ప్రభాకర్ చౌటి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రభాకర్ చౌటి[మార్చు]

ప్రభాకర్ చౌటి తెలంగాణ రాష్ట్రానికి చెందిన  సామాజిక కార్యకర్త, సివిల్స్ శిక్షకుడు. ప్రభాకర్ స్వస్థలం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం కి చెందిన పడకల్ అనే మారుమూల గ్రామం. 12 ఫిబ్రవరి 1989 న ఎల్లయ్య ,వెంకటమ్మ దంపతులకు ప్రభాకర్ జన్మించాడు. వీళ్లది సామాన్య మధ్యతరగతి కుటుంబం.

బాల్యం, విద్యాభ్యాసం:[మార్చు]

ప్రభాకర్ బాల్యమంతా పడకల్ గ్రామంలోనే జరిగింది. ఆరవ తరగతి వరకు పడగల్ గ్రామంలో ఆ తర్వాత 7వ తరగతి నుంచి పదవ తరగతి వరకు జెడ్. పి .హెచ్ .ఎస్ కందుకూరు గ్రామంలో అదేవిధంగా ఇంటర్మీడియట్ ఆ తరువాత బి టెక్ లను రంగారెడ్డి జిల్లా లో పూర్తి చేశాడు. ఇంజనీరింగ్ చేసిన తర్వాత ప్రభాకర్ వివిధ సామాజిక అంశాల ప్రభావాలకు లోనై  జర్నలిజం చేయదలచి 2013 - 15 మధ్యలో ఉస్మానియా యూనివర్సిటీ లో జర్నలిజంలో పోస్టు గ్రాడ్యుయేట్ చేశాడు. ప్రస్తుతం మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం  విభాగంలో పి. హెచ్. డి చేస్తున్నాడు.

వృత్తి జీవితం:[మార్చు]

ప్రభాకర్ సివిల్స్ ఫ్యాకల్టీ గా దేశంలో పేరుపొందిన వివిధ సంస్థల్లో పాలిటీ, కరెంట్ అఫైర్స్ లను బోధిస్తున్నాడు.2014 నుండి తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ స్టడీ సర్కిల్ అదేవిధంగా బీసీ స్టడీ సర్కిల్ లో గెస్ట్ ఫ్యాకల్టీ గా ఉన్నాడు.

రాసి ప్రచురించిన ప్రధాన వ్యాసాలు:[మార్చు]

తెలంగాణలోని ప్రధాన దినపత్రిక నమస్తే తెలంగాణ లో ఇండియన్ ఎకానమీ పైన అదేవిధంగా పోటీపరీక్షల ప్రణాళికల పైన అనేక వ్యాసాలు రాసాడు. వివిధ రకాల మాస పత్రికలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక , అంతర్జాతీయ కోణాల్లో అంశాలను విశ్లేషిస్తూ వ్యాసాలను రాసాడు.

ప్రభాకర్ రాసిన వ్యాసాలలో ముఖ్యమైనవి:[మార్చు]

  • IAS కావాలంటే ఎలా?
  • ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన కాలం
  • ఉస్మానియా యూనివర్సిటీ ఔన్నత్యం
  • ఇంకా వొడవని  ఓయూ ముచ్చట..
  • వివాదాల సుడిగుండం భూ సంస్కరణలు..
  • పన్ను పరిణామాలు
  • ఆర్టికల్ 371D
  • ఉద్యోగిత-  నిరుద్యోగిత
  • జంతు హింస చట్టాలు
  • మధ్యప్రాచ్య రాజకీయ అంశాలు
  • మహిళల భద్రత ,సాంఘిక న్యాయం -
  • ఆర్థిక వస్తువులు అంటే ఏమిటి
  • దారిద్య్రరేఖను నిర్ణయించే అంశాలు.
  • ద్రవ్యోల్బణం పరిణామాలు
  • మహిళా సాధికారతే ప్రజాస్వామ్య పునాది
  • సార్వత్రిక కనీస ఆదాయం.

