Jump to content

ప్రేమించి పెళ్ళి చేసుకో (1965 సినిమా)

వికీపీడియా నుండి
ప్రేమించి పెళ్ళి చేసుకో
(1965 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.శంకర్
తారాగణం శివాజీ గణేశన్,
దేవిక
సంగీతం విశ్వనాథన్-రామమూర్తి,
శంకరరావు
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
గీతరచన అనిసెట్టి
నిర్మాణ సంస్థ రత్నశ్రీ ఫిలిమ్స్
భాష తెలుగు

ప్రేమించి పెళ్ళి చేసుకో డిసెంబరు 11, 1965లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. దీనిని ఆందవన్ కట్టలై అనే తమిళ సినిమా నుండి డబ్ చేశారు.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: కె.శంకర్
  • నిర్మాతలు: ఎం.సురేందర్ రెడ్డి, డి.ఎల్.కాంతారావు
  • సంగీతం: విశ్వనాథన్ - రామమూర్తి, శంకరరావు
  • మాటలు, పాటలు: అనిసెట్టి

ప్రొఫెసర్ కృష్ణ తను పనిచేసే కాలేజీలో పిల్లలకు ఇతర పాఠాలతోపాటు బ్రహ్మచర్య పాఠాలు కూడా బోధిస్తాడు. ప్రేమను అవహేళన చేస్తాడు.ప్రేమ సాధారణంగా భగ్నమౌతుందనడానికి ఆధారంగా రోమియో జూలియట్, ఆంటోనీ క్లియోపాత్రా, అంబికాపతి - అమరావతి ఉదంతాలను పేర్కొంటాడు. అతని బ్రహ్మచర్యనిష్టకు, నిజాయతీకి విద్యార్థులందరూ అతడిని ఒక దేవుడిగా కొలుస్తారు. ఆ కాలేజీ విద్యార్థిని రాధ అతడిని ప్రేమిస్తుంది. అతని బ్రహ్మచర్య దీక్ష ఏపాటిదో తెలుసుకోవాలని పంతం పడుతుంది. కృష్ణ ఆమె అందానికి లొంగిపోతాడు. పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకుంటాడు. కాని రాధ మేనమామ, తల్లి ఆమెను ఒక కోటీశ్వరునికి ఇచ్చి పెళ్ళిచేయాలనుకుంటారు. ఒక రోజున రాధాకృష్ణులు బోటులో విహరిస్తూ ఉండగా రాధ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోతుంది. ఆమె మేనమామ ఆమెను రహస్యంగా రక్షించి రైలులో తీసుకువెళుతుండగా రైలు నుండి జారిపడిన రాధకు మతిమరుపు వస్తుంది. పూర్వస్మృతిని కోల్ఫోతుంది. తనను వివాహం చేసుకోదలచిన కోటీశ్వరుడి ఇంటిలో ఆమె చికిత్స పొందుతూ ఉంటుంది. ఈలోగా కృష్ణ కాలేజీ ఉద్యోగం కోల్ఫోయి ఒక గనిలో అటెండర్‌గా చేరతాడు. ఆ గని యజమానే రాధను చేసుకోదలచిన కోటీశ్వరుడు. తన ప్రేమ తొలిదశలో పాడిన ఒక పాటను కృష్ణ పాడుతుండగా వినిన రాధకు పూర్వస్మృతి వస్తుంది. ఆమె అమాంతంగా కృష్ణ దగ్గరకు వచ్చి అతనితో వచ్చివేస్తానంటుంది. కాని కృష్ణ ఆమె కోటీశ్వరునివద్దనే సుఖపడుతుందన్న ఉద్దేశంతో ఆమెను కాదంటాడు. ఇద్దరు కూడా ఆత్మహత్యోన్ముఖులై ఉండగా వారి నిర్మల ప్రేమకు హర్షించి ఆ కోటీశ్వరుడే వారిద్దరినీ వివాహం చెసుకోవలసిందిగా ఆశీర్వదిస్తాడు[1].

మూలాలు

[మార్చు]
  1. తుర్లపాటి (19 December 1965). "చిత్రసమీక్ష - ప్రేమించి పెళ్ళిచేసుకో". ఆంధ్రజ్యోతి దినపత్రిక. Retrieved 14 April 2020.[permanent dead link]