బనితా సంధు
బనితా సంధు | |
---|---|
దస్త్రం:Banita Sandhu.jpg | |
జననం | |
జాతీయత | వెల్ష్ |
విద్యాసంస్థ | కింగ్స్ కాలేజ్ లండన్ |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2018–ప్రస్తుతం |
బనితా సంధు (జననం 1997 జూన్ 22 ) వెల్ష్ నటి.[1][2][3] ఆమె భారతీయ చిత్రాలలో నటించినందుకు ప్రసిద్ది చెందింది. హిందీ చిత్రం అక్టోబర్ (2018)తో ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది. తమిళ చిత్రం ఆదిత్య వర్మ, సిడబ్ల్యూ సిరీస్ పండోర (2019)లలో నటించింది.
అడివి శేష్ హీరోగా 2024లో రాబోతున్న జీ 2 చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది.[4]
ప్రారంభ జీవితం
[మార్చు]ఆమె వేల్స్‌లోని కెర్లియన్ లో మొదటి తరం బ్రిటీష్ ఇండియన్ తల్లిదండ్రులకు జన్మించింది.[5] కింగ్స్ కాలేజ్ లండన్‌లో ఇంగ్లీష్ లిటరేచర్‌లో డిగ్రీ చేసింది.[6]
ఆమె 11 సంవత్సరాల వయస్సులో నటించడం ప్రారంభించింది.[7] ఆమె న్యూపోర్ట్‌లోని రూజ్‌మాంట్ స్కూల్‌లో చదువుకుంది. ఆ తరువాత, ఉన్నత చదువులకై 18 ఏళ్ళ వయసులో లండన్‌కు వెళ్ళింది.
కెరీర్
[మార్చు]ఆమె రిగ్లీ కంపెనీ డబుల్‌మింట్ కోసం రూపొందించిన ఒక ప్రకటనలో చేసింది, దీనికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌గా "ఏక్ అజ్నాబీ హసీనా సే" పాట ఉంటుంది. అలాగే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ సీజన్‌లో ప్రసారం చేయబడిన వోడాఫోన్ ఇండియా ప్రకటనలో కూడా ఆమె ఉంది.[8][9]
ఆమె మొదటి చలన చిత్రం అక్టోబర్, ఇది 2018లో విడుదలైన వరుణ్ ధావన్ నటించిన చిత్రం. దీని తర్వాత అమెరికన్ టీవీ సిరీస్ పండోర[10], 2019లో ఆదిత్య వర్మ రూపొందించిన తమిళ చిత్రంలో నటించింది.[11] తర్వాత ఆమె హిందీ చిత్రం సర్దార్ ఉధమ్ సింగ్[12], బ్రిటిష్ చిత్రం కవిత అండ్ తెరాస[13][14]లలో నటించింది.
మూలాలు
[మార్చు]- ↑ "Inside Banita Sandhu 24th birthday celebration". The Indian Express. 23 June 2021. Archived from the original on 23 June 2021. Retrieved 21 July 2021.
- ↑ "Varun Dhawan's October heroine Banita Sandhu: Everything you need to know about her. See pics". Hindustan Times. 27 March 2018. Archived from the original on 8 October 2018. Retrieved 28 July 2020.
- ↑ "Banita Sandhu – the London undergrad moonlighting as a Bollywood star". The Guardian. 2018-03-30. Archived from the original on 29 November 2022. Retrieved 2022-12-04.
- ↑ "అడివి శేష్ 'G2'లో హీరోయిన్ గా బనితా సంధు | Prajasakti". web.archive.org. 2023-11-21. Archived from the original on 2023-11-21. Retrieved 2023-11-21.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Banita Sandhu on October: I was so frustrated acting still for so long". The Indian Express. IANS. 21 April 2018. Archived from the original on 21 April 2018. Retrieved 21 January 2020.
- ↑ Waheed, Alia (30 March 2018). "Banita Sandhu – the London undergrad moonlighting as a Bollywood star". The Guardian. Archived from the original on 10 July 2019. Retrieved 27 November 2019.
- ↑ "Welsh star Banita Sandhu makes Bollywood debut". itv.com. ITV plc. 22 March 2018. Archived from the original on 8 January 2021. Retrieved 1 December 2019.
- ↑ Waheed, Alia (30 March 2018). "Banita Sandhu – the London undergrad moonlighting as a Bollywood star". The Guardian. Archived from the original on 10 July 2019. Retrieved 27 November 2019.
- ↑ "Banita Sandhu: Lesser known facts about the debutante". The Times of India. 30 March 2018. Archived from the original on 21 July 2019. Retrieved 27 November 2019.
- ↑ "October actor Banita Sandhu joins in sci-fi series for Netflix Pandora, Varun Dhawan is proud of her". Hindustan Times. Indo-Asian News Service. 9 May 2019. Archived from the original on 28 November 2019. Retrieved 28 November 2019.
- ↑ "Arjun Reddy's Tamil remake now titled Adithya Varma, new poster out". Hindustan Times. 19 February 2019. Archived from the original on 19 February 2019. Retrieved 28 November 2019.
- ↑ Jha, Subhash K. (19 November 2019). ""Yes I'm doing Sardar Udham Singh," October actress Banita Sandhu is back in Shoojit Sircar's Udham Singh". Bollywood Hungama. Archived from the original on 21 December 2019. Retrieved 24 December 2019.
- ↑ "Lockdown Diaries: Banita Sandhu says how her lifestyle has become so sedentary during this crisis". Hindustan Times. 22 April 2020. Archived from the original on 15 July 2020. Retrieved 15 July 2020.
- ↑ "Banita Sandhu To Star Opposite Adivi Sesh In 'Goodachari' Sequel 'G2'". Deadline.