బండా కార్తీకరెడ్డి
బండా కార్తీకరెడ్డి | |
---|---|
హైదరాబాదు మాజీ మేయర్ | |
In office 2009 - 2012 | |
అంతకు ముందు వారు | తీగల కృష్ణారెడ్డి |
తరువాత వారు | మహమ్మద్ మాజిద్ హుస్సేన్ |
నియోజకవర్గం | సికింద్రాబాదు |
వ్యక్తిగత వివరాలు | |
జననం | హైదరాబాదు, తెలంగాణ | 1977 ఆగస్టు 17
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
జీవిత భాగస్వామి | బండా చంద్రారెడ్డి |
సంతానం | కనిష్క్, షోమిక్ |
నివాసం | తార్నాక, హైదరాబాదు |
బండా కార్తీకరెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు, హైదరాబాదు మహానగరపాలక సంస్థ మాజీ మేయర్. 2009లో జిహెచ్ఎంసీ ఏర్పడిన తరువాత మొదటి మేయర్ గా పనిచేసింది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ సభ్యురాలుగా ఉంది.
తొలి జీవితం
[మార్చు]కార్తీక 1977, ఆగస్టు 17న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి సోషియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసింది. క్రీడాకారిణి కూడా.[1]
రాజకీయ జీవితం
[మార్చు]2009, డిసెంబరులో హైదరాబాదు మహానగరపాలక సంస్థకు కాంగ్రెస్ పార్టీ తరపున మొదటి మేయర్ (2009-2012)గా ఎన్నికయింది.[2] 2010లో ఆల్ ఇండియా మేయర్స్ కౌన్సిల్ వైస్ చైర్పర్సన్ అయింది. ఆమె 2014 & 2018 ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించింది. బండ కార్తీకరెడ్డి 18 నవంబర్ 2020న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]కాంగ్రెస్ పార్టీ సభ్యుడు బండా చంద్రరెడ్డితో కార్తీక వివాహం జరిగింది.[2] వీరికి ఇద్దరు కుమారులు (కనిష్క్, షోమిక్).
మూలాలు
[మార్చు]- ↑ "City gets its mayor". The Times Of India. 5 December 2009. Retrieved 10 June 2021.
- ↑ 2.0 2.1 The Hindu : Front Page : Kartika Reddy first Mayor of GHMC