తీగల కృష్ణారెడ్డి
తీగల కృష్ణారెడ్డి | |
---|---|
![]() | |
Assumed office 2014 నుండి 2018 | |
నియోజకవర్గం | మహేశ్వరం |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 10 జూన్ 1949 మీర్‌పేట , రంగారెడ్డి జిల్లా, తెలంగాణ, భారతదేశం |
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి |
జీవిత భాగస్వామి | అరుంధతి |
సంతానం | టి. హరినాథ్ రెడ్డి, టి. అమరనాథ్ రెడ్డి |
బంధువులు | తీగల అనితారెడ్డి (కోడలు) |
నివాసం | తిరుమల హిల్స్, ఆస్మాన్ గడ్ , మలక్‌పేట, హైదరాబాదు |
తీగల కృష్ణారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, హైదరాబాద్ మాజీ మేయర్. అతను ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీలో ఉన్నాడు.[1] 2002లో తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించి,దానికి అతను చైర్మన్ గా ఉన్నాడు.
జననం, విద్యాభాస్యం[మార్చు]
తీగల కృష్ణారెడ్డి రంగారెడ్డి జిల్లా, మీర్‌పేట లో 1949 జూన్, 10న జన్మించాడు. [2] తండ్రి టి.రాంరెడ్డి. కృష్ణారెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ నుండి 1971లో బిఎ పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం[మార్చు]
తీగల కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సమయంలో టిడిపిలో చేరాడు.అతను 1986లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరపున గాంధీ నగర్ డివిజన్ నుండి కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయాడు. కృష్ణారెడ్డి 2002లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి హైదరాబాద్ మేయర్ గా పనిచేశాడు. కృష్ణారెడ్డి హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా పని చేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి చేతిలో 7,833 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి పై 30,784 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] అతను 2014, అక్టోబరు 29న టీఆర్ఎస్ పార్టీలో చేరాడు.[4] 2018ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి చేతిలో 9,227 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.[5]
మూలాలు[మార్చు]
- ↑ Sakshi (1 October 2014). "టీఆర్‌ఎస్‌లోకి తీగల!". Sakshi. Archived from the original on 11 May 2021. Retrieved 11 May 2021.
- ↑ Nava Telangana (11 June 2019). "తీగల కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు". Archived from the original on 11 May 2021. Retrieved 11 May 2021.
- ↑ Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
- ↑ Sakshi (29 October 2014). "టీఆర్ఎస్ లో చేరిన తీగల, తలసాని". Archived from the original on 11 May 2021. Retrieved 11 May 2021.
- ↑ The News Minute (12 December 2018). "Telangana polls: Ex-state minister Sabitha Indra Reddy wrests Maheshwaram from TRS". Archived from the original on 11 May 2021. Retrieved 11 May 2021.