బిళ్ళ గన్నేరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బిళ్ళ గన్నేరు
Catharanthus roseus white CC-BY-SA.jpg
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
C. roseus
Binomial name
Catharanthus roseus
Synonyms

వింకా రోజియా

Catharanthus roseus
వృక్షశాస్త్రము
బిళ్ళ గన్నేరు గులాబీ రంగులో

బిళ్ళ గన్నేరు (ఆంగ్లం Vinca, Periwinkle) ఒక చిన్న మొక్క. దీని నుండి ముఖ్యమైన కాన్సర్ మందులను తయారుచేస్తున్నారు. బిళ్ళ గన్నేరు (కాథరాంథస్ రోజస్ )కెన్యా, ఉగాండా, టాంజానియా (హెండర్సన్ 2002) దేశాలలో సహజసిద్ధమైనది. టాంజానియాలోని చాలా జిల్లాల్లో దీనిని అలంకారం సాగుబడి చేస్తారు . ఇది పొడి నెలలో , బహిరంగ ప్రదేశాలలో , రహదారుల ప్రక్కన పెరుగుతుంది . ఈ మొక్క తీరప్రాంత ఆవాసాలతో,ఇసుక నేలలతో ఉన్న దగ్గర కనబడతాయి. ఇది తూర్పు ఆఫ్రికాలో ఒక సాధారణ తోట మొక్క రోడ్డు పక్కన,వ్యవసాయ భూములలో కనిపిస్తాయి . బిళ్ళ గన్నేరు దీర్ఘకాలిక పొదలుగా ఉండి , 30-100 సెం.మీ ఎత్తు లో ఉంటుంది. పువ్వులు ఆకులలో వస్తాయి . దీని పండు , 2.0-4.7 సెం.మీ పొడవు లో చిన్న నల్ల విత్తనాలతో ఉంటాయి . బిళ్ళ గన్నేరు తెల్ల , గులాబీ , వంకాయ వంటి రంగులలో ఉంటాయి [1].

మన దేశములో అస్సాం, బీహార్, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్మలలో ఎక్కవగా కనిపిస్తాయి . వివిధ రాష్ట్రములలో క్రింది పేర్లతో బిళ్ళ గన్నేరు ను పిలుస్తారు. [2]

 • అస్సాం లో నయనతార, పిరాలి కున్వోరి
 • బెంగాలీ లో నయనతార
 • ఇంగ్లీష్ లో మాడగాస్కర్ పెరివింకిల్
 • హిందీ సదాబహర్, సదాఫులి, సదాసుహాగి
 • కొంకణి లో సదాపుష్ప
 • మలయాళలో శవం నారీ
 • మరాఠీ సదాఫులి
 • ఇతరులు మడగాస్కర్ పెరివింకిల్, సవనారి, పెరివింకిల్, కేప్ పెరివింకిల్, ఆడమ్-హోవా-చెడి, నిత్యకళ్యాని,పెర్షియన్ గుల్-ఎ-ఫరాంగ్త
 • తమిళం లో నిత్యకళ్యానీ

లక్షణాలు[మార్చు]

 • బహువార్షిక చిన్న పొద.
 • దీర్ఘచతురస్రాకారం లేదా విపరీత అండాకారంలో ఉండి ప్రకాశవంతమైన చిక్కని ఆకుపచ్చ రంగుతో ఉన్న సరళ పత్రాలు.
 • పత్ర గ్రీవాల్లో సాధారణంగా రెండేసి చొప్పున ఏర్పడిన తెలుపు గులాబీ రంగు పుష్పాలు.
 • జంట ఏకవిదారక ఫలాలు, నల్లని విత్తనాలు.

ఉపయోగాలు[మార్చు]

బిళ్ళ గన్నేరు నుండి వింకా ఆల్కలాయిడ్స్ తయారుచేస్తారు. ఇవి విన్ బ్లాస్టిన్, విన్ క్రిస్టిన్. ఇవి కాన్సర్ వైద్యంలో వాడతారు. బిళ్ళ గన్నేరు ఆకులను , పుష్పములను మధుమేహ నివారణకు , అధిక రక్త పోటు ను నియంత్రిచుటకే గాక చర్మ సంబంధిత వ్యాధుల నివారణకు వినియోగిస్తారు[3]

మూలాలు[మార్చు]

 1. "Factsheet - Catharanthus roseus (Madagascar Periwinkle)". keys.lucidcentral.org. Retrieved 2020-10-22.
 2. "Catharanthus roseus (L.) G. Don". India Biodiversity Portal. Retrieved 2020-10-22.
 3. Moudi, Maryam; Go, Rusea; Yien, Christina Yong Seok; Nazre, Mohd. (2013-11). "Vinca Alkaloids". International Journal of Preventive Medicine. 4 (11): 1231–1235. ISSN 2008-7802. PMC 3883245. PMID 24404355. Check date values in: |date= (help)