Jump to content

ప్రియా గిల్

వికీపీడియా నుండి
ప్రియా గిల్
జననం (1975-12-09) 1975 డిసెంబరు 9 (వయసు 48)

ప్రియా గిల్ భారతీయ సినిమా నటి. 1996 నుండి 2006 మధ్యకాలంలో హిందీ, తెలుగు, మలయాళం, తమిళ, పంజాబీ చిత్రాలలో నటించింది. 1995లో జరిగిన మిస్ ఇండియా అందాల పోటీలలో మూడవ స్థానంలో నిలిచింది. "తేరే మేరె సప్నె" సినిమాతో హిందీ సినీరంగంలోకి అడుగుపెట్టింది.[1]

సినిమా జీవితం

[మార్చు]

1996లో ABCL బ్యానర్ లో వచ్చిన తేరే మేరే సప్నే సినిమాతో ప్రియా గిల్ సినీజీవితం ప్రారంభమైంది. ఈ చిత్రంలో అర్షద్ వార్షి, చంద్రచుర్ సింగ్ లతో కలిసి నటించింది. ప్రియాగిల్ అద్భుతమైన నటనతో, సహజ అందంతో పక్కింటి అమ్మాయిలా కనిపిస్తోంది. ఈమె నటించిన సిర్ఫ్ తుం చిత్రం 1999 సంవత్సరంలో అత్యధికంగా వసూలు చేసిన చిత్రాలలో ఒక చిత్రంగా నిలిచింది.[2][3]

షారూక్ ఖాన్, సునీల్ శెట్టి లతో కలిసి జోష్ సినిమాలో నటించింది. పంజాబీ జట్ సిక్కు కుటుంబం నుంచి వచ్చిన ప్రియాగిల్ తేరే మేరే సప్నేలో అమాయక దక్షిణ భారత బ్రాహ్మణ అమ్మాయిగా, బడే దిల్వాలలో ఒక చురుకైన సేవకురాలుగా, జోష్ పంజాబీలో కాథలిక్ వయోలిన్ వాద్యకారిణిగా నటించింది.[4]

చిత్ర సమహారం

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాష ఇతర వివరాలు
1996 తేరే మేరె సప్నే పరో శాస్త్రి హిందీ మొదటి సినిమా
1998 శ్యా ఘనశ్యాం గీత హిందీ
1999 సిర్ఫ్ తుమ్ ఆర్తి హిందీ
బడే దిల్వాల ప్రియా హిందీ
మేఘం మీనాక్షి మలయాళం
2000 జోష్ రోస్సంనే హిందీ
బాగున్నారా ప్రియా తెలుగు
రాయలసీమ రామన్న చౌదరి తెలుగు
2001 జీతేంగే హమ్ హిందీ
2002 రెడ్ గాయత్రి తమిళం
జీ ఆయన్ ను సిమర్ పంజాబి
2003 లో క్ కార్గిల్ చారులత హిందీ
బార్డర్ హిందుస్తాన్ కా నర్గీస్ హిందీ
2006 పియా తోసే నైనా లగే భోజ్ పురి
2016 భార్గవి భార్గవి హిందీ

మూలాలు

[మార్చు]
  1. టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్. "ప్రియా గిల్, PriyaGil". tollywoodphotoprofiles.blogspot.in. Retrieved 15 January 2018.[permanent dead link]
  2. "celebrity-star". perfectpeople.net. Retrieved 2015-07-03.
  3. "Priya Gill actress". imdb.com. Retrieved 2015-07-03.
  4. "Priya Gill". apunkachoice.com. Retrieved 2015-07-03.

బయటి లంకెలు

[మార్చు]