Jump to content

ప్రదాన్ బారుహ్

వికీపీడియా నుండి
ప్రదాన్ బారుహ్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
22 నవంబర్ 2016
ముందు సర్బానంద సోనోవాల్
నియోజకవర్గం లఖింపూర్

పదవీ కాలం
19 మే 2016 – 22 నవంబర్ 2016
ముందు సుమిత్రా పాటిర్
తరువాత డా. రనోజ్ పెగు

వ్యక్తిగత వివరాలు

జననం (1965-04-30) 1965 ఏప్రిల్ 30 (వయసు 59)
సిలపత్తర్, ధేమాజీ, అస్సాం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి అరుణిమా బారుహ్
సంతానం 2
నివాసం ధేమాజీ, అస్సాం
వృత్తి సామాజిక కార్యకర్త
రాజకీయ నాయకుడు
మూలం [1]

ప్రదాన్ బారుహ్ (జననం 30 ఏప్రిల్ 1965) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2016లో ధేమాజీ శాసనసభ నియోజకవర్గం నుండి అస్సాం శాసనసభ్యుడిగా ఎన్నికై, ఆ తరువాత 2016లో లఖింపూర్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో పోటీ చేసి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

ప్రదాన్ బారుహ్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1996లో జోనై శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారి 2001, 2011లో ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత 2015లో హిమంత బిస్వా శర్మతో కలిసి కాంగ్రెస్ నుండి భారతీయ జనతా పార్టీలో చేరాడు.[2] ఆయన 2016లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ధేమాజీ శాసనసభ నియోజకవర్గం నుండి అస్సాం శాసనసభ్యుడిగా ఎన్నికై, 2014లో లఖింపూర్ లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన సర్బానంద సోనోవాల్ అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో 2016లో లఖింపూర్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో పోటీ చేసి 1,90,219 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3]

ప్రదాన్ బారుహ్ 2019లో లఖింపూర్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ బోర్గోహైన్ పై 3,50,551 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి, ఆ తరువాత 2024లో లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఉదయ్ శంకర్ హజారికాపై 2,01,257 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. The New Indian Express (13 April 2024). "Here's why Lakhimpur BJP MP Pradan Baruah stayed silent for two consecutive terms" (in ఇంగ్లీష్). Archived from the original on 13 July 2024. Retrieved 13 July 2024.
  2. NDTV (7 November 2015). "9 Rebel Congress Lawmakers in Assam Join BJP". Archived from the original on 13 July 2024. Retrieved 13 July 2024.
  3. The Economic Times (29 November 2016). "BJP's Pradan Baruah takes oath as Lok Sabha member". Archived from the original on 13 July 2024. Retrieved 13 July 2024.
  4. TimelineDaily (6 June 2024). "BJP Hit Hatrick In Lakhimpur With The Win Of Pradan Baruah" (in ఇంగ్లీష్). Archived from the original on 13 July 2024. Retrieved 13 July 2024.
  5. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Lakhimpur". Archived from the original on 13 July 2024. Retrieved 13 July 2024.