Jump to content

బదాయి దో

వికీపీడియా నుండి
బదాయి దో
దర్శకత్వంహర్షవర్ధన్ కులకర్ణి
రచన
  • సుమన్ అధికారి
  • అక్షత్ గిల్దియాల్
  • హర్షవర్ధన్ కులకర్ణి
నిర్మాతవినీత్ జైన్
తారాగణం
ఛాయాగ్రహణంస్వప్నిల్ సోనావానే
కూర్పుకీర్తి నకాహ్వా
సంగీతంనేపథ్యం సంగీతం:
హితేష్ సోనిక్
పాటలు:
  • అమిత్ త్రివేది
  • తనిష్క్ బాఘ్చి
  • అంకిత్ తివారి
  • ఖామోష్ షా
నిర్మాణ
సంస్థ
జంగ్లీ పిక్చర్స్‌
పంపిణీదార్లుజీ స్టూడియోస్
విడుదల తేదీ
11 ఫిబ్రవరి 2022 (2022-02-11)
సినిమా నిడివి
147 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్35 కోట్లు [1]
బాక్సాఫీసు28.33 కోట్లు

బదాయి దో 2022లో విడుదలైన హిందీ సినిమా. జంగ్లీ పిక్చర్స్‌ బ్యానర్ పై వినీత్ జైన్ నిర్మించిన ఈ సినిమాకు హర్షవర్దన్ కులకర్ణి దర్శకత్వం వహించాడు. రాజ్‌కుమార్ రావు, భూమి ఫెడ్నేకర్, సీమా పహ్వా, షీబా చ‌డ్డా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2022 జనవరి 25న విడుదల చేసి[2], సినిమాను ఫిబ్రవరి 11న విడుదల చేశారు.

బదాయి దో 68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ లో భాగంగా ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌) , ఉత్తమ నటి (క్రిటిక్స్‌) అవార్డులు అందుకుంది.[3]

నటీనటులు

[మార్చు]

రాజ్ కుమార్ రావు (శార్దూల్ ఠాకూర్), భూమి పెడ్నేకర్ (సుమి) పెళ్లి అవుతుంది. అయితే ఆ పెళ్లి కూడా ఓ ఒప్పందం ప్రకారం చేసుకుంటారు. పోలీస్ ఆఫీసర్‌గా పని చేసే శార్దూల్ ఓ గే, పీటీ టీచర్‌గా పని చేసే సుమి ఓ లెస్బియన్. కుటుంబం, సమాజం నుంచి ఎదురయ్యే సమస్యలను తప్పించుకునేందుకు పెళ్లి బంధంతో ఒక్కటవుతారు. వారి గురించి బయటి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడుతుంటారు. చివరకు వీరి బంధం ఎలా మలుపు తిరుగుతుంది? శార్దూల్, సుమిల గురించి అందరికీ తెలుస్తుందా ? కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అవుతారు? తరువాత ఏం జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[6]

మూలాలు

[మార్చు]
  1. "Badhaai Do Box Office report: Bhumi Pednekar-Rajkummar Rao's quirky drama hits jackpot, earns Rs 55 cr!". Zee News. 25 February 2022. Retrieved 5 March 2022.
  2. Namasthe Telangana (25 January 2022). "బ‌దాయి దో ట్రైల‌ర్ రిలీజ్‌.. ఇక న‌వ్వులే". Archived from the original on 21 March 2022. Retrieved 21 March 2022.
  3. "ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ని దక్కించుకున్న 'గంగూబాయి కఠియావాడి, 'బాదాయ్ దో'". 28 April 2023. Archived from the original on 28 April 2023. Retrieved 28 April 2023.
  4. Sakshiu (16 November 2021). "రాజ్‌కుమార్‌ రావు కొత్త చిత్రం 'బదాయి దో' విడుదల ఎప్పుడంటే..?". Archived from the original on 2021-11-16. Retrieved 18 November 2021.
  5. Eenadu (21 March 2022). "చిత్రసీమలో నాకు గాడ్‌ ఫాదరెవరూ లేరు". Archived from the original on 21 March 2022. Retrieved 21 March 2022.
  6. Eenadu (26 January 2022). "వినోదాల 'బధాయి దో'". Archived from the original on 21 March 2022. Retrieved 21 March 2022.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బదాయి_దో&oldid=4327872" నుండి వెలికితీశారు