ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం
స్వరూపం
ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం | |
---|---|
జరుపుకొనేవారు | ప్రపంచవ్యాప్తంగా |
రకం | అంతర్జాతీయ |
జరుపుకొనే రోజు | ఆగస్టు 10 |
ఆవృత్తి | వార్షిక |
అనుకూలనం | ప్రతి సంవత్సరం ఒకటే రోజు |
ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. ఖనిజేతర ఇంధనాలను ప్రోత్సహించడంకోసం, జీవ ఇంధనాలపై ప్రజలకు అవగాహన కల్పించడంకోసం ఈ దినోత్సవం జరుపబడుతుంది.[1]
ప్రారంభం
[మార్చు]మొదటి డీజిల్ ఇంజిన్ పనిచేయడానికి నాలుగు దశాబ్దాల ముందు అంటే 1853లోనే పాట్రిక్ డఫీ చేత, కూరగాయల నూనె ట్రాన్స్‌స్టెరిఫికేషన్ నిర్వహించబడింది.[2][3] మోటారు వాహనాలను నడపడానికి డీజిల్ ఇంజిన్‌ను సృష్టించిన జర్మన్ శాస్త్రవేత్త సర్ రుడాల్ఫ్ జర్మనీలోని ఆగ్స్‌బర్గ్‌లో మొదటిసారిగా 1893, ఆగస్టు 10న వేరుసెనగ నూనెను ఇంధనంగా ఉపయోగించి 10 అడుగుల (3.05 మీ) ఐరన్ సిలిండరును పని చేయించాడు. దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్టు 10న ప్రపంచ జీవ ఇంధన దినోత్సవాన్ని జరుపుతున్నారు.[4][5]
కార్యక్రమాలు
[మార్చు]- భారతదేశంలో పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ 2015 నుండి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 2020లో ఈ దినోత్సవంసందర్భంగా పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ "ఆత్మనిర్భర్ భారత్ వైపు జీవ ఇంధనాలు" అనే అంశంతో వెబ్‌నార్ నిర్వహించింది. ఈథేనాల్, బయోడీజిల్, బయోగ్యాస్ ఈ మూడింటిని బాగా ఉపయోగించుకోగలిగితే ముడి చమురు, గ్యాస్ దిగుమతి చేసుకోవడం కూడా చాలావరకు తగ్గించవచ్చని సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు.[6]
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (10 August 2018). "ప్రతి గ్రామానికీ జీవ ఇంధనం ఫలాలు చేరాలి : ప్రధాని మోదీ". www.andhrajyothy.com. Archived from the original on 10 August 2020. Retrieved 10 August 2020.
- ↑ Duffy, Patrick (1853). "XXV. On the constitution of stearine". Quarterly Journal of the Chemical Society of London. 5 (4): 303. doi:10.1039/QJ8530500303.
- ↑ Rob (1898). "Über partielle Verseifung von Ölen und Fetten II". Zeitschrift für Angewandte Chemie. 11 (30): 697–702. doi:10.1002/ange.18980113003.
- ↑ డైలీహంట్, ఈనాడు (సంపాదకీయం) (10 August 2017). "ప్రగతికి జవ'జీవ ఇంధనం'! పరిశోధనలతో పదును ము". www.dailyhunt.in (in ఇంగ్లీష్). ప్రసాద్. Archived from the original on 10 August 2020. Retrieved 10 August 2020.
- ↑ "Biodiesel Day". Days Of The Year. Retrieved 10 August 2020.
- ↑ పి.ఐ.బి. ఇండియా, పత్రికా ప్రకటన (10 August 2020). "ప్రపంచ జీవఇంధన దినోత్సవం సందర్బంగా వెబినార్ నిర్వహణ". pib.gov.in. Archived from the original on 11 August 2020. Retrieved 11 August 2020.