ఫ్రాన్సిస్ మారియన్
ఫ్రాన్సిస్ మారియన్ | |
---|---|
జననం | మారియన్ బెన్సన్ ఓవెన్స్ 1888 నవంబరు 18 శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా, యుఎస్ |
మరణం | 1973 మే 12 లాస్ ఏంజలెస్, కాలిఫోర్నియా, యుఎస్ | (వయసు 84)
వృత్తి | |
క్రియాశీల సంవత్సరాలు | 1912–1972 |
జీవిత భాగస్వామి | వెస్లీ డి లప్పే
(m. 1906; div. 1910)రాబర్ట్ పైక్
(m. 1911; div. 1917) |
ఫ్రాన్సెస్ మారియన్ (1888, నవంబరు 18[1] - 1973, మే 12) అమెరికన్ స్క్రీన్ ప్లే రచయిత్రి, దర్శకురాలు, పాత్రికేయురాలు, రచయిత్రి. 20వ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధ మహిళా స్క్రీన్ ప్లే రచయిత్రుల్లో ఒకరిగా, రెండు అకాడమీ అవార్డులు గెలుచుకున్న మొదటి రచయిత్రిగా నిలిచింది.
జననం
[మార్చు]మారియన్ 1888, నవంబరు 18న లెన్ డి. ఓవెన్స్ - మిన్నీ బెన్సన్ దంపతులకు కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో, బెన్సన్ ఓవెన్స్ లో జన్మించింది.[2] ఒక అక్క మౌడ్, ఒక తమ్ముడు లెన్ ఉన్నారు.[2] 10 సంవత్సరాల వయస్సులో తన తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో తన తల్లితో కలిసి నివసించింది. 12 సంవత్సరాల వయస్సులో తన టీచర్ కార్టూన్ స్ట్రిప్ గీస్తూ పట్టుబడి, పాఠశాల చదువు నుండి తప్పుకుంది. 16 సంవత్సరాల వయస్సులో శాన్ మాటియోలోని ఒక పాఠశాలకు, శాన్ ఫ్రాన్సిస్కోలోని మార్క్ హాప్కిన్స్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్‌కు బదిలీ చేయబడింది. 1904 నుండి 1906 శాన్ ఫ్రాన్సిస్కో భూకంపం నేపథ్యంలో జరిగిన అగ్నిప్రమాదంలో పాఠశాల కాలిపోయే వరకు ఆ పాఠశాలలో చదువుకుంది.[3]
సినిమారంగం
[మార్చు]తన కెరీర్‌లో 325కి పైగా స్క్రిప్ట్‌లు రాసింది.[4] మారియన్ ఫిల్మ్ మేకర్ లోయిస్ వెబర్ సినిమాతో తన సినీరంగ జీవితాన్ని ప్రారంభించింది. సౌండ్ ఫిల్మ్‌లు రాయడానికి ముందు నటి మేరీ పిక్‌ఫోర్డ్ నటించిన అనేక మూకీ సినిమా దృశ్యాలను రాసింది.
1931లో ది బిగ్ హౌస్ సినిమా రచనకు అకాడమీ అవార్డును గెలుచుకుంది. 1932లో ది చాంప్‌సినిమాకు ఉత్తమ కథా రచయిత్రి అకాడమీ అవార్డును అందుకుంది. 1930లో స్నేహితురాలు మేరీ డ్రస్లర్, బీరీ నటించిన మిన్ అండ్ బిల్‌కు సహ రచయితగా ఉన్నది. 300 స్క్రిప్ట్‌లు రాయడంతోపాటు 130కి పైగా సినిమాలను నిర్మించింది.
