మహమ్మద్ మాజిద్ హుస్సేన్
మహమ్మద్ మాజిద్ హుస్సేన్ | |
---|---|
హైదరాబాదు మాజీ మేయర్ | |
In office 2012 -2015 | |
అంతకు ముందు వారు | బండా కార్తీకరెడ్డి |
తరువాత వారు | బొంతు రామ్మోహన్ |
నియోజకవర్గం | అహ్మద్ నగర్ |
మెహదీపట్నం డివిజన్ కార్పోరేటర్ | |
In office 2016-2021 2021-ప్రస్తుతం | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
జాతీయత | భారతీయుడు |
రాజకీయ పార్టీ | ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ |
సంతానం | 2 |
నివాసం | హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
కళాశాల | ఉస్మానియా విశ్వవిద్యాలయం |
వెబ్సైట్ | ఫేస్‌బుక్ లో MohmdMajidHussain మహమ్మద్ మాజిద్ హుస్సేన్ |
మహమ్మద్ మాజిద్ హుస్సేన్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మెహదీపట్నం డివిజన్ ప్రస్తుత కార్పోరేటర్.[1] 2012-2015 వరకు ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ తరపున హైదరాబాదు మహానగరపాలక సంస్థ మేయర్ గా పనిచేశాడు.[2]
తొలి జీవితం
[మార్చు]మాజీద్ హుస్సేన్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు. హుమాయున్ నగర్ లోని సెయింట్ థెరిసా స్కూల్, బంజారా హిల్స్ లోని సుల్తాన్ ఉలూమ్ కాలేజీలో ఇంటర్మీడియట్, మల్లేపల్లిలోని అన్వర్ ఉలూమ్ కాలేజీలో బీసీఏ చదివాడు.
మాజీద్ హుస్సేన్ తండ్రి, తల్లి ఇద్దరూ రిటైర్డ్ గెజిటెడ్ అధికారులు. తండ్రి ఎం.హెచ్. మక్సూద్ రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్, హ్యాండ్ బాల్ ఎపి సెలక్షన్ కమిటీ ఛైర్మన్ కాగా... తల్లి ఖైసర్ జహాన్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల రిటైర్డ్ ప్రధానోపాధ్యాయురాలు. సోదరుడు మహ్మద్ షకీర్ హుస్సేన్ అమెరికాలో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్.[3]
హెచ్‌ఎస్‌బిసిలోని మైగ్రేషన్, క్రెడిట్ కార్డ్ విభాగంలో ఎగ్జిక్యూటివ్‌గా దాదాపు ఐదేళ్లు పనిచేసి, ఉద్యోగాన్ని వదిలి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చాడు.
రాజకీయ జీవితం
[మార్చు]ఎంఐఎం పార్టీ నేత అసదుద్దీన్ ఒవైసీ చేత మాజిద్ హుస్సేన్ ఎంపిక చేయబడి, 2009 జిహెచ్ఎంసి మున్సిపల్ ఎన్నికలలో అహ్మద్ నగర్ డివిజన్ కార్పొరేటర్ గా గెలిచాడు.
2012, జనవరి 4న ఎంఐఎం దూధ్ బౌలి కార్పొరేటర్ ఎంఎ గఫర్, మాజీ మేయర్ బండా కార్తీకరెడ్డి ఇద్దరూ మాజీద్ హుస్సేన్ ను జిహెచ్‌ఎంసి మేయర్ అభ్యర్థిగా ప్రతిపాదించారు. 15 నిమిషాల వ్యవధిలో, ఎన్నికల ప్రక్రియ పూర్తికాగా, 31 ఏళ్ల మాజిద్ హుస్సేన్‌ను జిహెచ్‌ఎంసి కొత్త మేయర్‌గా ప్రకటించారు.[4] 21 సంవత్సరాల తరువాత హైదరాబాదు నగరంలో ఎంఐఎం పార్టీ కార్పోరేటర్ మేయర్ గా ఎన్నిక కాబడ్డాడు. ఇప్పటివరకు అతి పిన్న వయస్కుడైన మేయర్ ఇతడే.[5]
2016లో జరిగిన జిహెచ్‌ఎంసి మున్సిపల్ ఎన్నికల్లో మెహదీపట్నం డివిజన్ కార్పొరేటర్‌గా గెలిచాడు.[6]
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నాంపల్లి శాసనసభ నియోజకవర్గం ఎన్నికల ఇన్‌చార్జిగా నియమించబడ్డ మాజీద్ హుస్సేన్, నాంపల్లి కార్పోరేటర్ గా ఎంఐఎం అభ్యర్థి గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 2019 సార్వత్రిక ఎన్నికలలో, కిషన్ గంజ్ స్థానానికి ఎన్నికల ఇన్‌చార్జిగా నియమించబడ్డాడు.
2020 హైదరాబాదు మహానగర పాలక సంస్థ ఎన్నికలలో మళ్ళీ మెహదీపట్నం కార్పోరేటర్ గా గెలుపొందాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Telangana Sate Election Commission, Telangana Gazette. "Election Results of all the Wards of GHMC" (PDF). Archived from the original (PDF) on 2021-03-01. Retrieved 2021-06-10.
- ↑ "New mayor for Hyderabad, IBN Live News". Ibnlive.in.com. 3 January 2012. Archived from the original on 12 January 2012. Retrieved 10 June 2021.
- ↑ "First time corporator Majid is city mayor". The Times of India. Retrieved 10 June 2021.
- ↑ "MIM's Hussain elected Mayor of Hyderabad". news18.com. Retrieved 10 June 2021.
- ↑ "Hussain becomes youngest mayor of Hyderabad". gulfnews.com. Retrieved 10 June 2021.
- ↑ "TRS scores landslide win in Hyderabad polls, TDP-BJP washed out". newsx.com. Archived from the original on 26 ఏప్రిల్ 2019. Retrieved 10 June 2021.
బయటి లింకులు
[మార్చు]- జీహెచ్ఎంసీ సైట్ Archived 2009-01-01 at the Wayback Machine
- ఏఐఎంఐఎంలో మహ్మద్ మజీద్ హుస్సేన్