ప్రపంచ కవితా దినోత్సవం
ప్రపంచ కవితా దినోత్సవం | |
---|---|
జరుపుకొనేవారు | యునైటెడ్ నేషన్స్ మెంబర్స్ |
ప్రారంభం | 1999 |
జరుపుకొనే రోజు | 21 మార్చి |
ఉత్సవాలు | యునెస్కో |
వేడుకలు | కవిత్వ ప్రచారం |
ఆవృత్తి | వార్షికం |
అనుకూలనం | ప్రతి ఏటా ఇదే రోజు |
ప్రపంచ కవితా దినోత్సవం (ఆంగ్లం: World Poetry Day) ప్రతి సంవత్సరం మార్చి 21న నిర్వహించబడుతుంది. 1999లో యునెస్కో వారిచే నిర్ణయించబడిన ప్రపంచ కవితా దినోత్సవం రోజున కవిత్వాన్ని సమాజానికి మరింత చేరువ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
చరిత్ర
[మార్చు]పురాతన సాహిత్యరూపమైన కవిత్వమును, కవిని గౌరవించే సాంప్రదాయము మన దేశంలో అనావియితీగా వస్తున్నది. అనేకమంది భారతీయ రాజులు కవిత్వాన్ని, కవులను పోషించేవారు. కానీ, ఇలాంటి సాంప్రదాయం ఇతర దేశాలలో 18వ శతాబ్ధము వరకు లేదు.
తొలిసారిగా 18వ శతాబ్దములో ఐరోపాలో రోమన్ కవి ' విర్రీన ' పేరున అక్టోబరు నెలలో కవితా దినోత్సవం జరుపబడింది. ఆనాటినుండి ఇతర ప్రాంతాలలో కూడా కవితా దినోత్సవం జరపడం ప్రారంభమైంది. 1999 సంవత్సరంలో పారిస్ లో యునెస్కో 30వ సమావేశం జరిగింది. ప్రతి సంవత్సరం మార్చి 21 తేదీన 'ప్రపంచ కవితా దినోత్సవం' జరపాలని ఆ సమావేశంలో నిర్ణయించారు.
కార్యక్రమాలు
[మార్చు]ప్రపంచవ్యాప్తంగా కవిత్వాన్ని చదవడం, రాయడం, ప్రచురించడం, బోధించడం వంటి అంశాలలో ప్రోత్సహించాలన్న ఉద్ధేశ్యంతో ప్రతి ఏటా ప్రపంచ కవితా దినోత్సవం జరుపబడుతుంది.
- 2016లో కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలోని ఎస్‌ఆర్‌కె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ కవితా దినోత్సవం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో 40మంది సాహిత్యకారులు, కవులు హాజరై కవితా గోష్టి నిర్వహించడమేకాకుండా, కొన్ని కవిత్వ పుస్తకాలు ఆవిష్కరించబడ్డాయి.[1]
- 2017లో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా "ఇక్కడి పరిమళం ఎక్కడి పూలదో" అనువాద కవిత్వం శీర్షికన 87మంది కవులతో కవి సమ్మేళనం నిర్వహించబడింది.[2]
మూలాలు
[మార్చు]- ↑ ప్రజాశక్తి, జిల్లాలు (21 March 2016). "యానాంలో ఘనంగా ప్రపంచ కవితా దినోత్సవం". Archived from the original on 21 March 2019. Retrieved 21 March 2019.
- ↑ ఆంధ్రజ్యోతి, సాహిత్య వార్తలు (22 March 2017). "ఘనంగా ప్రపంచ కవితా దినోత్సవం". Archived from the original on 21 March 2019. Retrieved 21 March 2019.