Jump to content

ఫేమస్ లవర్

వికీపీడియా నుండి
ఫేమస్ లవర్
దర్శకత్వంకె. బాలకృష్ణన్
రచనమోనా పళనిసామి
కె. బాలకృష్ణన్
నిర్మాతకె. గురునాథన్
పి. ఈలప్పన్
ఎం. ధర్మరాజన్
బాలకృష్ణన్ కె
తారాగణం
ఛాయాగ్రహణంసి. ప్రేమ్ కుమార్
కూర్పురాజ మొహమ్మద్
సంగీతండి. ఇమ్మాన్
నిర్మాణ
సంస్థ
శ్రీ వల్లీ స్టూడియో[1]
పంపిణీదార్లుజె.ఎస్.కె ఫిల్మ్ కార్పొరేషన్
విడుదల తేదీ
31 జనవరి 2014 (2014-01-31)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఫేమస్ లవర్ 2014లో విడుదల అయిన తెలుగు సినిమా. శ్రీ వల్లీ స్టూడియో బ్యానర్ పై కె. గురునాథన్ నిర్మించిన ఈ చిత్రానికి కె. బాలకృష్ణన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఐశ్వర్య రాజేష్ నటించారు. ఈ సినిమా తమిళ "రమ్మీ" కి అనువాదం.

నటవర్గం

[మార్చు]

సత్య శ్రీకాకుళంలోని కాలేజీలో చదువుతుంటాడు. అక్కడ జోసెఫ్ పరిచయం అవుతాడు. వాళ్లు ఒకే రూమ్ లో ఉండి చదువుకుంటారు. సత్య అదే కాలేజీలో చదివే మీనాక్షితో ప్రేమలో పడతాడు. ఆమె ఆ గ్రామ సర్పంచ్ తమ్ముని కూతురు. ఆ గ్రామ సర్పంచ్ కి కుల పిచ్చి ఎక్కువ. కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళని చంపేస్తాడు. మీనాక్షి తన తండ్రికి తన ప్రేమ గురించి తెలిస్తే సత్యని చంపేస్తాడని భయపడుతుంది. సత్య, జోసెఫ్ మరొక క్లాస్‌మేట్‌తో గొడవ కారణంగా కళాశాల హాస్టల్ నుండి బహిష్కరించడి మీనాక్షి గ్రామానికి వచ్చి ఉంటారు. జోసెఫ్ అదే ఊళ్ళో ఉండే స్వర్ణని ప్రేమిస్తాడు. స్వర్ణ మీనాక్షికి అక్క అని తెలుసుకుంటాడు. స్వర్ణ తండ్రి స్వర్ణ ప్రేమ గురుంచి తెలిసి జోసెఫ్ ని చంపాలనుకుంటాడు. స్వర్ణ, జోసెఫ్ ఊరు నుండి వెళ్ళిపోయి పెళ్లిచేసుకుంటారు. స్వర్ణ తండ్రి అనుచరులు జోసెఫ్ ని చంపేసి స్వర్ణని ఇంటికి తీసుక వస్తారు. ఇంట్లో ఒక గదిలో స్వర్ణని బంధిస్తారు. మీనాక్షి ప్రేమ కూడా ఇంట్లో తెలిసి సత్యని చంపాలనుకుంటారు. స్వర్ణ తన తండ్రిని చంపి సత్య, మీనాక్షిలను కలుపుతుంది.[3]

పాటలు

[మార్చు]
  • నిన్ను కొలుచుకునే భాగ్యం
  • అందమైన నవ్వే విసిరి
  • ఎదురుంటే యవ్వన వీణ
  • కలిసొచ్చిన కాలంల

మూలాలు

[మార్చు]
  1. "Rummy Tamil Movie Stills". moviegalleri.net. Archived from the original on 5 ఫిబ్రవరి 2013. Retrieved 3 February 2013.
  2. "Famous Lover Trailer | Vijay Sethupathi| Aishwarya Rajesh | TeluguOne Cinema". www.teluguone.com. Retrieved 2022-07-09.
  3. "ఫేమస్ లవర్". www.behindwoods.com. Retrieved 2022-07-09.