సినిమాలు (కొన్ని)
[మార్చు]- కెమిల్లె
- ది ఫౌండ్లింగ్
- ఎ లిటిల్ ప్రిన్సెస్
- సన్నీబ్రూక్ ఫార్మ్ రెబెక్కా
- ది పూర్ లిటిల్ రిచ్ గర్ల్
- స్టెల్లా మారిస్
- అమరిల్లీ ఆఫ్ క్లాత్స్-లైన్ అల్లే
- సినిమా మర్డర్
- పొల్లన్న
- ది ఫ్లాపర్
- ది రెస్ట్‌లెస్ సెక్స్
- ది టోల్ ఆఫ్ ది సీ
- ది ఫేమస్ మిసెస్ ఫెయిర్
- సైథెరియా
- స్టెల్లా డల్లాస్
- ది స్కార్లెట్ లెటర్
- రెడ్ మిల్
- ది అవేకనింగ్
- ది బిగ్ హౌస్
- రోగ్ సాంగ్
- అన్నా క్రిస్టీ
- సీక్రెట్ సిక్స్
- ది చాంప్
- బ్లాండీ ఆఫ్ ది ఫోలీస్
- ఎమ్మా
- పెగ్ ఓ మై హార్ట్
- కెమిల్లె
- రిఫ్రాఫ్
- పూర్ లిటిల్ రిచ్ గర్ల్
- గ్రీన్ హెల్
ప్రచురించిన రచనలు
[మార్చు]- మిన్నీ ఫ్లిన్ ఎన్.వై: బోని అండ్ లైవ్‌రైట్, 1925
- సీక్రెట్ సిక్స్ ఎన్.వై: గ్రాసెట్ & డన్‌లాప్, 1931
- లోయ ప్రజలు ఎన్.వై: రేనాల్ & హిచ్‌కాక్, 1935
- మోలీ, ఆమెను ఆశీర్వదించండి . ఎన్.వై: హార్పర్ & బ్రదర్స్, 1937
- వెస్ట్‌వర్డ్ ది డ్రీం . గార్డెన్ సిటీ ఎన్.వై: డబుల్‌డే అండ్ కంపెనీ, 1948
- ది పాషన్స్ ఆఫ్ లిండా లేన్ . ఎన్.వై: డైవర్సీ పబ్లికేషన్స్, 1949
- పౌడర్ కెగ్ . బోస్టన్: లిటిల్, బ్రౌన్ & కో., 1953
- ఆఫ్ విత్ దేర్ హెడ్స్!: ఎ సీరియో-కామిక్ టేల్ ఆఫ్ హాలీవుడ్ . ఎన్.వై: ది మాక్‌మిలన్ కంపెనీ, 1972
మరణం
[మార్చు]చాలా సంవత్సరాలపాటు ఎంజిఎం స్టూడియోస్‌తో ఒప్పందంలో ఉంది. స్వతంత్రంగా సంపన్నురాలైన మారియన్,1946లో హాలీవుడ్‌ని విడిచిపెట్టి నాటకాలు, నవలలు రాయడానికి ఎక్కువ సమయం కేటాయించింది.
ఫ్రాన్సెస్ మారియన్ 1972లో ఆఫ్ విత్ దెయిర్ హెడ్స్: ఎ సీరియో-కామిక్ టేల్ ఆఫ్ హాలీవుడ్‌ను ప్రచురించింది. లాస్ ఏంజిల్స్‌లో రక్తనాళము పగిలి 1973, మే 12న మరణించింది.[5]
మూలాలు
[మార్చు]- ↑ Beauchamp, Cari (1997). Without Lying Down. University of California Press. pp. 22–37. ISBN 978-0-520-21492-7.
- ↑ 2.0 2.1 1900 United States Federal Census
- ↑ Lamphier, Peg A.; Welch, Rosanne (January 23, 2017). Women in American History: A Social, Political, and Cultural Encyclopedia and Document Collection [4 volumes] (in ఇంగ్లీష్). ABC-CLIO. p. 246. ISBN 978-1-61069-603-6.
- ↑ Kwong, Jess. "17 Women Who Made History — That You've Never Heard Of". www.refinery29.com (in ఇంగ్లీష్). Retrieved 2023-06-29.
- ↑ Sicherman, Barbara; Hurd Green, Carol (1980). Notable American Women: The Modern Period : A Biographical Dictionary. Belknap Press of Harvard University Press. p. 457. ISBN 0-674-62732-6.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఫ్రాన్సిస్ మారియన్ పేజీ
- Works by ఫ్రాన్సిస్ మారియన్ on ఓపెన్ లైబ్రరీ at the ఇంటర్నెట్ ఆర్కివ్స్
- Frances Marion Archived డిసెంబరు 24, 2017 at the Wayback Machine at the Women Film Pioneers Project
- ఫ్రాన్సిస్ మారియన్ - ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో
- Frances Marion article in Photoplay 1917