Jump to content

బల్మూరి వెంకట్

వికీపీడియా నుండి
బల్మూరి వెంకట్‌

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 జనవరి 2024 - 21 నవంబర్ 2027

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2018 - ప్రస్తుతం

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2015 - 2017

వ్యక్తిగత వివరాలు

జననం 1990
తారుపల్లి, కాల్వ శ్రీరాంపూర్ మండలం, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
నివాసం నారాయణగూడ, హైదరాబాద్

బల్మూరి వెంకట్‌ నర్సింగరావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్‌ఎస్‌యూఐ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు. 2024 జనవరి 29న తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో రెండు స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఆయన పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

బల్మూరి వెంకట్‌ తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా, కాల్వ శ్రీరాంపూర్ మండలం, తారుపల్లి గ్రామంలో జన్మించాడు. ఆయన ఎంబీబీఎస్ పూర్తి చేశాడు.[2][3] ఆయన స్వగ్రామం పెద్దపల్లి కాల్వశ్రీరాంపూర్‌ మండలం తారుపల్లిగా పేర్కొంటున్నా జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాలకు చెందినవారు. మానాల నుంచి చాలా ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. ఆయన అమ్మమ్మ గ్రామమైన తారుపల్లిని స్వగ్రామంగా మార్చుకొని రాజకీయాల్లోకి వచ్చాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

బల్మూరి వెంకట్‌ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన విద్యార్థి దశనుండి వివిధ ఉద్యమాల్లో పాల్గొన్నారు. బల్మూరి వెంకట్‌ 2015లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఎన్‌ఎస్‌యూఐ కు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2017లో ఎన్ఎస్‌యూఐ జాతీయ కార్యదర్శిగా పని చేశాడు. వెంకట్‌ 2018లో తిరిగి ఎన్‌ఎస్‌యూఐ కు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి రెండవసారి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2018 ముందస్తు ఎన్నికల్లో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశించినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆయనకు టికెట్ దక్కలేదు. బల్మూరి వెంకట్‌ నర్సింగరావును 2021 అక్టోబర్ 10న జరిగే హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.[4][5]బల్మూరి వెంకట్ హుజురాబాద్‎ కాంగ్రెస్ అభ్యర్థిగా అక్టోబర్ 8న నామినేషన్ వేశాడు.[6] ఆయన ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. తెలంగాణ శాసనమండలికి 2024 జనవరి 29న ఎమ్మెల్యే కోటాలో రెండు స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఆయన పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.[7][8]

ఎమ్మెల్సీ పదవులకు ఇతర పార్టీల నుండి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో బల్మూరి వెంకట్ ఏకగ్రీవంగా ఎన్నికైన‌ట్లు అసెంబ్లీ కార్యదర్శి 2024 జనవరి 22న ప్రకటించాడు.[9]ఆయన జనవరి 31న తెలంగాణ శాసనమండలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడు.[10][11]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (17 January 2024). "కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే". Archived from the original on 17 January 2024. Retrieved 17 January 2024.
  2. Andrajyothy (3 October 2021). "కాంగ్రెస్‌ అభ్యర్థిగా బల్మూరి వెంకట్‌". Archived from the original on 4 October 2021. Retrieved 4 October 2021.
  3. EENADU (11 May 2024). "వైద్యుడిగా పేరు నమోదు చేయించుకున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌". Archived from the original on 11 May 2024. Retrieved 11 May 2024.
  4. Sakshi (3 October 2021). "హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బల్మూరి వెంకట్‌". Archived from the original on 4 October 2021. Retrieved 4 October 2021.
  5. TV9 Telugu (2 October 2021). "హుజూరాబాద్ బరిలో మరో విద్యార్థి నేత.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు.. అసలు ఎవరి వెంకట్?". Archived from the original on 4 October 2021. Retrieved 4 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. V6 Velugu (8 October 2021). "నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్" (in ఇంగ్లీష్). Archived from the original on 15 అక్టోబరు 2021. Retrieved 15 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. Eenadu (17 January 2024). "కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే". Archived from the original on 17 January 2024. Retrieved 17 January 2024.
  8. Eenadu (18 January 2024). "విద్యార్థి సంఘం నేతకు దక్కిన అవకాశం". Archived from the original on 18 January 2024. Retrieved 18 January 2024.
  9. Mana Telangana (22 January 2024). "బల్మూరి వెంకట్, మహేశ్ కుమార్ గౌడ్‌ ఏకగ్రీవ ఎన్నిక". Archived from the original on 22 January 2024. Retrieved 22 January 2024.
  10. NTV Telugu (31 January 2024). "ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన బల్మూరి వెంకట్‌, మహేష్‌ కుమార్‌ గౌడ్‌". Archived from the original on 31 January 2024. Retrieved 31 January 2024.
  11. Andhrajyothy (1 February 2024). "ఎమ్మెల్సీలుగా మహేశ్‌గౌడ్‌, వెంకట్‌ ప్రమాణం". Archived from the original on 1 February 2024. Retrieved 1 February 2024.