ప్లాస్టిక్
ప్లాస్టిక్ అంటే పోలిమర్లు -మోనోమర్లు అనే పునరుక్తమయ్యే యూనిట్లని కలిగి ఉన్న పెద్ద అణువులు. ప్లాస్టిక్ సంచుల విషయంలో, పునరుక్తమయ్యే యూనిట్లు “ఎథిలిన్”. పోలి ఎథిలిన్ ఏర్పడడానికి ఎథిలిన్ అణువులు బహురూపం చెందినపుడు, అవి పొడవైన కర్బన అణువుల చెయిన్లను ఏర్పరుస్తాయి. ఇందులో ప్రతి కార్బన్ రెండు హైడ్రోజన్ పరమాణువులతో బంధం ఏర్పరచుకుంటుంది.
ప్లాస్టిక్ తయారీ
[మార్చు]ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే పదార్థ అణువులతో కాకుండా కృత్రిమంగా తయారు చేసే అణు పుంజాలతో (ఈ అణుపుంజాలను పాలిమర్స్ అంటారు) నిర్మితమయ్యే పదార్థమే 'ప్లాస్టిక్'. ప్లాస్టిక్ తయారీలో మామూలుగా వాడే మూల పదార్థం ముడి చమురు (క్రూడ్ ఆయిల్). ప్లాస్టిక్ తయారీకి కావలసిన ముడి పదార్థాలను పొందటానికి ముందుగా ముడి చమురును వేడిచేయాలి. ఈ ప్రక్రియను చమురు శుద్ధి కార్మాగారం (ఆయిల్ రిఫైనరీ) లో సుమారు 400 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద జరుపుతారు. ఇందులో లభించే 'నాఫ్తా' అనే పదార్థాన్ని తిరిగి 800 డిగ్రీల వరకు వేడి చేసి, వెంటనే 200 డిగ్రీల ఉష్ణోగ్రతకు చల్లారుస్తారు. ఇలా చేసినప్పుడు మోనోమర్స్ అనే అతి చిన్న అణువులు ఒకదానితో ఒకటి కలిసి పొడవైన, శక్తిమంతమైన 'పాలిమర్స్' అనే అణు గొలుసులు ఏర్పడతాయి. ఈ పాలిమర్లకు వివిధ రసాయనాలను కలపడం ద్వారా వేర్వేరు ధర్మాలు కలిగి ఉండే కృత్రిమ పదార్థాలు అంటే 'ప్లాస్టిక్ పదార్థాలు' తయారవుతాయి. వివిధ విమానాల భాగాల తయారీలో స్టీలుకు బదులు ప్రస్తుతం ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తున్నారు.
ప్లాస్టిక్ పర్యావరణానికి పెద్ద సమస్యగా మారింది. ప్లాస్టిక్ వాడకం లేని పర్యావరణ ప్రపంచం శ్రేష్టమైనది. .ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 100 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది. దీని కోసం రోజు ఏడు 7 మిలియన్ బ్యారెల్స్ పెట్రోలియం ఖర్చవుతుంది. ఇతర రకాలుగా ఉపయోగపడే పెట్రోలియాన్ని ఉపయోగించి ప్లాస్టిక్ తయారుచేసే ఖర్చుతో పాటు, పర్యావరణానికి హాని కలుగుతోంది. క్యారీబ్యాగులతో సహా ఎన్నో గృహావసరాలకు వాడి పడేస్తున్న ప్లాస్టిక్ భూమిలో కరిగిపోవడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది.
సమస్యలు
[మార్చు]ప్లాస్టిక్ స్వతహాగా విషపూరితం లేదా హానికరం కాదు. కాని సేంద్రీయ, రసాయనాల రంగులు, పిగ్ మెంట్లు, ప్లాస్టిసైజర్లు, యాంటి ఆక్సిడెంట్లు, స్టెబిలైజర్లు, ధాతువులు వంటి ఎడిటివ్లతో ప్లాస్టిక్ సంచులు తయారుచేస్తారు. ప్లాస్టిక్ సంచులకి తళతళ లాడే రంగుని ఇవ్వడానికి ఉపయోగించే రంగులు, పిగ్ మెంట్లు, పారిశ్రామిక ఎజోడైలు. ఇందులో కొన్ని కేన్సరు కలుగచేసే పదార్థాలు ఉన్నాయి. ఈ సంచులలో ఆహార పదార్థాలు కట్టినప్పుడు అవి కలుషితమౌతాయి. పిగ్మెంట్లలో ఉండే కాడ్మియం వంటి బరువైన ధాతువులు కూడా చేరి ఆరోగ్యానికి హానికరమౌతాయి
ప్లాస్టిసైజర్లు అనేవి తక్కువ బాష్పశీల స్వభావముగల సేంద్రీయ ఎస్టర్లు. అవి, ఆహార పదార్థాలకి శ్రవించిడం ద్వారా వలస పోగలుగుతాయి. ప్లాస్టిసైజర్లలో కూడా కేన్సరు కలుగ చేసే పదార్థాలని కలిగి ఉంటాయి. యాంటి ఆక్సిడింట్లు, స్టెబిలైజర్లు సేంద్రీయ, అసేంద్రీయ రసాయనాలు. ఇవి మేన్యుఫేక్చరింగు విధాన సమయంలో, ఉష్ణ వియోగం చెందకుండా రక్షిస్తాయి.
