ప్రధానమంత్రి సంగ్రహాలయం
ప్రధానమంత్రి సంగ్రహాలయం (ఆగ్లం: Prime Ministers' Museum) (హిందీ: प्रधानमंत्री संग्रहालय) భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75వ వార్షికోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ 2022 ఏప్రిల్ 14న ప్రారంభించిన హైటెక్ మ్యూజియం ఇది.[1] ఈ రోజు బి.ఆర్. అంబేద్కర్ జయంతి కావడం విశేషం. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నుంచి 2004-2014 మధ్యకాలంలో ఉన్న మన్మోహన్ సింగ్ వరకు 14 మంది జీవిత విశేషాలను వివరించేలా ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని తీన్‌మూర్తి భవన్‌లో ఏర్పాటు చేసిన ఈ మ్యూజియంలో 75 ఏళ్లు వెనక్కి వెళ్లి దేశ చరిత్రను దృశ్య, శ్రవణ మాధ్యమాల సహకారంతో డిజిటల్ రూపంలో వీక్షించగలిగే అవకాశం ఉంది.
తీన్‌మూర్తి భవన్
[మార్చు]గతంలో ఈ తీన్‌మూర్తి భవన్‌లో జవాహర్ లాల్ నెహ్రూ వ్యక్తిగత పుస్తకాలు, ఆయన ఉపయోగించిన వస్తువులతో మాత్రమే నెహ్రూ మెమోరియల్ మ్యూజియం & లైబ్రరీ నిర్వహించబడేది. అయితే 2018లో దేశప్రధానులందరి జ్ఞాపకాలతో ఈ మ్యూజియాన్ని పరిపుష్టం చేయాలని భావించిన నరేంద్ర మోడీ ఇందుకు సంబంధించిన ప్రణాళికను రూపొందించారు. రూ.271 కోట్లతో అభివృద్ధి చేసిన ఈ మ్యూజియంలో 43 గ్యాలరీలు ఉన్నాయి. స్వతంత్ర భారతదేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నుంచి ఇప్పటిదాకా పాలించిన ప్రధానులు గుల్జారీలాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, మొరార్జీ దేశాయ్, చరణ్‌సింగ్, రాజీవ్ గాంధీ, వి.పి.సింగ్, చంద్రశేఖర్, పి.వి.నరసింహారావు, అటల్ బిహారీ వాజపేయి, దేవెగౌడ, ఐ.కె.గుజ్రాల్, డా.మన్మోహన్ సింగ్ దాకా అందరి చేతుల్లో భారతదేశ పురోగతి రూపుదిద్దుకున్న తీరును స్ఫూర్తిగా ప్రధానమంత్రి సంగ్రహాలయం తీర్చిదిద్దారు.[2] ప్రజాస్వామ్యానికి ప్రతీకగా ధర్మచక్రాన్ని పట్టుకున్న చేతులతో దీని లోగో రూపొందించబడింది.
పనివేళలు, టికెట్ ధరలు
[మార్చు]స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశాన్ని పాలించిన మొత్తం 14 మంది గత ప్రధానుల సేవలకు అంకితం చేయబడిన ప్రధాన మంత్రి సంగ్రహాలయ, ఢిల్లీలోని తీన్ మూర్తి కాంప్లెక్స్‌లో ఉంది. 2022 ఏప్రిల్ 14న ప్రధానమంత్రి సంగ్రహాలయం ప్రారంభించి, మాజీ ప్రధానులకు అంకితం చేసిన నరేంద్ర మోదీ మొదటి టిక్కెట్‌ను కొనుగోలు చేశారు. ఈ మ్యూజియం సుమారు 4,000 మంది సామర్థ్యం కలిగి ఉంది. భారతీయుల కోసం ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా ఎంట్రీ టిక్కెట్‌కి రూ.100, ఆఫ్‌లైన్‌లో రూ.110 ఉంటుంది. విదేశీయులు రూ.750 చెల్లించవలసిఉంటుంది.
5 నుండి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు 50%, విద్యాసంస్థలకు 25% తగ్గింపు ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "ప్రధాన మంత్రి సంగ్రహాలయ.. జ్ఞాపకాల టైమ్ మెషీన్ - Andhrajyothy". web.archive.org. 2022-05-07. Archived from the original on 2022-05-07. Retrieved 2022-05-07.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Explained | What is Pradhanmantri Sangrahalaya or museum of PMs - The Hindu". web.archive.org. 2022-05-07. Archived from the original on 2022-05-07. Retrieved 2022-05-07.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)