బాబా ఫసియుద్దీన్
| బాబా ఫసియుద్దీన్ | |||
| పదవీ కాలం 2021 ఫిబ్రవరి 10 – ప్రస్తుతం | |||
డిప్యూటీ మేయర్ - హైదరాబాదు మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)
| |||
| పదవీ కాలం 2016 ఫిబ్రవరి 11 – 2021 ఫిబ్రవరి 10 | |||
| తరువాత | మోతె శ్రీలత రెడ్డి | ||
|---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1982 జూన్ 7 కుల్చారం, మెదక్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | భారత్ రాష్ట్ర సమితి | ||
| తల్లిదండ్రులు | బాబా షర్ఫుద్దీన్, రజియా ఫాతిమా | ||
| జీవిత భాగస్వామి | హబీబా సుల్తానా | ||
| సంతానం | 2 | ||
| నివాసం | బోరబండ, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం | ||
| పూర్వ విద్యార్థి | ఉస్మానియా యూనివర్సిటీ | ||
బాబా ఫసియుద్దీన్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హైదరాబాదు మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) డిప్యూటీ మేయర్‌గా 2016 ఫిబ్రవరి 11 నుండి 2021 ఫిబ్రవరి 10 వరకు బాధ్యతలు నిర్వహించాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]బాబా ఫసియుద్దీన్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ విద్యార్థి విభాగంలో కీలకంగా పనిచేస్తూ టిఆర్ఎస్వీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా సకల జనుల సమ్మె, వంటావార్పు, మిలియన్ మార్చి, రైల్‌రోకో, చలోడిల్లీ వంటి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. బాబా ఫసియుద్దీన్ 2016లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బోరబండ డివిజన్ నుంచి టీఆర్‌ఎస్ పార్టీ తరపున కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలిచి 2016 ఫిబ్రవరి 11న గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టాడు.[2] ఆయన 2020లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బోరబండ డివిజన్ రెండోసారి కార్పొరేటర్‌గా గెలిచాడు.[3]
బాబా ఫసియుద్దీన్ 2024 ఫిబ్రవరి 08న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[4] ఆయన 2025 ఫిబ్రవరి 21న గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (11 February 2016). "Baba Fasiuddin: TRS youth leader to Deputy Mayor" (in Indian English). Archived from the original on 8 February 2024. Retrieved 8 February 2024.
- ↑ Janam Sakshi (12 February 2016). "మేయర్, డిప్యూటీ మేయర్ ఏకగ్రీవం". Archived from the original on 4 April 2022. Retrieved 4 April 2022.
- ↑ TV5 News (20 November 2020). "బోరబండ టీఆర్‌ఎస్ కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బాబా ఫసియుద్దీన్" (in ఇంగ్లీష్). Archived from the original on 4 April 2022. Retrieved 4 April 2022.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhrajyothy (8 February 2024). "గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్‌కు భారీ షాక్.. పార్టీని వీడిన కీలక నేత". Archived from the original on 8 February 2024. Retrieved 8 February 2024.
- ↑ "GHMC's standing committee elected unanimously" (in Indian English). The Hindu. 22 February 2025. Archived from the original on 22 February 2025. Retrieved 22 February 2025.