Jump to content

ప్రదీప్ పాణిగ్రాహి

వికీపీడియా నుండి
ప్రదీప్ పాణిగ్రాహి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 జూన్ 4
ముందు చంద్ర శేఖర్ సాహు
నియోజకవర్గం బెర్హంపూర్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు బిజు జనతాదళ్
తల్లిదండ్రులు సోమనాథ్ పాణిగ్రాహి
చీర పాణిగ్రాహి
జీవిత భాగస్వామి సుజాత పాణిగ్రహి
సంతానం 2
వృత్తి రాజకీయ నాయకుడు

ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి (జననం 3 ఏప్రిల్ 1963) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన గోపాల్‌పూర్ నుండి మూడుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత విద్యా మంత్రిగా పని చేసి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బెర్హంపూర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి బిజు జనతాదళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 ఒడిశా శాసనసభ ఎన్నికలలో గోపాల్‌పూర్ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2014 ఒడిశా శాసనసభ ఎన్నికలలో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో 2014 మే 20 నుండి 2017 మే 7 వరకు గ్రామీణ నీటి సరఫరా, సైన్స్ & టెక్నాలజీ, ఉన్నత విద్య శాఖ మంత్రిగా పని చేశాడు.

ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి 2019 ఒడిశా శాసనసభ ఎన్నికలలో గోపాల్‌పూర్ నియోజకవర్గం నుండి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 'ప్రజా వ్యతిరేక' కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఆయనను బిజు జనతాదళ్ పార్టీ నుండి బిజెడి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 2020 నవంబర్ 28న బహిష్కరించాడు.[2]

ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు 2024 ఫిబ్రవరి 21న భువనేశ్వర్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమల్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరి[3] 2024 ఎన్నికలలో బెర్హంపూర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేడీ అభ్యర్థి భృగు బాక్సిపాత్రపై 1,65,476 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. "Full list of Odisha Lok Sabha elections 2024 winners" (in ఇంగ్లీష్). The Indian Express. 5 June 2024. Archived from the original on 24 March 2025. Retrieved 24 March 2025.
  2. "Patnaik expels MLA from BJD for "anti-people" activities" (in Indian English). The Hindu. 29 November 2020. Archived from the original on 24 March 2025. Retrieved 24 March 2025.
  3. "Odisha: Expelled BJD MLA and ex-minister Pradeep Panigrahy joins BJP". Hindustan Times. 21 February 2024. Archived from the original on 24 March 2025. Retrieved 24 March 2025.
  4. "Party changers | Shifting hues" (in ఇంగ్లీష్). India Today. 13 July 2024. Archived from the original on 2 March 2025. Retrieved 22 March 2025.
  5. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Constituency Wise". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.