Jump to content

బంజారా తాండా

వికీపీడియా నుండి


తాండా వ్యవస్థ

[మార్చు]

తాండా బంజారా,లంబాడీ,సుగాలి కమ్యూనిటీ ప్రజలు నివసించే ప్రాంతాన్ని తాండ, తాండా, తాండో,తండా,టాండో అని వివిధ పేర్లతో పిల్చుకుంటారు. తాండా బంజారా వ్యాపారుల సముదాయమని అర్థం. తాండా లంబాడీ గిరిజనుల విలక్షణమైన సంస్కృతిని పెంపొందించే సమాజ సమూహము.సహజ సృష్టిని సంరక్షించే ఒక స్వతంత్ర ఆదిమ వ్యవస్థ.తమ అవసరాలను తీర్చుకోవటం కోసం,తమ దైనిక జీవన వ్యవహారాలను చూసుకోవటం కోసం బంజారా జాతి జన సముహమునే తాండా/ లేదా తాండాలు అంటారు.[1]

తాండలోని ముఖ్యులు

[మార్చు]

ప్రాచిన కాలం నుండి నేటి ఆధునిక కాలం వరకు లంబాడి గిరిజన సాంప్రదాయాలు,ఆచారవ్వహరాలు కట్టుబాట్లు పాటిస్తూ పరిపాలనా సౌలభ్యంగా చేసుకొని నేటికి కొనసాగుతున్న విధానమే తాండా పాలనా వ్యవస్థ.తాండాలోని ముఖ్యులు లో నాయక్,కార్భారి,డావ్. తాండా అధిపతిని నాయక్ (వీరుడు) అంటారు. అతని భార్య (వీరవనిత) నాయకణ్ సహచరులు తాండా రెండో స్థానంలో కర్భారి,అతని భార్యను కార్భాణీ, మూడో స్థానంలో డావ్,అతని భార్య డావణ్, నాల్గో స్థానంలో డావ్ గేర్యా,అతని భార్య డావ్ గేరణి,తాండాలోని ఒక వ్యక్తికి ఎదో ఒక పండుగ సందర్భంగా ముందుండి నిర్వహించే గౌరవం ఇస్తారు అతనిని మాన్కరి అంటారు.తాండా లోని ఒక చదువు కున్న వ్యక్తికి పెళ్ళి లేదా ఇతర కార్యక్రమాలు ఉన్నపుడు లెక్కలు రాసి పంచులకు అప్పగించే బాధ్యత అప్పగిస్తారు. అతనిని హసాబి అంటారు.నసాబి అంటే తాండాలో ఒక న్యాయ మూర్తిలా తాండా వాసులకు లేదా ఇతర తాండా వాళ్ళకు న్యాయబద్ధంగా తీర్పు చెప్పే వ్యక్తిని నసాబి అంటారు. మొదలగు ప్రముఖులు తాండాలో ఉంటారు.

తాండాలో నాయక్ పాత్ర

[మార్చు]

తాండా పాలనకు మూల స్తంభంగా నాయక్ వ్యవహరిస్తారు.తాండాలో స్థానిక స్వపరిపాలన లంబాడీ గిరిజన సమాజం యొక్క ప్రత్యేకత.ఇప్పటికీ కూడా చాలా పటిష్టంగా ఉంది.తాండా సంస్కృతిలో ప్రధానమైన వ్యక్తి తాండా నాయక్ ఇతనికి నాయకత్వం వంశపారంపర్యంగా వస్తుంది.కాని ఎన్నికలు ఉండవు. ఆరోగ్య కారణాల వల్ల తాండా నాయక్ చనిపోయినప్పుడు గ్రామస్తులు, సమీప సోదర గ్రామాలు కలిసి అతని పెద్ద కొడుకు కు నాయక్ గా ఎన్నుకొని పాగడి తలపాగను ధరించే కార్యక్రమం నిర్వహించి వచ్చిన వారందరికీ మేక పోతు,మధ్యం తో విందు కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తాండాలో ఎవరి మధ్యనైనా తగాదా వస్తే నాయక్ అధ్వర్యంలో తాండా పెద్దలంతా కులపంచాయితి చేసి తగాదాలను విచారించి సాక్ష్యాలు చెప్పించుకొని తప్పు చేసిన వారిని శిక్ష విధిస్తారు.ఇక్కడ తాండా నాయక్ మాట చెల్లుబాటవుతుంది.ఇతర పని మీద తాండా నాయక్ ఎటైనా వెళ్ళినప్పుడు పంచాయితి గాని ఇతర ముఖ్య కార్యక్రమాలు గాని వాయుద పడుతుంది. పండుగలు పబ్బాలు పెళ్ళి పేరంటాలు,విడాకులు అన్నీ నాయకుని ఆధ్వర్యంలో జరుగుతాయి.నాయక్ గ్రామ పంచుల ఆధ్వర్యంలో జరిగే కులపంచాయితి నే నసాభ్ అంటారు.

