భాగవతం - ఒకటవ స్కంధము
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
భాగవతము ఋషుల ప్రశ్నలతో మొదలవుతుంది. [1]తరువాత భాగవతము లోని వివిధ అవతారములను గురించి వివరించారు. అటు పిమ్మట భాగవతము ఎలా మొదలైనదో వివరింపబడింది. వేదాలు విభజించి, మహాభారతం రచించి, 17 (17) పురాణాలు రాసి కూడా వ్యాసభగవానునికి మనశ్శాంతి లేకుండా పోయింది. అప్పుడు వారి ఆధ్యాత్మిక గురువు గారు అయిన నారద మహర్షి విచ్చేసిభాగవతము రాయమని ఉపదేశించి, అనేక విషయాలు బోధించి వెళతారు. అప్పుడు వ్యాసులవారు ఈ భాగవతము రాస్తారు.
తరువాత ఈ భాగవతాన్ని ఎలా ప్రచారములోనికి తెచ్చినారో వివరింపబడింది. మహాభారతము ముగియడము, పరిక్షిత్తు మినహా అందరూ పరమ పదము చేరుకోవడము, భీష్ముని నిర్యాణము, శ్రీ కృష్ణ భగవానుని ద్వారకా ప్రయాణము, ద్వారకలో వారు ప్రవేశించడము, పరిక్షిత్తు జననము, దృతరాష్ట్రుడు అడవులకి వెళ్ళడము, శ్రీ కృష్ణ నిర్యాణము, పాండవులు రాజ్యాన్ని వదిలి వెళ్ళడము, పరిక్షిత్తు, కలి సంవాదము, పరిక్షిత్తు కలి పురుషుడుని దండించడము, దయచూపడము, పరిక్షిత్తుకి బ్రాహ్మణ బాలుడు శాపాన్ని ఒసగడము, శుకదేవ మహర్షి ఆగమనము, పరిక్షిత్తు వారిని ప్రశ్నలు అడగటము అనే వివరములు ఈ ప్రథమ స్కంధములో గలవు .[2]
అర్జునుడు అశ్వత్థామను పరాభవించుట
[మార్చు]కురుక్షేత్రం అయిపోయిన రోజు రాత్రి పాండవ శి బిరంలో అందరూ నిద్రిస్తుండగా, అశ్వత్థామ వీరావేశంతో వచ్చినిద్రిస్తున్న ఉప పాండవులను హాతమార్చెను. పాండవులు చంపబడ్డారన్న వార్త తెలుసుకున్న అర్జునుడు వీరావేశంతో వీరిని చంపిన వాడిని తీసుకువచ్చి నీ పాదాల వద్ద పడివేస్తానని ద్రౌపదితో శపథం చేసి, కురుక్షేత్రంకి వచ్చి అక్కడ ఉన్న భటుల ద్వారా చంపినవాడు అశ్వత్థామ అని తెలుసుకొని, వాడితో యుద్ధము చేసెను. సవ్యసాచి ప్రతిభ ముందు తాళలేక అశ్వత్థామ బ్రహ్మశిరోనామాస్త్రం ప్రయోగించగా, ఆ అస్త్రం లోకాలన్నిటిని కమ్మేస్తుండగ అది చూసిన కృష్ణుడు అర్జునుడిని కూడా బ్రహ్మశిరోనామాస్త్రాన్ని ప్రయోగించమనగా, అర్జునుడు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించినాడు. పిమ్మట రెండు బ్రహ్మశిరోనామాస్త్రలను కూడా ఉపసంహరించి, అశ్వత్థామను కట్టి ద్రౌపది ఎదుట నిలబెట్టగా.
మూలాలు
[మార్చు]- ↑ "పోతన తెలుగు భాగవతం - సంపుటి -1 - ప్రథమ స్కంధం". Scribd (in ఇంగ్లీష్). Retrieved 2020-05-25.
- ↑ సాంబశివరావు, శ్రీ ఊలపల్లి. "ముంగలి : పోతన తెలుగు భాగవతము". telugubhagavatam.org. Archived from the original on 2020-05-19. Retrieved 2020-05-25.