"స్టీవ్ జాబ్స్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
(మధ్యలో చేర్చబడిన అసహజ, కృత్రిమ అనువాదం తొలగింపు)
[[1986]]లో 10 మిలియన్ డాలర్లకు పిక్సర్ అనే గ్రాఫిక్స్ కంపెనీని కొన్నాడు. ఈ కంపెనీ నిర్మించే చిత్రాలకు ఆర్థిక సహాయం చేయడానికి, పంపిణీ చేయడానికి డిస్నీ కంపెనీతో ఒప్పందం ఏర్పరుచుకుంది.
 
మొట్టమొదటి సినిమా అయిన [[టాయ్ స్టోరీ]] [[1995]]లో విడుదలయి ఘనవిజయాన్ని సాధించింది. ఆ తర్వాత పదేళ్ళపాటు వరుసగా ప్రతి సినిమా ఘన విజయాన్ని సాధిస్తూ వందల మిలియన్ డాలర్లు లాభాలను ఆర్జించాయి. ఈ సంస్థ నిర్మించిన కొన్ని సినిమాలు: [[ఎ బగ్స్ లైఫ్]], [[టాయ్ స్టోరీ 2]], [[మాన్‌స్టర్స్.ఇన్‌క్ ఇంక్]], [[ఫైండింగ్ నీమో]], [[ది ఇన్‌క్రెడిబుల్స్]], [[కార్స్]], [[రాటటూయి]].
 
డిస్నీతో కాంట్రాక్టు పూర్తి అయిన తర్వాత యేర్పడిన మనస్పర్థలవల్ల పిక్సర్ ఇంకో కాంట్రాక్టును వెతుక్కోవడం మొదలుపెట్టింది. అపుడు డిస్నీకి వచ్చిన కొత్త CEO పిక్సర్‌ను 7.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి ప్రతిపాదన చేసాడు. జాబ్స్ అందుకు ఒప్పుకొన్నాడు. అప్పటినుండి డిస్నీ-పిక్సర్ కలసి నిర్మిస్తున్న సినిమాల వ్యవహారాలు చూసే ఆరుగురు సభ్యుల కమిటీలో జాబ్స్ ఒకడుగా ఉండేవాడు.
987

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/988666" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