తాండా స్థాపన

[మార్చు]

ఆధునిక వాస్తుశిల్పిలు తాండాలో ఉండే ఒక గొప్ప మనిషిని సమూహం వారు ఎన్నుకొని అతని సమిస్టి కృషితో తాండా స్థాపించబడింది.అయితే ఇంతకు ముందు ఈ బంజారా సమాజం వ్యాపారం కోసం దేశం నుండి దేశం తిరిగేవారు.బంజారా సమాజం యొక్క వాణిజ్యం భారతదేశం అంతటా మాత్రమే కాదు, యూరోపియన్ దేశాల్లో కూడా వ్యాపించి ఉండేది.అందువల్ల బంజారా సమాజాన్ని భారతదేశపు మొదటి వ్యాపారులుగా పిలుస్తారు.ప్రపంచంలోనే అతిపెద్ద "ఇనుప కోట" లోహగడ్ కోటను నిర్మించిన గొప్ప యోధుడు బాబా లఖిషా బంజారా, అతని నీ ఆసియా ఖండంలోనే గొప్ప వ్యాపారిగా గురించడం జరిగింది. తాండా ఈ రోజు గ్రామం పేరుతో పిలువబడుతున్నప్పటికీ, వాస్తవానికి బంజారా సంస్కృతి లో తాండాను ఆ తాండా వ్యక్తి (నాయక్) పేరు పెట్టి పిలుస్తున్నారు.ఉదా.శ్యాంనాయక్ తాండా, జేమ్లా తాండా,రూపు తాండా,నందు నాయక్ తాండా, రాంజీ నాయక్ తాండా ,ఉదా నాయక్ తాండా మొదలగునవి. బంజారాలు గోత్రాలు పేరుతో కూడా తాండా నామకరణం చేశారు.ఉదా భుక్యాతాండో,మూడ్ తాండో,వడ్త్యాతాండో కోర్రా తాండో మొదలగు తాండా అంటే గోర్ బంజారాల నివాసపు కోట అని అర్థం.

తాండా జీవనం

[మార్చు]

లంబాడీ తాండా అంటే సముదాయం లేదా గుంపు అని అర్థం.వీరికి ప్రత్యేకమైన జీవన శైలి,ఆచార వ్యవహారాలు తాండా రాజ్యం ఉంటుంది.బంజారా లంబాడీలు భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలలో ఏజెన్సీ, మైదాన ప్రాంతాలలో నివసిస్తున్నారు.అదే విధంగా వీరు గ్రామాలలో పట్టణాలలో కాకుండ అడవిలో,కొండలలో, గుట్టలలో, సభ్యసమాజానికి దూరంగా ప్రకృతి ఒడిలో ప్రత్యేక తాండాలను ఏర్పాటు చేసుకొని జీవిస్తారు.వీరు నివసించే ప్రాంతాలను తాండో అంటారు. తాండాలోని మగవారిని వారు తాండ్రో అని, ఆడవారిని తాండ్రి అని సంబోధిస్తూ ఉంటారు. తాండాలో మంచి చేడు సమస్యలను పరిష్కరించడానికి తాండాలో నాయక్ వ్యవస్థ ఇప్పటికి కూడా ప్రతి తాండలో సజీవంగా ఉంది.వీరు బాధ్యత గా తమ యొక్క కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తూ తాండాలో కలిసి మెలసి నిర్ణయాలు తీసుకుని ముందుకు పోతున్నారు.

లంబాడీ గిరిజనులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని తాండాలుగా ఏర్పడి వ్యవసాయాన్ని జీవనాధారంగా చేసుకుని నీటి వనరులు చూసుకొని వర్షపు నీటిపైనే ఆధారపడి జొన్నలు సజ్జలు రాగులు పండించే వారు, నీటి సౌకర్యం కలిగిన భూముల్లో ‌మొక్కజోన్నలు, పండించే వారు.లంబాడీల ముఖ్య ఆహారం రొట్టెలు,కారం, ఆకుకూరలు (భాజి,బాటి, కాందార్ ఖోడి) సంచార జీవన కాలం నుండి కాయగూరలు అందుబాటులో లేని కాలంలో అటవీ, మైదాన ప్రాంతాలలో ‌విరివిగా లభించే ఆకుకూరలపై ఆధారపడేవారు. అందుకే లంబాడీ గిరిజనుల నిత్య జీవితంలో అప్పటి నుండి ఇప్పటి వరకు జోన్న రోట్టెలు, ఆకుకూరలు (భాజిన్ బాటి) ముఖ్య ఆహారం మైంది. ఇదే విధంగా లంబాడీలకు బయట సమాజంతో ఏర్పడిన సాన్నిహిత్యం వల్లవరి, గోధుమలు,పప్పుధాన్యాలు మొదలుకొని వాణిజ్య పంటలైన ప్రతి, సోయా,జనపనార, పసుపు మొదలైన ఆహారపు వాణిజ్య పంటలు వారి జీవన విధానంలోకి ప్రవేశించాయి. భారత దేశమంతటా వీరి తాండా వ్యవస్థ ఇప్పటికి సజీవంగా ఉన్నాయి.

తాండా గ్రామపంచాయితులు

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 2018 లో 100% గిరిజన జనాభా కలగిన లంబాడీ తాండాలను తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేరుస్తు తాండాలను గ్రామ పంచాయితీలో భాగంగా దాదాపు 500 జనాభా గల తాండాలను గ్రామ పంచాయితీగా ఏర్పాటు చేసింది.[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. telugu, NT News (2023-08-11). "తండాలు తళ తళ". www.ntnews.com. Retrieved 2024-04-09.
  2. mahesh.rajamoni. "మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధిలో గిరిజన తండాలు: మంత్రి రాథోడ్". Asianet News Network Pvt Ltd. Retrieved 2024-04-09.
  3. "తండాలు ప్రగతి వికాస కేంద్రాలు". Sakshi. 2023-06-18. Retrieved 2024-04-09.
  4. ABN (2023-08-31). "బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే తండాలు అభివృద్ధి". Andhrajyothy Telugu News. Retrieved 2024-04-09.