Jump to content

ఫానీ డివిలియర్స్

వికీపీడియా నుండి
ఫానీ డివిలియర్స్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
పెట్రస్ స్టెఫానస్ "ఫానీ" డివిలియర్స్
పుట్టిన తేదీ (1964-10-13) 1964 అక్టోబరు 13 (వయసు 60)
ట్రాన్స్‌వాల్ ప్రావిన్స్, దక్షిణాఫ్రికా
మారుపేరుఫానీ
ఎత్తు6 అ. 2 అం. (1.88 మీ.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్-మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 256)1993 26 December - Australia తో
చివరి టెస్టు1998 10 March - Pakistan తో
తొలి వన్‌డే (క్యాప్ 23)1992 7 December - India తో
చివరి వన్‌డే1997 8 November - Sri Lanka తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1985/86–1997/98Northern Transvaal
1990Kent
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 18 83 102 173
చేసిన పరుగులు 359 170 1,687 519
బ్యాటింగు సగటు 18.89 8.09 17.04 9.26
100లు/50లు 0/2 0/0 0/4 0/0
అత్యుత్తమ స్కోరు 67* 20* 68 23*
వేసిన బంతులు 4,805 4,422 20,498 8,765
వికెట్లు 85 95 427 204
బౌలింగు సగటు 24.27 27.74 22.37 26.82
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 5 0 23 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 2 0 3 0
అత్యుత్తమ బౌలింగు 6/23 4/27 7/80 5/30
క్యాచ్‌లు/స్టంపింగులు 11/– 15/– 53/– 24/–
మూలం: Cricinfo, 2008 22 December

పెట్రస్ స్టెఫానస్ "ఫానీ" డివిలియర్స్ (జననం 1964, అక్టోబరు 13) దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్. 1992 - 1998 మధ్యకాలంలో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు తరపున 18 టెస్ట్ మ్యాచ్‌లు, 83 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. కుడిచేతి ఫాస్ట్-మీడియం బౌలర్ గా, కుడిచేతి బ్యాట్స్‌మెన్‌గా రాణించాడు.

ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ వ్యాఖ్యాతగా పనిచేస్తున్నాడు. ఆస్ట్రేలియా - దక్షిణాఫ్రికా మధ్య జరిగిన 3వ టెస్టు మ్యాచ్‌లో 4వ రోజు రివర్స్ స్వింగ్ కోసం ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టు బాల్ ట్యాంపరింగ్ చేసిన తర్వాత చేసిన మోసాన్ని గుర్తించాడు. మ్యాచ్‌కు వ్యాఖ్యాతలలో ఒకరు, కెమెరా ఆపరేటర్‌లకు వారు మోసం జరిగే అవకాశం ఉందని గమనించాలని సూచించారు.[1]

క్రికెట్ రంగం

[మార్చు]

డివిలియర్స్ 1985-86లో నార్తర్న్ ట్రాన్స్‌వాల్ బి తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. తను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బౌలింగ్ ప్రారంభించాడు, రెండో ఇన్నింగ్స్‌లో 33 పరుగులకు 5 వికెట్లు తీసుకున్నాడు. 1990లో ఇంగ్లీష్ కౌంటీ జట్టు కెంట్ కోసం ఒక సీజన్ కూడా ఆడాడు.

1993-94లో తన 29 సంవత్సరాల వయస్సులో ఆస్ట్రేలియాలో టెస్ట్ పర్యటనకు ఎంపికయ్యాడు.మెల్‌బోర్న్‌లో జరిగిన మొదటి టెస్ట్‌కు ఎంపికయ్యాడు, కానీ సిడ్నీలో జరిగిన రెండో టెస్టులో డివిలియర్స్ టెస్ట్ స్థాయిలో తన సత్తా చాటుకున్నాడు. ఆస్ట్రేలియా విజయానికి కేవలం 117 పరుగులు చేయాల్సి ఉండగా, డివిలియర్స్ 43 పరుగులకు 6 వికెట్లు తీసుకున్నాడు. మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

క్రికెట్ తర్వాత

[మార్చు]

క్రికెట్ ఆట తరువాత డివిలియర్స్ దక్షిణాఫ్రికాలో టెలివిజన్ వ్యాఖ్యాతగా, కార్పోరేట్ స్పీకర్‌గా కూడా పనిచేశాడు. 1995 సన్ సిటీలో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో న్యాయనిర్ణేతగా పనిచేశాడు.

మూలాలు

[మార్చు]
  1. Cherny, Daniel (2018-03-26). "Broadcaster claims he tipped off cameramen". The Sydney Morning Herald (in ఇంగ్లీష్). Retrieved 27 March 2018.

బాహ్య లింకులు

[మార్చు]