ప్రపంచ ఆరోగ్య దినం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రపంచ ఆరోగ్య దినం ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రాయోజకత్వంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న జరుపుకుంటారు.

1948లో, ప్రపంచ ఆరోగ్య సంస్థ, మొట్టమొదటి ప్రపంచ ఆరోగ్య సమావేశాన్ని జరిపింది. ఆ సమావేశం 1950 నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినాన్ని జరపాలని నిర్ణయించింది. “ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన చెందుతున్న ప్రాధాన్యరంగాన్ని ఎత్తి చూపడానికి నిర్దిష్ట ఆరోగ్య అంశంపై చైతన్యాన్ని” కలిగించడానికి ప్రపంచ ఆరోగ్య దినం జరుపబడుతోంది. కార్యకలాపాలు – ఆ నిర్దిష్ట థీమ్ మరియు అందించబడిన వనరులకు సంబంధించినవి – ఏప్రిల్ 7 వరకు కొనసాగుతాయి, ఇది ప్రపంచ ఆరోగ్య దినాన్ని జరుపుకోవడానికి నిర్ణయించిన తేదీ.

ఎది థప్పు ఇదీ తపు

ప్రపంచ ఆరోగ్య దినం 2008: వాతావరణ మార్పు దుష్ప్రభావాల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.[మార్చు]

ఏప్రిల్ 7న జరిగే ప్రపంచ ఆరోగ్య దినం, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంస్థాపనను గుర్తుకు తెస్తుంది, ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య ప్రాధాన్యతాంశాన్ని ప్రపంచం ముందుకు తెచ్చేందుకోసం ఇదొక చక్కటి అవకాశం. 2008లో, ప్రపంచ ఆరోగ్య దినం, వాతావరణ మార్పు దుష్ప్రభావాల నుంచి ఆరోగ్యాన్ని కాపాడవలసిన అవసరంపై దృష్టి సారిస్తుంది & వాతావరణ మార్పుకు ఆరోగ్యం మరియు వాతావరణం, ఆహారం, ఇంధనం, రవాణా వంటి ఇతర అభివృద్ధి రంగాల మధ్య సంబంధాన్ని ఇది నిర్వచిస్తుంది.

“వాతావరణ మార్పు నుంచి ఆరోగ్యాన్ని కాపాడటం” అనే అంశం వాతావరణ మార్పు గురించిన ప్రపంచవ్యాప్త చర్చకు ఆహారాన్ని కేంద్రబిందువుగా ఉంచుతుంది. ప్రపంచ ప్రజారోగ్య భద్రతకు ప్రమాదాన్ని నిత్యం పెంచుతూ వస్తున్న వాతావరణ మార్పును అందరి దృష్టికి తీసుకురావడానికి WHO ఈ థీమ్‌ని ఎంపిక చేసుకుంది.

పరస్పర సహకారం పెరుగుతున్నందువలన, ప్రపంచ సముదాయం ప్రపంచవ్యాప్తంగా వాతావరణంతో ముడిపడి ఉన్న ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవడానికి మరింతగా సన్నద్ధమవుతుంది. అలాంటి సహకార చర్యలకు ఉదాహరణలు: సాంక్రమిక వ్యాధుల గుర్తింపు మరియు నియంత్రణను పటిష్టపర్చడం, క్షీణించిపోతున్న నీటి సరఫరాను సురక్షితరీతిలో ఉపయోగించడం మరియు అత్యవసర పరిస్థితులలో ఆరోగ్య చర్యలను సమన్వయించడం.

ప్రపంచ ఆరోగ్య దినం 2007: ఆరోగ్యంపై మదుపు, సురక్షితమైన భవిష్యత్తు నిర్మాణం[మార్చు]

ప్రపంచ ఆరోగ్య దినం 2007 ప్రధాన సందేశాలు:

 1. ఆరోగ్య ప్రమాదాలకు సరిహద్దులు లేవు.
 2. ఆరోగ్యంపై మదుపు చేయండి, సురక్షిత భవిష్యత్తును నిర్మించుకోండి.
 3. ఆరోగ్యం భద్రతకు దారితీస్తుంది; అభద్రత అనారోగ్యానికి దారితీస్తుంది.
 4. సన్నద్ధత మరియు సత్వర స్పందన అంతర్జాతీయ ఆరోగ్య భద్రతను మెరుగుపరుస్తుంది.
 5. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచాన్న మరింత సురక్షితంగా మారుస్తుంది.

మునుపటి ప్రపంచ ఆరోగ్య దినాల థీమ్‌లు[మార్చు]

 • 2011: సూక్ష్మజీవులకు ప్రతిఘటన
 • 2010: నగరీకరణ మరియు ఆరోగ్యం
 • 2009: జీవితాలను కాపాడండి, అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులను సురక్షితంగా ఉంచండి
 • 2008: వాతావరణ మార్పు దుష్ప్రభావాల నుంచి ఆరోగ్యాన్ని కాపాడండి
 • 2007: అంతర్జాతీయ ఆరోగ్య భద్రత
 • 2006: ఆరోగ్యం కోసం కలిసి పనిచేయండి
 • 2005: ప్రతి తల్లిని ప్రతి బిడ్డను లెక్కలోకి తీసుకోండి.
 • 2004: రహదారి భద్రత
 • 2003: జీవిత భవిష్యత్తును తీర్చిదిద్దండి: పిల్లలకు ఆరోగ్యకరమైన పరిసరాలు
 • 2002: ఆరోగ్యంవైపుగా అడుగు
 • 2001: మానసిక ఆరోగ్యం: తప్పకోవడం ఆపివేయండి, రక్షణ కొరకు సాహసించండి
 • 2000: సురక్షిత రక్తం నాతో మొదలెట్టండి
 • 1999: చురుకైన యవ్వనం భిన్నంగా ఉండండి
 • 1998: సురక్షిత మాతృత్వం
 • 1997: ఉనికిలోకి వస్తున్న సాంక్రమిక వ్యాధులు
 • 1996: ఆరోగ్యకరమైన నగరాలు ఉత్తమ జీవనం కోసం
 • 1995: ప్రపంచ పోలియో నిర్మూలన

సూచనలు[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]