ఫిరదౌసి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హకీం అబుల్ కాసిం ఫిర్దౌసి తూసి
حکیم ابوالقاسم فردوسی توسی
పుట్టిన తేదీ, స్థలం940 CE
తూస్, ఇరాన్
మరణం1020 (aged 79–80)
తూస్
వృత్తికవి
కాలంససానిడులు, గజనవీడులు
రచనా రంగంఫార్శీ కవిత్వం, జాతీయ ఇతిహాసం

'ఫిరదౌసిగా పిలవబడే హకీం అబుల్-ఖాసిం ఫిర్దౌసీ తూసీ'Hakīm Abul-Qāsim Ferdowsī Tūsī (ఫార్సీ: حکیم ابوالقاسم فردوسی توسی‎, most commonly known as Ferdowsi (فردوسی) (9351020) అత్యంత గౌరవనీయమైన పర్షియన్ కవి (940 – 1020 ). ఈయన పర్షియా (ఇరాన్) జాతీయ ఇతిహాసమైన షానామా అను మహా గ్రంథాన్ని రచించాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఫిరదౌసి తండ్రిపేరు ఇసాఖ్.ఇతను హిజరీ 940 ప్రాంతంలో తౌసు అనే పట్టణంలో జన్మించాడు.అతడు జన్మించేటప్పుడు ఇసాఖ్ ఒకకల కన్నాడు.తన కుమారుడు ఒక వృక్షముమీద పాడుతూ ఉన్నట్లు, చుట్టూ చేరి ప్రజలు కరతాళధ్వనులు చేస్తున్నట్లు అతడు కలలో చూచాడు.దీని ఫలితం అతడు పెద్ద కవి అవుతాడని జ్యోతిష్యులు చెప్పారట. ఫిరదౌసి చిన్నప్పటి నుండి చాలా గ్రంథాలు చదివి, మంచి జ్ఞానాన్ని ఆర్జించి చక్కని కవిత్వపటుత్వము, కత్తివంటి పదునుగల భాషాశైలి అలవడ్డ తరువాత అతడు షానామా లేదా షహనామా అనే గ్రంథము వ్రాయుట మొదలుపట్టాడు.షానామా అనగా రాజుల చరిత్ర అని అర్ధము.పారశీకరాజుల వీరచరిత్ర అందులో కథావిషయం.ఫిరదౌసికి పూర్వమే షానామ దఖీఖీ అనే కవి వ్రాసి 1000 పద్యాల వరకు వ్రాసి తాను ప్రేమించిన ఒకబానిస చేతికత్తికి బలై మరణించాడు.

ఫిరదౌసి అది వ్రాయ సంకల్పించగానే అతని కలలో కనబడి "షానామా నేను ప్రారంభించి క్రొంత వ్రాసి నసించాను నీవు ఆభాగం అట్లేఉంచి మిగిలినభాగం పూర్తిచేసి, దీనివిషయంలో మరొక అభాగ్యుడు కూడా కృషిచేసాడని లోకం గుర్తించేటట్లు చేయు" అని దఖీఖీ చెప్పాడట.ఫిరదౌసి తక్కిన భాగమే వ్రాయమొదలు పెట్టాడు. షానామా (షహనామా) బాహిరీ-తాఖ్ రబ్ అనే పార్సీ వృతాములలో 60,000 పద్యాలతో కూడిన గొప్ప ఇతిహాస గ్రంథాలలో ఒకటి.పలు ప్రపంచదేశ భాషలలోనికి ఇది తర్జుమా చేయబదినది కూడా.

తనగ్రంధము హూర్చి ఫిరదౌసి ఇట్లు వ్రాసుకున్నాడు: నా గ్రంథం చదివే ప్రతీ స్త్రీ, పురుషుడైనా వీరకృత్యాలు చేయుటకు సంసిద్ధులవుతారు. నేటి గృహాఉ ఎండ వానలకు నశించగలవు కాని తుఫాను, వర్షం ఏవీ నేను కట్టిన కావ్యసౌధాన్ని పడగొట్టలేవు. స్వర్గం నాకవిత్వం ముందు శిరస్సు వాల్చింది.

