఆంధ్ర విశ్వకళాపరిషత్తు - వ్యావహారిక తెలుగు భాషావ్యాప్తి (2004)
- వెయ్యేళ్ళ తెలుగు వెలుగు (2009)
ఆంగ్ల పుస్తకాలు
[మార్చు]- The Simhachalam Temple (1969)
- A Descriptive Catalogue of the Telugu Manuscripts (1999)
ర్యాంకింగులు
[మార్చు]ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేంవర్క్ధా ఆధారంగా 2023వ సంవత్సరంలో మొత్తం భారతదేశం వ్యాప్తంగా 76వ ర్యాంకు పొందింది ,[5] మొత్తం విశ్వవిద్యాలయాలలో 43వ ర్యాంకు పొందింది [6], ఇంజనీరింగ్ ర్యాంకింగ్ లో 94 వ ర్యాంకు పొందింది [7].
ఇవి కూడా చూడండి
[మార్చు]- ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల జాబితా
- ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాసంస్థల జాబితా
- విశ్వవిద్యాలయం
- ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం
- శుద్ధానంద బ్రహ్మచారి
- కృష్ణ పాలెపు
- ఎ. ఎస్. ప్రకాష్
మూలాలు
[మార్చు]- ↑ ఎ. పి. పాత్రో
- ↑ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధికారిక వెబ్సైటులో విశ్వవిద్యాలయ చిహ్నం Archived 2007-05-27 at the Wayback Machine గురించి వివరిస్తున్న పేజీనుండి మే 21, 2007న సేకరించబడింది.
- ↑ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధికారిక వెబ్‌సైటులో కళలు , కామర్సు కళాశాల పేజి నుండి మే 21, 2007న సేకరించబడింది.
- ↑ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధికారిక వెబ్‌సైటులో స్కూల్ ఆఫ్ ఐటి Archived 2008-05-10 at the Wayback Machine గురించి. ఏప్రిల్ 23, 2008 న సేకరించబడింది.
- ↑ "ఓవరాల్ ర్యాంకింగ్".
- ↑ "అమొంగ్ ఉనివెర్సితిఎస్".
- ↑ "ఇంజనీరింగ్ ర్యాంకింగులు".
