బాల్ పెన్
Jump to navigation
Jump to search
![]() ఒక వత్తుడు బాల్ పాయింట్ పెన్ కూర్పు. | |
ఆవిష్కర్త |
|
---|---|
ప్రారంభ తేదీ | 1888 |
కంపెనీ | బహుళ బ్రాండులు |
లభ్యత | ప్రపంచవ్యాప్తంగా భారీ ఉత్పత్తి |
Notes సర్వవ్యాపి అయిన రాత పరికరం |

బాల్ పెన్ లేదా బాల్ పాయింట్ పెన్ అనేది బాల్ పాయింట్ పై అనగా దాని యొక్క పాయింట్ వద్ద లోహపు బాలు పై ఉన్న ఇంకు యొక్క సరఫరాను నియంత్రించే ఒక పెన్ను. దీని లోహమునకు సాధారణంగా ఉక్కు, ఇత్తడి, లేదా టంగ్‌స్టన్ కార్బైడ్ ఉపయోగిస్తారు. ఇది ఈక కలము, ఫౌంటెన్ పెన్నులకు ప్రత్యామ్నాయంగా మరింత గొప్పగా తయారు చేయబడిన కలము. దీనిని 1931లో హంగేరీకి చెందిన లాస్లో బైరొ ఆవిష్కరించాడు. ఈ బాల్ పెన్ను ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ఎక్కువగా ఉపయోగిస్తున్న రాత పరికరం, ఇవి ప్రతిరోజూ లక్షలాదిగా తయారుచేయబడుతూ విక్రయించబడుతున్నాయి.