ప్రేమి విశ్వనాథ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రేమి విశ్వనాథ్
Premi Vishwanath.jpg
ప్రేమి విశ్వనాథ్
జననం
ప్రేమి విశ్వనాథ్

(1991-12-02) 2 డిసెంబరు 1991 (వయస్సు 29)
ఎడప్పల్లి, ఎర్నాకులం
జాతీయతభారతదేశం
వృత్తినటి, టెలివిజన్ వ్యాఖ్యత
క్రియాశీల సంవత్సరాలు2014 – ప్రస్తుతం
జీవిత భాగస్వాములువినీత్ భట్

ప్రేమి విశ్వనాథ్ కేరళ రాష్ట్రానికి చెందిన బుల్లితెర నటి. స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం ధారావాహికతో తెలుగు టీవిరంగంలోకి ప్రవేశించింది.[1][2]

జననం - విద్యాభ్యాసం[మార్చు]

ప్రేమి 1991, డిసెంబరు 2న విశ్వనాథ్, కాంచన దంపతులకు కేరళ రాష్ట్రం ఎర్నాకులంలోని ఎడప్పల్లిలో జన్మించింది. న్యాయవాద కోర్సు చేసింది. కొచ్చిలోని ఒక సంస్థకు లీగల్‌ అడ్వైజర్‌గా పనిచేసిన ప్రేమికి ఫొటోగ్రఫీ అంటే అమితమైన ఇష్టం. ఆ ఇష్టంతో కొన్ని పెళ్ళిళ్ళకు ఫొటోగ్రఫీ చేసింది.

కుటుంబ నేపథ్యం[మార్చు]

కేరళలో పేరుపొందిన జోతిష్యుడైన డా. టి.ఎస్‌. వినీత్‌ భట్‌ తో ప్రేమి వివాహం జరిగింది.[3]

టీవిరంగం[మార్చు]

నటనకు ముందు మోడలింగ్ రంగంలో గుర్తింపు సాధించిన ప్రేమి, 2013లో ఏసియానెట్ మలయాళం టెలివిజన్‌లో వచ్చిన కరతముత్తు అనే ధారావాహిక ద్వారా టీవిరంగంలోకి ప్రవేశించింది. ఆ ధారావాహిక మలయాళ టీవిరంగంలో సంచలనాన్ని సృష్టించి, ప్రేమి నటనకి మంచిపేరు వచ్చింది.[4][5] ఈ ధారావాహిక కార్తీకదీపం పేరుతో తెలుగులో రిమేక్ చేయబడి 2017, అక్టోబరు 16వ తేదీ నుంచి స్టార్ మాలో ప్రసారం చేయబడుతుంది. తెలుగులో కూడా ఈ ధారావాహిక మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాత మరో రెండు ధారావాహికల్లో, రెండు తమిళ చిత్రాల్లో నటించింది.

నటించిన ధారావాహికలు[మార్చు]

సంవత్సరం ధారావాహిక పేరు పాత్రపేరు ఛానల్ భాష ఇతర వివరాలు
2014-2015 కరతముత్తు కార్తీక బాలచంద్రన్ (కార్తు) ఏషియానెట్ మలయాళం మొదటి ధారావాహిక
2015 బాడాయి బంగ్లా ప్రేమి విశ్వనాథ్ ఏషియానెట్ మలయాళం చాట్ షో
2015 సెల్ మీ ది ఆన్సర్ (ఇండియన్ గేమ్ షో) ప్రేమి విశ్వనాథ్ ఏషియానెట్ మలయాళం గేమ్ షో
2015 కుట్టికలవర వ్యాఖ్యాత ఫ్లవర్స్ మలయాళం పార్వతి. ఆర్. కృష్ణ స్థానంలో (రియాలిటి షో)
2015-2016 మునుమణి మాయిలమ్మ ఫ్లవర్స్ మలయాళం ధారావాహిక
2016–2017 కాయకులమ్ కొచున్నియుడే మకన్ తామర సూర్యటీవి మలయాళం ధారావాహిక
2016 లాఫింగ్ విల్లా ప్రేమి విశ్వనాథ్ సూర్యటీవి మలయాళం చాట్ షో
2017 డీల్ ఆర్ నో డీల్ ప్రేమి విశ్వనాథ్ సూర్యటీవి మలయాళం గేమ్ షో
2017 – ప్రస్తుతం కార్తీకదీపం దీప స్టార్ మా తెలుగు ధారావాహిక
2019 గోరింటాకు దీప స్టార్ మా తెలుగు ధారావాహిక

పురస్కారాలు[మార్చు]

సంవత్సరం పురస్కారం విభాగం పాత్ర ఫలితం మూలాలు
2014 ఏషియానెట్ టీవి అవార్డులు ఉత్తమ తొలి నటి కరతముత్తు విజేత
జె.సి. ఫౌండేషన్ అవార్డు ఉత్తమ నటి
2018 స్టార్ మా పరివార్ అవార్డ్స్ ఉత్తమ జంట (పరిటాల నిరుపమ్ తో) కార్తీకదీపం నామినేట్
ఉత్తమ భార్య[6] విజేత

మూలాలు[మార్చు]

  1. సాక్షి, ఫ్యామిలీ (23 January 2019). "కార్తీక దీప". Sakshi. Archived from the original on 23 జనవరి 2019. Retrieved 23 November 2019. Check date values in: |archivedate= (help)
  2. ముచ్చట, సీరియల్స్ (2 August 2019). "సినీ హీరోయిన్లకు దీటుగా ఈమె తెలుగు చానెళ్లను దున్నేస్తున్నది..!". www.muchata.com. ఎం.ఎస్. రావు. Archived from the original on 1 జనవరి 2020. Retrieved 19 February 2020. Check date values in: |archive-date= (help)
  3. హెచ్ఎంటీవి, సినిమా (28 October 2019). "కార్తీక దీపం సీరియల్ 'దీప' రియల్ భర్త ఎవరో తెలుసా ?". www.hmtvlive.com. Archived from the original on 26 నవంబర్ 2019. Retrieved 26 November 2019. Check date values in: |archivedate= (help)
  4. M., Athira (24 September 2015). "Gem of a role". The Hindu. Retrieved 25 November 2019.
  5. Soman, Deepa (11 November 2014). "I am happy to play Karthika of Karuthamuthu: Premi Vishwanath". The Times of India. Retrieved 25 November 2019.
  6. టివి9 తెలుగు, బుల్లితెర (21 October 2019). "'వంటలక్కా'.. నీకు 'దీపం' అవార్డు వచ్చిందోచ్!". TV9 Telugu. Archived from the original on 26 నవంబర్ 2019. Retrieved 26 November 2019. Check date values in: |archivedate= (help)

ఇతర లంకెలు[మార్చు]