రాసిన పుస్తకాలు :[మార్చు]

ప్రభాకర్ చౌటి
ప్రభాకర్ చౌటి రాసిన ఇండియన్ ఎకానమీ పుస్తకం

పోటీ పరీక్షలలో అత్యంత కష్టమైన ఇకనుంచి సబ్జెక్టును సామాన్యులు సైతం అర్థం చేసుకునే విధంగా అతి సరళమైన భాషలో  వివరణాత్మకంగా ప్రభాకర్ "ఇండియన్ ఎకానమీ"  అనే  పుస్తకాన్ని తెలుగు భాషలో రాసాడు

సామాజిక కార్యకర్త గా చేసిన కృషి :[మార్చు]

సమాజంలోని వివిధ అంశాలపై పత్రికలలో వ్యాసాలు రాయడం, వాటికి సంబంధించి నటువంటి అంశాలపైన న్యూస్ ఛానల్స్ లోని డిబేట్ లో పాల్గొన్నాడు. సేవ్ నల్లమల ఉద్యమం లో కీలక పాత్ర వహించిన ప్రభాకర్, స్వేరో స్టూడెంట్స్ యూనియన్ ను స్థాపించి ప్రస్తుతం దానికి ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తూ , విద్యార్థుల సమస్యల పైన పోరాటం కొనసాగిస్తున్నాడు. ప్రధాన స్వేరోస్ సంస్థ లొ సెంట్రల్ కమిటీ నీ నెంబర్ గా , బహుజన సమాజ్ పార్టీ తరపున వివిధ చర్చల్లో పాల్గొన్నాడు.తెలంగాణ ప్రభుత్వం ఊర్లో ఉన్న కేసుల విచారణ ఖర్చుల కోసం 58 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రభాకర్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశాడు.[1]

నిర్వహిస్తున్న పదవులు:[మార్చు]

ప్రభాకర్ స్వేరో స్టూడెంట్స్ యూనియన్ కి ప్రస్తుతం ప్రెసిడెంట్ గా ఉన్నాడు

అందుకున్న పురస్కారాలు:[మార్చు]

నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా   అంబిషన్స్   కెరీర్ కౌన్సిలర్స్ ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ ఎక్స్ లెన్స్  అవార్డు-2020 ' బెస్ట్ ఫ్యాకల్టీ ఇన్ జర్నలిజం' విభాగం లో జ్యూరీ అవార్డును సొంతం చేసుకున్నాడు.ప్రభాకర్ 2022లో తాను బోధిస్తున్న ఒక ప్రధాన సంస్థ నుండి గోల్డ్ ట్రోఫీ ని అందుకున్నాడు

మూలాలు[మార్చు]

[2]

  1. సోమేష్ కోసం.. ప్ర‌జల సొమ్ము వాడేస్తారా?, సోమేష్ కోసం.. ప్ర‌జల సొమ్ము వాడేస్తారా?. "సోమేష్ కోసం.. ప్ర‌జల సొమ్ము వాడేస్తారా?". V6 VELUGU. Archived from the original on 2022-01-09. Retrieved 2022-01-09.
  2. INDIAN ECONOMY, APPSC (2019). APPSC INDIAN ECONOMY. hyderabad: MANASA PUBLICATIONS. pp. https://www.shopeyard.com/appsc-2019-indian-economy-telugu-medium-chouti-s-series-manana-publications.html.

[1]

  1. ఆయన వాదం విశ్వజనీనం - ప్రభాకర్‌ చౌటి, ఆయన వాదం విశ్వజనీనం - ప్రభాకర్‌ చౌటి. "ఆయన వాదం విశ్వజనీనం - ప్రభాకర్‌ చౌటి". ABN ANDHRA JYOTHI. Archived from the original on 2022-01-09. Retrieved 2022-01-09.