కాడ్మియం, సీసం వంటి విషపూరిత ధాతువులు, ప్లాస్టిక్ సంచుల తయారీలో ఉపయోగించినప్పుడు కూడా స్రవించి ఆహార పదార్ధాలను కలుషితం చేస్తాయి. కాడ్మియం చిన్న మోతాదులలో శోషించినపుడు, వాంతులు కలుగజేస్తుంది. గుండె పెద్దది కావడానికి కూడా కారణమౌతుంది. ఎక్కువ కాలం సీసానికి గురైతే, మెదడు టిష్యూలు క్షీణించి పోతాయి.
సంచుల సమస్య
[మార్చు]ప్లాస్టిక్ సంచులని సరిగా పారవేయకపోతే, డ్రైనేజి సిస్టమ్ లోకి వెళ్ళి వాటిని మూసి వేయడం వలన అశుభ్రమైన వాతావారణాన్ని కలుగచేసి, నీటి ద్వారా వచ్చే వ్యాధులను కలుగచేస్తాయి. పునర్వినియోగం /రంగుల ప్లాస్టిక్ సంచులు, భూమిలోనికి శ్రవించి మట్టిని, ఉప మట్టి నీటిని కలుషితం చేసే కొన్ని రసాయనాలని కలిగి ఉండవచ్చు. పునర్వినియోగం చేయడానికి ఉపయోగించే యూనిట్లు పర్యావరణపరంగా పటిష్ఠమైనవి కాకపోతే, పునర్వినియోగం సమయంలో ఉత్పత్తి అయ్యే విషపూరిత ఆవిరి వలన పర్యావరణ సమస్యలు కలుగుతాయి. మిగిలిపోయిన ఆహారం కలిగిఉన్న లేదా ఇతర వ్యర్ధ పదార్ధాలతో కలిసిపోయి ఉన్న కొన్ని ప్లాస్టిక్ సంచులను జంతువులు తినడం వలన హానికరమైన ప్రభావాలు కలుగుతాయి. పాడవ్వని, చొచ్చుకు పోనీయని స్వభావంకల ప్లాస్టిక్ కారణంగా, మట్టిలో పారవేస్తే, భూగర్భ జల ఏక్విఫెర్లు నింపకుండా అడ్డుకోవచ్చు. అంతే కాకుండా, ప్లాస్టిక్ ఉత్పాదనల లక్షణాలని మెరుగు పరచడానికి, పాడయ్యే ప్రతి చర్యని నిరోధించడానికి సాధారణంగా ఎడిటివ్లను, ప్లాస్టిసైజర్లను, ఫిల్లర్లను, ఆజ్ఞిమాపకాలని, పిగ్ మెంట్లని ఉపయోగిస్తారు. ఇవి ఆరోగ్యం మీద ప్రభావాన్ని కలిగి ఉంటాయి.
పరిష్కారం
[మార్చు]ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా జనపనార లేదా గుడ్డ సంచులని వినియోగించడాన్ని జనరంజకం చేయాలి, ఆర్థికపరమైన ప్రయోజనాలతో ప్రేరేపించాలి. అయినప్పటికీ, పేపరు సంచులు తయారీలో చెట్లని కొట్టి వాటిని ఉపయోగించడం జరుగుతుంది, కాబట్టి వాటి వినియోగాన్ని పరిమితం చేయాలి. ముఖ్యముగా బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ సంచులని మాత్రమే ఉపయోగించాలి, మరి బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ని అభివృద్ధి చేయడానికి పరిశోధన జరుగుతుంది. ఇదీ నేటి ప్రపంచానికి చాలా హానికరం. అందుకోసం జనపనారతో తయారు చేసిన సంచులను ఉపయోగించాలి. ఒక ప్లాస్టిక్ కవరు భూమిలో కరిగిపోవుటకు 10లక్షల సంవత్సరాలు పడుతుంది. కావున వీలైనంతవరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి.
బంగాళదుంపలతో ప్లాస్టిక్
[మార్చు]బంగాళదుంపలతో క్యారీబ్యాగ్, స్పూన్స్‌లు, ప్లేట్స్, పిల్లల ఆట సామాగ్రిని కూడా తయారు చేసుకోవచ్చు. పర్యావరణానికి ఇవి ఎలాంటి హాని చేయవు. వీటిని వాడి పడేసిన తర్వాత కొద్ది రోజులకే కరిగి భూమిలో కలిసిపోతుంది. అంతేగాక వీటిని రీసైక్లింగ్‌కి (పునరుత్పత్తి పక్రియ ) కూడా వాడవచ్చు. బ్రిటన్, జపాన్‌లలో వీటిని విరివిగా వాడుతున్నారు. వీటిని అక్కడ స్పడ్‌వేర్ గా వ్యవహరిస్తున్నారు. ఇది సంప్రదాయ ప్లాస్టిక్ కంటే బలమైనది. మామూలు ప్లాస్టిక్ కంటే చవక. కిచెన్‌లో ఉపయోగించే కత్తులను సైతం బంగాళాదుంప, మొక్కజొన్నపిండితో తయారుచేస్తారు.[1] బంగాళదుంప నుండి తీసే పిండి బయో పాలిమర్ ప్లాస్టిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. బయో పాలిమర్ భూమిలో త్వరగా కరిగిపోయే గుణం ఉన్నందువలన పర్యావరణానికి ఎలాంటి హాని చేయదు. పొటాటో ప్లాస్టిక్‌ను తయారు చేసుకోవడం చాలా సులభం. బంగాళదుంపలు, వెజిటేబుల్ లిక్విడ్ గ్లిజరిన్, వైట్ వెనిగర్, ఫుడ్ కలరింగ్ లతో పొటాటో ప్లాస్టిక్ తయారు చేసుకోవచ్చు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Life Cycle of a Plastic Product". Americanchemistry.com (in ఇంగ్లీష్). Archived from the original on March 17, 2010. Retrieved July 1, 2011.