ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు
Appearance
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు
[మార్చు]2000 లో ఉత్తరాంచల్ ,జార్ఖండ్ , చత్తీస్‌గఢ్ రాష్ట్రాల యేర్పాటుతో అక్కడి ఉద్యమాలు పరిష్కారమయ్యాయి.తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతోందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.విశాలాంధ్ర చీలితే జై ఆంధ్ర ,గ్రేటర్ రాయలసీమ ,ఉత్తరాంధ్ర లాంటి డిమాండ్లు మళ్ళీ తలెత్తుతున్నాయి.ఇప్పుడు దేశంలో దాదాపు 15 ప్రత్యేక రాష్ట్రాల కోసం డిమాండ్లు ఉన్నాయి.
- గూర్ఖాలాండ్ (పశ్చిమబెంగాల్): గూర్ఖాల వేషభాషలు బెంగాలీలకు భిన్నం.
- సౌరాష్ట్ర (గుజరాత్): సౌరాష్ట్రవాసులు మాట్లాడే భాష కూడా గుజరాతీనే.
- విదర్భ (మహారాష్ట్ర):
- బుందేల్‌ఖండ్ (ఉత్తరప్రదేశ్): : ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని జిల్లాలను కలిపి బుందేల్‌ఖండ్ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న డిమాండు ఉంది.
- బోడోలాండ్ (అస్సాం): బోడోల్యాండ్ లిబరేషన్ టైగర్స్, అస్సాం ప్రభుత్వం, భారత ప్రభుత్వం మధ్య ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఒప్పందం జరిగింది.
- హరిత్‌ప్రదేశ్ (ఉత్తరప్రదేశ్): ఉత్తప్రదేశ్‌లోని 22 జిల్లాలతో హరిత్‌ప్రదేశ్‌ను ఏర్పాటు చేయాలన్నది డిమాండు.బ్రజ్‌ప్రదేశ్, అవథ్‌ప్రదేశ్, పర్చిప్రదేశ్‌లుగా ఉత్తరప్రదేశ్‌ను విడగొట్టాలన్న డిమాండు స్వాతంత్య్రపూర్వ కాలం నుంచీ ఉంది.
- కూర్గ్ / కొడగు (కర్ణాటక): కర్ణాటకతో పోల్చితే కొడగుల వేషభాషలూ, ఆహారపు అలవాట్లు విభిన్నం.
- భోజ్‌పురి : తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్‌లోని కొన్ని ప్రాంతాల వారు భోజ్‌పురి భాషలో మాట్లాడతారు.బెంగాల్‌లోని కుచ్‌బీహార్, అస్సాంలోని మరికొన్ని ప్రాంతాలు కలిపి గ్రేటర్ కుచ్‌బీహార్ ఏర్పాటు చేయాలనే డిమాండు ఉంది.
- కోశల్ : పశ్చిమ ఒరిస్సాలోని 10 జిల్లాల వారు కోశల్ రాష్ట్రం ఇవ్వాలని డిమాండు చేస్తున్నారు. ఇక్కడివారు ఒరియా కాకుండాసంబల్‌పురి భాషలో మాట్లాడతారు.