Jump to content

ఫ్రెడ్ స్మిత్

వికీపీడియా నుండి
ఫ్రెడ్ స్మిత్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఫ్రెడరిక్ విలియం స్మిత్
పుట్టిన తేదీ31 March 1861
యుటెన్‌హేజ్, కేప్ కాలనీ
మరణించిన తేదీ1914 ఏప్రిల్ 17(1914-04-17) (వయసు 53)
జోహన్నెస్‌బర్గ్, ట్రాన్స్‌వాల్
బ్యాటింగుకుడిచేతి వాటం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 8)1889 12 March - England తో
చివరి టెస్టు1896 2 March - England తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test First-class
మ్యాచ్‌లు 3 5
చేసిన పరుగులు 45 140
బ్యాటింగు సగటు 9.00 15.55
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 12 43
వేసిన బంతులు 355
వికెట్లు 3
బౌలింగు సగటు 44.33
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 2/73
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 2/–
మూలం: Cricinfo, 2022 13 November

ఫ్రెడరిక్ విలియం స్మిత్ (1981, మార్చి 31 - 1914, ఏప్రిల్ 17) దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ ఆటగాడు.[1] దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు తరపున 1889[2] నుండి 1896 వరకు మూడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.

జననం, కుటుంబం

[మార్చు]

ఫ్రెడ్ స్మిత్ 1981, మార్చి 31న రైతులైన జాన్ - ప్రింరోస్ స్మిత్‌ దంపతుల ఆరుగురు పిల్లలలో రెండవ సంతానంగా, పెద్ద కుమారుడిగా జన్మించాడు. 1871లో కుటుంబం బ్లూమ్‌ఫోంటైన్‌కు వెళ్ళి, అక్కడ జాన్ గుమస్తాగా పనిచేశాడు. ఫ్రెడ్ 1888 మేలో మరియా కాంప్‌బెల్‌ను వివాహం చేసుకున్నాడు.

క్రికెట్ రంగం

[మార్చు]

స్మిత్ కింబర్లీ, ట్రాన్స్‌వాల్ రెండింటికీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ట్రాన్స్‌వాల్ క్రికెట్ యూనియన్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాడు. స్ప్రింటర్‌గా ఎన్నో ట్రోఫీలు కూడా గెలుచుకున్నాడు. త్వరగా స్కోర్ చేసే బ్యాట్స్‌మన్ గా, వికెట్ కీపర్ గా, అప్పుడప్పుడు బౌలర్ గా రాణించాడు. 1880ల చివరలో మైనర్ క్రికెట్‌లో కింబర్లీకి విజయవంతమైన బ్యాట్స్‌మన్, 1888-89లో ఇంగ్లండ్‌తో జరిగిన దక్షిణాఫ్రికా మొదటి టెస్టులో ఆడేందుకు ఎంపికయ్యాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Fred Smith Profile - Cricket Player South Africa | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-12-22.
  2. "SA vs ENG, England tour of South Africa 1888/89, 1st Test at Gqeberha, March 12 - 13, 1889 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-12-22.
  3. (1998). "Frederick William Smith: File Closed". Retrieved on 18 February 2017. Archived 2017-02-19 at the Wayback Machine

బాహ్య లింకులు

[మార్చు]