Jump to content

బర్మింగ్‌హామ్ హిందూ దేవాలయం

అక్షాంశ రేఖాంశాలు: 33°19′48″N 86°48′43″W / 33.329951°N 86.811822°W / 33.329951; -86.811822
వికీపీడియా నుండి
బర్మింగ్‌హామ్‌ హిందూ దేవాలయం
ప్రదేశం
దేశం:యునైటెడ్ స్టేట్స్
రాష్ట్రం:అలబామా
ప్రదేశం:పెల్హామ్‌[1]
అక్షాంశ రేఖాంశాలు:33°19′48″N 86°48′43″W / 33.329951°N 86.811822°W / 33.329951; -86.811822

బర్మింగ్‌హామ్‌ హిందూ దేవాలయం, అలబామాలోని పెల్హామ్‌లో ఉన్న ఒక హిందూ దేవాలయం. ఇది బర్మింగ్‌హామ్ మెట్రోపాలిటన్ ప్రాంతంలోని హిందువులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది.

చరిత్ర

[మార్చు]

బర్మింగ్‌హామ్ ప్రాంతంలో 1990 నాటికి, ప్రవాస భారతీయ హిందువుల జనాభా విపరీతంగా పెరిగింది. అట్లాంటాలోని హిందూ దేవాలయం ఏర్పాటయిన తరువాత చాలామంది ప్రవాస భారతీయు తమతమ ప్రాంతాలలో ఆధ్యాత్మిక కేంద్రాలను ఏర్పాటుచేయాలనుకున్నారు. కూపర్ గ్రీన్ మెర్సీ హాస్పిటల్‌లో మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి 1972లో వచ్చిన డాక్టర్ సంతోష్ ఖరే, 1993లో హిందూ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ ఆఫ్ బర్మింగ్‌హామ్ అనే సంస్థను స్థాపించాడు.[2] దీని నిర్మాణానికి $1 మిలియన్లకు పైగా నిధుల సేకరణ చేశారు. దేవాలయ నిర్మాణం జరిగిన తర్వాత, 1998లో ప్రారంభించబడింది. బర్మింగ్‌హామ్ ప్రాంతంలో దాదాపు 1,000 పైగా హిందూ కుటుంబాలు నివసిస్తున్నాయని అంచనా వేయబడింది, వీరిలో ఎక్కువమంది హూవర్, పెల్హామ్‌లలో నివసిస్తున్నారు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Hindu Temple and Cultural Center of Birmingham". setlist. Retrieved 2 February 2022.
  2. Simmons, Mary. "Hindu Temple & Cultural Center of Birmingham". magiccityreligion. Retrieved 2 February 2022.
  3. "Doctor who co-founded Hindu Temple in Birmingham led by example". Al.org. 27 July 2014. Retrieved 2 February 2022.