బిపిన్ చంద్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బిపిన్ చంద్ర

బిపిన్ చంద్ర సుప్రసిద్ధ చరిత్రకారుడు. జాతీయోద్యమం, సమకాలీన చరిత్ర, మతతత్వ వ్యతిరేక ఉద్యమాలపై రచనలు చేశారు.

జననం[మార్చు]

ఈయన హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రావ్యాలీ లో మే 27, 1928లో జన్మించారు.

విద్యాభ్యాసం[మార్చు]

లాహోర్‌లోని ఫోర్మాన్ క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్నారు. ఆ తర్వాత అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి చేశారు.

పదవులు[మార్చు]

  • 1993లో యూజీసీ సభ్యునిగా పనిచేశారు.
  • 2002-12 మధ్య నేషనల్ బుక్ ట్రస్ట్ ఛైర్మన్‌గా విధులు నిర్వహించారు.
  • ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చరిత్ర ప్రొఫెసర్‌గా పనిచేశారు.

భారత స్వాతంత్ర్యోద్యమంపై బిపిన్ చంద్రకు ఎనలేని పాండిత్యం ఉంది. మహాత్మా గాంధీపై ఆయన సాధికారత సాధించారు.

విశేషాలు[మార్చు]

చరిత్ర పుస్తకాలు పాఠశాలలు, కాలేజీల సిలబస్‌లో చోటుసంపాదించుకున్నాయి. ఈయన రచించిన చరిత్ర పుస్తకాలూ పాఠశాలలో మరియు కళాశాలలో సిలబస్ గా ఉన్నాయి

రచనలు[మార్చు]

  • ద మేకింగ్ ఆఫ్ మోడరన్ ఇండియా: ఫ్రమ్ మార్క్స్ టు గాంధీ
  • ద ఇండియన్ లెఫ్ట్: క్రిటికల్ అప్రైజల్
  • ద రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ ఎకనమిక్ నేషనలిజం
  • ఇన్ ద నేమ్ ఆఫ్ డెమోక్రసీ: జేపీ మూవ్‌మెంట్ అండ్ ది ఎమర్జెన్సీ

పురస్కారాలు[మార్చు]

  • భారత ప్రభుత్వం ఇతనికి 2010లో పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించి గౌరవించింది[1].

మరణం[మార్చు]

ఆగష్టు 30, 2014 ఉదయం గుర్గావ్ లోని ఆయన స్వగృహంలో నిద్రలోనే తుది శ్వాస విడిచారు.

మూలాలు[మార్చు]

  1. పద్మభూషణ్ పురస్కారం#2010