బిస్మత్ ఆక్సీక్లోరైడ్
పేర్లు | |
---|---|
ఇతర పేర్లు
bismuthyl chloride
bismuth oxochloride bismuth oxide chloride bismuth(III) oxide chloride bismoclite | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [7787-59-9] |
SMILES | Cl[Bi]=O |
| |
ధర్మములు | |
BiOCl | |
సాంద్రత | 7.36 (meas.), 7.78 g/cm3 (calc.)[1] |
insoluble | |
నిర్మాణం | |
స్ఫటిక నిర్మాణం
|
Tetragonal, tP6 |
P4/nmm, No. 129 | |
a = 0.3887 nm, c = 0.7354 nm
| |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
బిస్మత్ ఆక్సీక్లోరైడ్ ఒక రసాయన సంయోగ పదార్థం.ఇది ఒక అకర్బన రసాయన సమ్మేళనపదార్థం.బిస్మత్, ఆక్సిజన్, క్లోరిన్ పరమాణువుల సంయోగం వలన ఈ సమ్మేళనపదార్థ మేర్పడినది.బిస్మత్ ఆక్సీక్లోరైడ్ యొక్క రసాయన సంకేత పదం BiOCl.ఈ సంయోగ పదార్థాన్ని పురాతన కాలం నుండి, పురాతన ఇజిప్టుచరిత్ర కాలంనుండి మానవుడు ఉపయోగించిన దాఖాలాలు ఉన్నాయి.
బిస్మత్ ఆక్సీక్లోరైడ్ కు ఉన్న ఇతర పేర్లు
[మార్చు]- బై బిస్మథైల్ క్లోరైడ్ (bismuthyl chloride)
- బిస్మత్ ఆక్షోక్లోరైడ్ (bismuth oxochloride)
- బిస్మత్ ఆక్సైడ్ క్లోరైడ్ (bismuth oxide chloride)
- బిస్మత్ (II) ఆక్సైడ్ క్లోరైడ్ (bismuth (III) oxide chloride)
- బిస్మోక్లిట్ (bismoclite)
భౌతిక లక్షణాలు
[మార్చు]భౌతిక స్థితి
[మార్చు]బిస్మత్ ఆక్సీక్లోరైడ్ తెల్లని ఘన పదార్థం.
సాంద్రత
[మార్చు]బిస్మత్ ఆక్సీక్లోరైడ్ సాంద్రత 7.78 గ్రాములు/సెం.మీ3
ద్రావణీయత
[మార్చు]బిస్మత్ ఆక్సీక్లోరైడ్ నీటిలో కరుగదు.
ప్రకృతి లో ఉనికి
[మార్చు]బిస్మత్ ఆక్సీక్లోరైడ్ ప్రకృతిలో అరుదైన ఖనిజం బిస్మోక్లిట్ (bismoclite) రూపంలో లభించును. బిస్మోక్లిట్ అనునది మాట్లోకైట్ ఖనిజ గుంపునకు చెందినది.
అణుసౌష్టవం
[మార్చు]బిస్మత్ ఆక్సీక్లోరైడ్అణువు చతుర్బుజ కోణసౌష్టవం కల్గి ఉంది.బిస్మత్ ఆక్సీక్లోరైడ్ అణువు పొరలుగా Cl−, Bi3+, O2− అయాన్ గా ఏర్పడి ఉండును. (పటంలో బిస్మత్=గ్రే, ఆక్సిజన్=ఎరుపు, క్లోరిన్=పచ్చరంగు).ఈ అయాన్‌లు Cl-Bi-O-Bi-Cl-Cl-Bi-O-Bi-Cl, గా ఉండి, ఒకటి వదలి ఒకటి చొప్పున (alternating) అనయాన్ Cl-, O2- లు, కేటాయాన్ Bi3+ ఉండును.ఈ రకంగా పొరలుగా ఉండటం వుండటం వలన pearlescent వంటి లక్షణాలను కల్గి ఉంది.
సంశ్లేషణ –, చర్యలు
[మార్చు]బిస్మత్ క్లోరైడ్ జలవిశ్లేషణ ద్వారా నీటితో చర్య వలన బిస్మత్ అక్సీక్లోరైడ్ ఏర్పడును.
- BiCl3 + H2O → BiOCl + 2 HCl
బిస్మత్ అక్సీక్లోరైడ్ ను 600 °C దాటి వేడి చేసినపుడుఅది అర్ప్పేసంయోగ పదార్థంగా (Bi24O31Cl10) మారును.ఇది సంక్లిష్టమైన లేయర్ నిర్మాణం కల్గి ఉంది.
ఉపయోగాలు
[మార్చు]బిస్మత్ ఆక్సీక్లోరైడ్ను పురాతన ఈజిప్ట్ కాలము నుండి కూడా కాస్మెటిక్స్ (cosmetics) లలో ఉపయోగించేవారు.ముత్యం వంటి రంగు కల్గిన దీనిని ఐ షాడో (eye shadow) హెయిర్ స్ప్రే లో, పౌడర్లలో, గోళ్ళరంగులో, ఇతర సౌందర్యద్రవ్యాలలో/వస్తువుఉత్పత్తులలో (cosmetic products) ఉపయోగిస్తారు
బిస్మత్ ఆక్సీక్లోరైడ్ కు సమాంతరమైన బిస్మత్ఆక్సినైట్రేట్ అను సంయోగ పదార్థాన్ని తెలుపు రంగు పదార్థంగా ఉపయోగిస్తారు.
మూలాలు/ఆధారాలు
[మార్చు]- ↑ Anthony, John W.; Bideaux, Richard A.; Bladh, Kenneth W. and Nichols, Monte C. (ed.). "Bismoclite". Handbook of Mineralogy (PDF). Vol. III (Halides, Hydroxides, Oxides). Chantilly, VA, US: Mineralogical Society of America. ISBN 0-9622097-2-4. Retrieved December 5, 2011.
{{cite book}}
: CS1 maint: multiple names: editors list (link)