బండి సత్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బండి సత్యం
జననం(1981-12-12)1981 డిసెంబరు 12
వృత్తితెలుగు సినిమా పాటల రచయిత
తల్లిదండ్రులు
  • రాజమౌళి (తండ్రి)
  • వనమాల (తల్లి)

బండి సత్యం తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు సినిమా పాటల రచయిత. 2003లో ‘సండే’ సినిమాతో సినీపాటల రచయితగా తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టాడు.[1] 2021 వరకు దాదాపు 100కుపైగా సినిమా పాటలు, 200కి పైగా ప్రైవేటు గీతాలను రాశాడు.[2]

జననం, విద్య

[మార్చు]

సత్యం 1981 డిసెంబరు 12న రాజమౌళి - వనమాల దంపతులకు తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, చిట్యాల మండలం, చల్లగరిగె గ్రామంలో జన్మించాడు. హన్మకొండ పట్టణంలో డిగ్రీ పూర్తిచేశాడు.[2]

సినిమారంగం

[మార్చు]

చిన్నప్పటి నుంచే పాటలపై ఆసక్తిని పెంచుకున్న సత్యం, సినీగీత రచయిత చంద్రబోస్‌ను ఆదర్శంగా తీసుకొని సినిమా పాటల రచయితగా తన ప్రయాణాన్ని సాగించాడు. హైదరాబాదుకి వెళ్ళి సినీ పరిశ్రమలో పరిచయాలు పెంచుకున్నాడు. 2003లో ‘సండే’ సినిమాకు ‘ఎన్ని జన్మలెత్తాలి చెలియా.. నీ చిన్ని మనసు తెలియా’ అనే పాటను తొలి సినిమా పాటగా రాశాడు.

వీటితోపాటు దొరకడు, రిపోర్టర్‌, దొంగప్రేమ, ప్రేమకు దారేది మొదలైన సినిమాలకు పాటలు రాశాడు. ‘ఆనంది’ అనే చిత్రానికి సంగీత దర్శకత్వం కూడా వహించాడు.[2]

కొన్ని పాటలు

[మార్చు]
  • సండే (2003): ‘ఎన్ని జన్మలెత్తాలి చెలియా.. నీ చిన్ని మనసు తెలియా
  • బ్యాక్‌ పాకెట్‌ (2003): ‘గుమ్మడి పూలు తెస్తానులే.. మల్లెపూలు ఇస్తానులే.. చెలియా నమ్మరాదటే..’, ‘గోల గోలగుంది’
  • కాలింగ్‌ బెల్‌ (2013): ‘ఓ సరసముని నా సొగసుగని.. చేరుకోరా నా ఎదని..’
  • కేరాఫ్ గోదావరి (2016): ‘పదరా ప్రతి అడుగై.. పరుగై.. నిశిలో నువు చిచ్చరపిడుగై..’
  • పంచముఖి (2009): ‘మదనా మదనా మదనా.. నా వయసే దోచే మదనా’
  • వాలంటైన్‌ (2009): ‘దేవతల్లే వరములిస్తివే నిను చేరలేక దూరమైతినే’
  • క్షేమం: ‘జీవితం ఒక పయనం.. యవ్వనం ఒక పవనం’
  • పలాస 1978 (2020): బావొచ్చాడోలప్పా బావొచ్చాడు

టెలివిజన్

[మార్చు]

దూరదర్శన్‌లో వచ్చిన ఊహల పల్లకి, ఓ అమ్మకథ, అనురాగ ధార మొదలైన సీరియల్స్‌కు పాటలు రాశాడు. మాటీవీలో వచ్చిన ‘గుర్తుకొస్తున్నాయ్‌’ షోకోసం పాట కూడా రాశాడు.

మూలాలు

[మార్చు]
  1. "All you want to know about #BandiSatyam". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2021-11-24.
  2. 2.0 2.1 2.2 నమస్తే తెలంగాణ, బతుకమ్మ ఆదివారం సంచిక (17 April 2021). "సినీ పాటల 'బండి'!". Namasthe Telangana. తిరునగరి శరత్‌ చంద్ర. Archived from the original on 18 April 2021. Retrieved 24 November 2021.