Jump to content

ప్రభాస్ కుమార్ సింగ్

వికీపీడియా నుండి
ప్రభాస్ కుమార్ సింగ్
ప్రభాస్ కుమార్ సింగ్


పదవీ కాలం
1 సెప్టెంబర్ 2014 – 2019
ముందు సంజయ్ భోయ్
తరువాత సురేష్ పూజారి
నియోజకవర్గం బర్గఢ్

వ్యక్తిగత వివరాలు

జననం (1964-06-25) 1964 జూన్ 25 (వయసు 60)
భాటిగావ్, బర్గఢ్, ఒడిషా
రాజకీయ పార్టీ స్వతంత్ర
ఇతర రాజకీయ పార్టీలు బిజూ జనతాదళ్ పార్టీ
జీవిత భాగస్వామి మంజుశ్రీ సింగ్
సంతానం 2
నివాసం భాటిగావ్, బర్గఢ్, ఒడిషా
పూర్వ విద్యార్థి సంబల్పూర్ విశ్వవిద్యాలయం
ఉత్కల్ విశ్వవిద్యాలయం
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

ప్రభాస్ కుమార్ సింగ్ ఒడిషా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బర్గఢ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

ప్రభాస్ కుమార్ సింగ్ బిజూ జనతాదళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014లో పార్లమెంట్ ఎన్నికల్లో బర్గఢ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేడీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బీజేపీ అభ్యర్థి సుభాష్ చౌహాన్‌పై 11,178 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయనకు 2019లో జరిగిన ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. ఆయన పార్లమెంట్ లో మానవ వనరుల అభివృద్ధి స్టాండింగ్ కమిటీ, పర్యాటక & సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీలలో సభ్యుడిగా, ఒడిశా డెవలప్‌మెంట్ కౌన్సిల్‌లో సభ్యుడిగా పని చేశాడు.

ప్రభాస్ కుమార్ సింగ్ 2024లో బీజేడీ నుండి టికెట్ టికెట్ ఆశించగా పార్టీ నిరాకరించినందుకు మనస్థాపం చెంది 2024 ఏప్రిల్ 8న బిజూ జనతాదళ్ పార్టీ (బీజేడీ) ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. EENADU (9 April 2024). "బిజదను వీడిన అగ్రనేత ప్రభాస్‌ సింగ్‌". Archived from the original on 9 April 2024. Retrieved 9 April 2024.
  2. The New Indian Express (9 April 2024). "Ex-Bargarh MP Prabhas Singh quits BJD over ticket distribution policy" (in ఇంగ్లీష్). Archived from the original on 9 April 2024. Retrieved 9 April 2024.