బి.వి.రామన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భవాని వెంకటసుబ్రహ్మణ్య రామన్
జననం1921
మరణం2006 నవంబరు 27(2006-11-27) (వయసు 85)
వృత్తిభారత శాస్త్రీయ గాత్ర విద్వాంసుడు, స్వరకర్త
తల్లిదండ్రులుబి.వి.సుబ్రహ్మణ్య అయ్యర్ (తండ్రి)
పురస్కారాలు

బి.వి.సుబ్రహ్మణ్య రామన్(1921-2006) ఒక కర్ణాటక సంగీత విద్వాంసుడు. ఇతడు తన కవల సోదరుడు బి.వి.లక్ష్మణన్(1921-1996)‌తో కలిసి ఆరు దశాబ్దాలకు పైగా కర్ణాటక సంగీత రంగంలో కృషిచేశాడు.

విశేషాలు

[మార్చు]

ఇతడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో 1921లో జన్మించాడు[1]. ఇతని కుటుంబం తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్‌కు సమీపంలో ఉన్న భవాని గ్రామానికి చెందినది. ఇతని తండ్రి బి.వి.సుబ్రహ్మణ్య అయ్యర్ అప్పుడు గుత్తిలో డిప్యుటీ కలెక్టర్‌గా పనిచేసేవాడు. ఇతడు 1943లో అన్నామలై విశ్వవిద్యాలయం నుండి సంగీతభూషణ పట్టా తీసుకున్నాడు. ఇతడు, ఇతని సోదరుడు బి.వి.లక్ష్మణన్ కలిసి టైగర్ వరదాచారి వద్ద గురుకుల పద్ధతిలో సంగీత శిక్షణ పొందాడు. వీరు సంప్రదాయ పద్ధతిలో సంగీతం నేర్చుకున్నా తమకంటూ ఒక కొత్త బాణీని అలవరించుకున్నారు. వీరు ఛాయాగౌళ రాగం, సుప్రదీప రాగం వంటి అరుదైన రాగాలలో ఆలపించడంలో పేరుగడించారు. కంచి కామకోటి పీఠానికి ఆస్థాన విద్వాంసులుగా పనిచేశారు. ఈ కవల సోదరులు మనమదురై పట్టణంలో పాతిక సంవత్సరాలకు పైగా ప్రతియేటా "సదాశివ బ్రహ్మేంద సంగీతోత్సవాల"ను ఘనంగా నిర్వహించారు.

రామన్ గాయకుడిగా, స్వరకర్తగా, గురువుగా సంగీత సేవ చేశాడు. 1943 నుండి ఇతడు ఆకాశవాణిలో అనేక సంగీత కార్యక్రమాలను ఇచ్చాడు. అనేక వర్ణాలను, కృతులను, తిల్లానాలను స్వరపరిచాడు. ఎందరో విద్యార్థులను సంగీత కళాకారులుగా తీర్చిదిద్దాడు. తన సోదరునితో కలిసి అనేక గ్రామఫోన్ రికార్డులను, కేసెట్లను విడుదల చేశాడు.

పురస్కారాలు

[మార్చు]

ఇతడికి అనేక పురస్కారాలు లభించాయి. మద్రాసు సంగీత నాటక అకాడమీ "సంగీత కళాచార్య" బిరుదును ప్రదానం చేసింది. 1998వ సంవత్సరానికి కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతనికి కర్ణాటక సంగీతం గాత్ర విభాగంలో అవార్డును ఇచ్చింది. ఇంకా ఇతనికి "సంగీత జ్యోతి", "సంగీత జ్ఞానమణి", "గానకళా విశారద", "రామనామ గానరత్న", "ఇసై కాదల్" మొదలైన బిరుదులు ఉన్నాయి.

మరణం

[మార్చు]

ఇతడు తన 86వ యేట చెన్నైలో 2006, నవంబరు 27వ తేదీన మరణించాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. web master. "B. V. Subramanya Raman". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Retrieved 23 February 2021.[permanent dead link]
  2. Staff. "Musician B V Raman passes away". One India. Retrieved 23 February 2021.