ఫిరదౌసి షానామా వ్రాస్తున్న విషయం దేశంలో వ్యాపించింది. అతని కావ్యం విన్నవారంతా ఆతనిని సన్మానిస్తూ ఉండేవారు.ఈవార్త కొంతకాలానికి గజనీ పురసుల్తాను మహమాదు ఆస్థానంలోకి కూడా ప్రాకగా, భారతదేశం మీదకి అనేక దండయాత్రలు చేసిన గజనీ ఫిరదౌసిని తన ఆస్థానానికి రప్పించేడు. సుల్తాను ఆస్థానం చేరే ముందు అక్కడ ఒక విచిత్ర సంఘటన జరిగింది. గజనీ పట్టణంబైట ఉద్యానవనంలో అతనిని ఆంసరీ, ఆస్ జాదీ, పరూఖి అనే ముగ్గురు ఆస్థాన కవులు కలుసుకున్నారు. పల్లిటూరి వానివలే కనిపిస్తున్న ఫిరదౌసిని చూచు నీవెవరని ఆతని వారు ప్రశ్నించగా నేనొక కవి నని అతడు బదులు చెప్పాడు.నాగరీకులైన వారు ఆతనిని పరీక్షంచవలననే అభిప్రాయంతో షక్ అనే అంత్యప్రాసతో కూడిన పద్యపాదములు తలాఒకటి చదివారు.పారశీకభాషలో షక్ అనే అక్షరంతో ముగిసే శబ్దాలు మూడుమాత్రమే ఉండగా నాల్గవది ఫిరదౌసి చెప్పాడు. అప్పుడు వారు ఆశ్చర్యపోగా ఫిరదౌసిని ఆస్థాన కవిగా నియమించారు. సుల్తాను ఆస్థానం ప్రవేశించి ఫిరదౌసి తన కావ్యం నుండి సోరుబురుస్తము ల కథాభాగం వినిపించాడు.అతని ఆవేశకరమైన రచనానైపుణ్యానికి సుల్తాను ఆస్థానమంతా దిగ్భ్రాంతి చెంది అతనిని అందరు ప్రశంసించారు.సుల్తాను సింహాసనం దిగి మహాగౌరవాన్ని ప్రదర్సించి షానామా తన ఆస్థానంలోనె ఉండి ముగించమని కోరేడు.ప్రతిపద్యానికీ ఒక సువర్ణ దీనారు ఇస్తానని వాగ్దానం చేసాడు. సుల్తాను కోరిక కాదనలేక ఫిరదౌసి సమ్మతించాడు. సుల్తాను అతనికి విశాలమైన భవనం, తగిన సామగ్రి, తాను నెలకొల్పిన పెద్దగ్రంధ భాంఢాగారం, మొదలైనవన్నీ ఇచ్చి అన్ని సౌకర్యాలు ఏర్పరచి గ్రంథ విషయాన్ని అనుసరించి అతని మందిరంలో జాతీయవీరుల చిత్రపటాలను ఏర్పరిచాడు.

ఫిరదౌసి తన శక్తినంతా వినియోగించి 30సం. శ్రమించి గ్రంథం పూర్తిచేసి సుల్తాను చేతిలో పెట్టాడు.సుల్తాను తన వాగ్దానం ప్రకారము సభికుడు/ప్రతినిధికి ఇచ్చి పంపెను ఆతడు సువర్ణదీనారులకు బదులు వెండి నిష్కమములు కొన్ని సంచులలో వేసి పంపినాడు.ఫిరదౌసి ఈ అవమానం సహించలేకపోయాడు. ఈ అవమానంతో ఫిరదౌసి క్రుంగి ఇతరౌలకు చెప్పకుండా గజనీ పట్టణం విడిచి వెళ్ళిపోయాడు.పోయేటప్పుడు ఒక దుప్పటీ ఒక కర్రమాత్రం తనతో తీసుకున్నాడు. అప్పటికి అతని వయస్సు 75సం. దాటినది.

వెళ్ళేముందు తన ఆవేదనని తెలుపుతూ కొన్ని పద్యాలు వ్రాసి సుల్తానుకు పంపాడు. విషయం తెలుసుకున్న సుల్తాను మోసం చేసిన సభికుడిని మరణ దండన విధించెను. నగరంలోని పెద్ద మసీదు వద్ద తన హతాశుని వెళ్ళడిస్తూ ఒకపద్యం వ్రాశాడు. దేశ చరిత్రలోవలె వాజ్మయంలో కూడా గజనీ సుల్తాను అపకీర్తిని ఈపద్యాలు చిరస్థాయిగా షేసివేసినవి. అటుపై సుల్తాను అతనికోసం ఆరునెలలు వెదకించాడు.కాని మరల లభించలేదు.

ఫిరదౌసి దేశ సంచారం చేస్తూ బాగ్దాదు పట్టణం చేరుకున్నాడు. దారిలో అతనిని అందరు సన్మానించారు. కాని సుల్తానుకు భయపడి ఆతనికి ఆశ్రయం ఇవ్వలేకపోయేవారు.ఫిరదౌసి తరువాత యూసూఫు జులేఖా అనే ప్రేమకావ్యం వ్రాశాడు.కొంతకాలానికి అతని స్వగ్రామం తౌసు చేరుకున్నాడు.

ఇలావుండగా కొంతకాలానికి సుల్తాను హిందూదేశం ముట్టడి ముగించి తన పట్టణం వెళ్ళిపోతూ మార్గంలో ఒక శత్రువులకోట ముట్టడివేశాడు.ఈవార్త తెలిసి కోటలోనివారు ఫిరదౌసి ఒకప్పుడు వ్రాసిన నీకంటే గొప్ప చక్రవర్తులు ఎందరో ఈప్రపంచం నుండి వెళ్ళిపోయారు నీవెంతకాలం ఈదండయాత్రలు చేస్తూ ఉంటావు అనుభావంగల పద్యభాగం వ్రాసి సుల్తానుకు పంపారు. సుల్తాను సిగ్గుతో ఆముట్టడి విరమించి ఫిరదౌసి ఉనికి తెలుసుకొని గజనీ పట్టణం చేరిన తరువాత క్షమాపణ తెలుపుతూ తొలివాగ్దానం చేసిన ధనం కంటే అధికముగా రాయబారుల చేతికిచ్చి పంపించేడు.

కానీ ఫిరదౌసి ఆసన్మానం చూడలేకపోయాడు.రాయబారులు తౌసు నగరం చేరేసమయానికి అతడు మర్త్యలోకం విడిచి వెళ్ళిపోయాడు. ధనరాసులతో వారి పట్టణంలోనికి ఒక ద్వారం గుండా ప్రవేశిస్తుండగా అతని మృతకళేబరము మరొక ద్వారం నుండి కదలిపోయింది.

ఇరాన్ లోని తూస్ నగరంలోని ఫిరదౌసి సమాధిపై లిఖించబడిన షాహ్‌నామా చిత్రాలు.

షానామా ఇరాన్ రాజుల మరియూ రాజ్యాల చరిత్రను వివరించే గ్రంథము. ఈయన జీవితాంతం శ్రమించి రాసిన గ్రంథమునకు సుల్తాను మాట తప్పి బంగారు నాణెములకు బదులు వెండి నాణెములను ఇచ్చెను. అతను వెండి నాణెములను స్వీకరించలేదు . సుల్తాను తప్పిదము తెలుసుకొని బంగారు నాణెములను పంపేటప్పటికి ఆ దిగులుతో మరణించిన ఫిరదౌసి శవము వేరొక ద్వారము గుండా బయటికి వచ్చెను. కానీ సుల్తాను అతని మరణానంతరము తన తప్పును తెలుసుకొని ఫిరదౌసి జ్ఞాపక చిహ్నముగా ఒక కట్టడమును కట్టించెను.

తెలుగు సాహిత్యంలో ఫిరదౌసి

[మార్చు]

ఈ కథను ఎంతో హృద్యంగా గుర్రం జాషువా తెలుగు వారికి పరిచయం చేసాడు. ఇందులోని ప్రతి పద్యం ఒక ముత్యం.

అడవిలో వెళ్ళే బాటసారులను ఒక ఎండుటాకు కూడా భయపెడ్తుంది, అనే పద్యం ...నాటి పాంథులనదేమో అదరి బెదరించె నొక ఎండుటాకు కూడా ఇలా ప్రతీ పద్యం ఎంతో బావుంటుంది.

సుల్తాను మాట తప్పినప్పుడు చెప్పిన పద్యం

అల్లా తోడని పల్కి నా పసిడి కావ్య ద్రవ్యంబు వెండితొ చెల్లింపగ దొర కన్న టక్కరివి
నీచే పూజితుందైనచో అల్లకున్ సుఖమే...

వంటి పద్యాలు ఫిరదౌసి మనో భావలను పాతఠకుల మనొ ఫలకం మీద నిలచి పోయేల చేస్తాయి.

ఫిరదౌసి సమాధి

చివరగా ఫిరదౌసి మసీదు గోడలపై రాసిన పద్యం జాషువా పదాలలో

ముత్యముల కిక్కయైన సముద్రమునను
పెక్కుమారులు మునకలు వేసినాడ
భాగ్యహీణుడ ముత్యమ్ము వదడయనైతి
వనధి నను మ్రింగ నోరు విచ్చినది తుదకు

ఇవీ చూడండి

[మార్చు]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • E.G. Browne. Literary History of Persia. (Four volumes, 2,256 pages, and twenty-five years in the writing). 1998. ISBN 0-7007-0406-X
  • Jan Rypka, History of Iranian Literature. Reidel Publishing Company. 1968 OCLC 460598 ISBN 90-277-0143-1
  • Shirzad Aghaee, Imazh-ha-ye mehr va mah dar Shahnama-ye Ferdousi (Sun and Moon in the Shahnama of Ferdousi, Spånga, Sweden, 1997. (ISBN 91-630-5369-1)
  • Shirzad Aghaee, Nam-e kasan va ja'i-ha dar Shahnama-ye Ferdousi (Personalities and Places in the Shahnama of Ferdousi, Nyköping, Sweden, 1993. (ISBN 91-630-1959-0)
  • Josef Wiesehöfer, Ancient Persia, I.B.Tauris, (ISBN 18-606-4675-1)
  • A. Shapur Shahbazi, Ferdowsi: a critical biography, Harvard University, Center for Middle Eastern Studies, 1991 (ISBN 09-3921-483-0)
  • Sandra Mackey, W. Scott Harrop, The Iranians: Persia, Islam and the soul of a nation, University of Michigan, 2008 (ISBN 05-2594-0057)
  • 1933 ఆంధ్ర ప్రత్రిక సంవత్సర సంచిక-వ్యాసం ఫిరదౌసి-వ్రాసినవారు పురిపండా అప్పలస్వామి

బాహ్య లంకెలు

[మార్చు]

మూస:Wikisourceauthor

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

Media related to ఫిరదౌసి at Wikimedia Commons

"https://te.wikipedia.org/w/index.php?title=ఫిరదౌసి&oldid=3148738" నుండి వెలికితీశారు