బి.ఏ. రెడ్డి చిత్రకారుడు
స్వరూపం
బి.ఏ. రెడ్డి | |
---|---|
జననం | 1940 పామర్రు, కృష్ణా జిల్లా |
ప్రసిద్ధి | చిత్రకారుడు |
బి.ఏ. రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు. వీరి పూర్తి పేరు బొమ్మారెడ్డి అప్పిరెడ్డి. గ్రామీణ జీవన శైలి నేపథ్యంలో చిత్రాలు గీసే బి.ఏ. రెడ్డి హైదరాబాద్ లో స్థిరపడ్డాడు.
జననం
[మార్చు]ఇతను 1940, కృష్ణా జిల్లా పామర్రు గ్రామంలోని ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు.
చిత్రకళా ప్రస్థానం
[మార్చు]తన కుటుంబంలో ఎవరికీ చిత్రకళలో అనుభవం లేదు. గుడివాడలో ప్రముఖ చిత్రకారుడు కొప్పాక వేణుగోపాలం దగ్గర చిత్రకళలో ఓనమాలు దిద్దాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఫైన్ ఆర్ట్స్ లో డిప్లొమా చేశాడు.
పురస్కారాలు
[మార్చు]ఇప్పటివరకు వందల చిత్రాలు గీసిన బి.ఏ. రెడ్డి అనేక పురస్కారాలు అందుకున్నాడు.[1]
- సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డ్ 1984
- ఎ.పి. బాలల అకాడెమీ నుండి బాలబందు బిరుదు
- అల్లూరి సీతారామరాజు యువజన సమితి వారి నుండి అంధ్రశ్రీ అవార్డ్
- రాజమండ్రి చిత్రకళా నికేతన్ నుండి వరదా వెంకట రత్నం మెమోరియల్ అవార్డ్
ఇతర విషయాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;జింకా జీవకళ
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు