Jump to content

ప్రీతికా రావు

వికీపీడియా నుండి
ప్రీతికా రావు
2015లో ప్రీతికా రావు
జననం
ప్రీతిక

విద్యాసంస్థ
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2010–2019
బంధువులుఅమృతా రావు (సోదరి)

ప్రీతిక (జననం 1992 మే 29) మాజీ భారతీయ నటి, మోడల్, చలనచిత్ర కాలమిస్ట్, ఆమె ప్రధానంగా హిందీ టెలివిజన్, చిత్రాలలో నటిస్తుంది. ఆమె 2010లో చిక్కు బుక్కు తమిళ చిత్రంలో తొలిసారిగా నటించింది. బెంతెహా (2013-14)తో టెలివిజన్ అరంగేట్రం చేసిన ఆమె ఆలియా జైన్ అబ్దుల్లా పాత్రను పోషించినందుకు బాగా ప్రసిద్ది చెందింది.[1] దీనికి బెస్ట్ డెబ్యూ-ఫిమేల్ గోల్డ్ అవార్డు దక్కించుకుంది. GR8! కు గాను ITA అవార్డును హర్షద్ అరోరాతో తెరపై జంటగా గెలుచుకుంది.

ఆమె 2017లో లవ్ కా హై ఇంతేజార్ లో మోహిని అయాన్ మెహతా పాత్ర పోషించింది. ఆమె జీ5 చిత్రం 377 అబ్ నార్మల్ (2019)తో హిందీ చలనచిత్రసీమలో ప్రవేశించింది. కాకపోతే ఇదే ఆమె నటించిన చివరి చిత్రం.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

కర్ణాటకలోని మంగళూరులో ప్రీతికా రావు 1992 మే 29న జన్మించింది. ఆమె కొంకణి మాట్లాడే హిందూ కుటుంబం నుండి వచ్చింది. ఆమె సోఫియా కాలేజీ నుండి చరిత్రలో పట్టభద్రురాలైంది. అదే సమయంలో అడ్వర్టైజింగ్, జర్నలిజంలో డిప్లొమా కూడా పొందింది. ఆమె సోదరి అమృతా రావు బాలీవుడ్ నటి.

కెరీర్

[మార్చు]

ప్రీతికా రావు బెంగుళూరు మిర్రర్, డెక్కన్ క్రానికల్, ది ఏషియన్ ఏజ్ వార్తా పత్రికలకు కాలమిస్ట్ గా పనిచేసింది. ఆమె నటనా రంగ ప్రవేశం తర్వాత, న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ, న్యూయార్క్ నుండి బ్రాడ్‌కాస్ట్ జర్నలిజంలో డిప్లొమా కోర్సు కోసం యు.ఎస్.ఎ వెళ్లింది.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
Year Title Role Language Notes Refs
2010 చిక్కు బుక్కు మీనల్ "అమ్ము" తమిళం [2]
2012 ప్రియుడు మధు లత తెలుగు [3]
2015 రెబల్ ప్రీతిక కన్నడం [4]
2017 మెట్రో ములాకత్ ప్రియా హిందీ షార్ట్ ఫిల్మ్
2019 377 అబ్ నార్మల్ నేహా [5]

అవార్డులు, నామినేషన్లు

[మార్చు]

టెలివిజన్ అవార్డులు

[మార్చు]
Year Award Category Work Result Ref.
2014 ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డ్స్ హర్షద్ అరోరా తో కలసి GR8! ఆన్-స్క్రీన్ కపుల్ ఆఫ్ ది ఇయర్ బెంతెహా [6]
ఉత్తమ నటి - పాపులర్
ఇండియన్ టెలీ అవార్డ్స్ ఫ్రెష్ ఫేస్ (ఫీమెల్) [7]
భెస్ట్ యాక్ట్రెస్ పాపులర్
గోల్డ్ అవార్డ్స్ ఉత్తమ తొలి నటి [8]
హర్షద్ అరోరా తో ఉత్తమ చలన చిత్ర జోడి [9]
ఆసియన్ వ్యూయర్స్ టెలివిజన్ అవార్డ్స్ ఫీమెల్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ [10]

మూలాలు

[మార్చు]
  1. "Iam single and has no time to mingle says, Preetika Rao - Sakshi". web.archive.org. 2023-02-02. Archived from the original on 2023-02-02. Retrieved 2023-02-02.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. V Lakshmi (15 November 2010). "Preetika's ride to stardom". The Times of India. Archived from the original on 11 August 2011. Retrieved 15 November 2010.
  3. Rajamani, Radhika (1 December 2011). "Preetika: I am proud to be a part of Priyudu". Rediff.
  4. "Rebel movie review: Give this Aditya and Preetika starrer a miss". The Hindu. 9 May 2015.
  5. "377 Ab Normal is not about the legal but personal journeys of the protagonists: Faruk Kabir". The Indian Express (in ఇంగ్లీష్). 21 March 2019. Retrieved 26 April 2021.
  6. "The 14th Indian Television Academy Awards 2014". Indian Television Academy. Archived from the original on 7 November 2014.
  7. "Indian Telly Awards 2014 - Index". indiantelevision.com. Archived from the original on 2017-12-30. Retrieved 2023-02-02.
  8. "Zee Gold Awards 2014 Complete List Of Winners". www.filmibeat.com.
  9. "Zee Gold Awards 2014 Complete List Of Winners". www.filmibeat.com.
  10. "AVTA 2014: Winners List". BizAsia (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 2017-12-22. Retrieved 2019-04-09.