బుట్ట
![]() | ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
బుట్ట (బహువచనం : బుట్టలు; స్పానిష్, పోర్చుగీస్: Cesto; ఆంగ్లం: Basket; జర్మన్: Korb; ఫ్రెంచి: Panier) లను తెలుగులో గంప, తట్ట అని కూడా పిలుస్తారు. బుట్టల తయారి, లేదా అల్లిక చాలా పురాతనమైనది. బుట్టలను అల్లడం నైపుణ్యంతో కూడిన కళాత్మకమైన చేతివృత్తి లేదా హస్తకళ. బుట్టలను వృక్ష సంబంధిత భాగాలతో చెయ్యడం వలన, అవి కాలక్రమేన సహజంగానే శిథిలమయ్యె, జీర్ణించిపోయే లక్షణము వుండుటచే, బుట్టల కాలనిర్ణయము చేయుటకు అవశేషాలు (Fossils) లభ్యము కావడం కష్టతరము. అయితే 10-12 వేల నాటి మట్టి పాత్రలపై (pottery) బుట్టల అల్లిక గుర్తులు (imprints of weavings) లభించడం వలన ఆ కాలం నాటికే బుట్టల అల్లిక వాడుకలో వుండేదని తెలుస్తున్నది. బుట్టలను పలు రకాలైన పనులకై వినియోగిస్తారు. గ్రామాలలో ధాన్యం నిలువ వుంచుకునే గాదెలను మొదలు పెట్టుకుని, చెత్తబుట్ట వరకు బుట్టల వినియోగం ఉంది. బుట్టలను వెదురుతో, చెట్లాకులతో, కొన్ని రకాల చెట్లదుంగలతో (Log), వేర్లతో (Roots), చెట్లబెరడు (Bark), కొన్నిరకాల గడ్ది (Grass) తో అల్లెదరు. అయా ప్రాంతాలలో లభించే చేట్లనుండి, ఆకుల నుండి, దుంగలనుండి బుట్టలను అల్లడం జరుగుచున్నది. చెట్ల ఆకుల నుండి తయారు చెయ్యు బుట్టలకు ఇదాహరణ: తాటాకు బుట్టకు, ఈతాకుబుట్టలు, కొబ్బరి ఆకుల బుట్టలు. అయితే ఇవి అంత నాణ్యమైనవి కావు.ఎక్కువ బరువు కలిగిన వస్తువులను వుంచుటకు అనుకూలమైనవి కావు. వీటి వినియోగ జీవితకాలము తక్కువగా ఉంది. రెల్లు (reed), తుంగ, స్వీట్ గ్రాస్ గడ్దిలతో కూడా బుట్టలు అల్లెదరు. అలాగే వెదురు (bamboo), పైన్ (pine), పేమ్ (cane), స్వాంప్ యాష్ (swamp ash), బ్లాక్ యాష్ (Black ash) చెట్ల కాండం (stem), దుంగల (log) లతో బుట్టలను అల్లెదరు. అర్కటిక్ పరిసరప్రాంతాలలోని తెగల వారు గడ్దితో బుట్టలను అల్లెదరు. ఇంగ్లాండు ప్రాంతము వారు స్వాంప్ యాష్ దుంగలతో, గ్రేట్‌లెన్స్ ప్రాంతాలవారు బ్లాక్‌యాష్ దుంగలతో బుట్తలను అల్లెదరు. కెనడియన్లు స్వీట్‌గ్రాస్‌తో బుట్టలను తయారు వెయ్యుదురు. భారతదేశము, తూర్పు ఆసియా (చైనా, జపాన్) దేశాలలో వెదురుతో బుట్టలు తయారు చెయ్యుదురు. ఈ ప్రాంతములో వెదురు విస్తారంగా లభించుటమే యిందుకు కారణము. దక్షిణ, తూర్పు ఆసియా దేశాలలో లక్షాలాది మందికి వెదురు బుట్టల అల్లికయే జీవనోపాధి. భారతదేశములో వెదురుతో పాటు కొబ్బరాకు, ఈతాకు, తాటాకులతో కూడా బుట్తలను అల్లడం వాడుకలో ఉంది. భారతదేశములో మేదరి కులస్తులు, గిరిజనులు బుట్టలు అల్లడంలో మంచి నిపుణత కలిగిన వారు.
వెదురు బుట్టలు[మార్చు]
వెదురు గడ్ది జాత్కి చెందిన మొక్క. వృక్షశాస్రములో ప్లాంటె కింగ్‌డమ్, పొఎసియె (poaceae) కుటుంభానికి చెందిన మొక్క.అన్ని రుతువులలోను, పచ్చని పత్రకాలతో, నిటారుగా పెరిగేమొక్క.మిగతా మొక్కలతో పొల్చినచో వెదురు ఎదుగుదల చాలా వేగవంతముగా వుండును. రోజుకు 10 సెం.మీ. నుండి 100 సెం.మీ.వరకు పెరుగుతుంది. వెదురు దాదాపు 10 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. వెదురు మందము ఒక అంగుళము నుండి 6 అంగుళముల వరకు వుండును.వెదురు కాండము నిలువుగా వుండి కణుపులను కలిగి వుండును.కాండము లోపలి భాగం బోలుగా (Hallow) వుండును.వెదురు తెలికగా వుండి ఇనుము కన్న ఎక్కువ దృఢత్వము కలిగి వుండును. అందుచే వెదురును గృహ నిర్మాణాలలో, నిచ్చెన తయారిలో విరివిగా వాడెదరు. వెదురులో దాదాపు 1450 రకాలు ఉన్నాయి. అయితే ఇందులో 50 రకాల వెదురు మాత్రమే అధికవాడుకలో ఉన్నాయి. వెదురుతో బుట్తలను మాత్రమే కాకుండా, గడ్ది కప్పు కలిగిన ఇళ్ల నిర్మాణాలలో కూడా ఉపయోగిస్తున్నారు. వెదురునుండి నిచ్చెనలు, తడికలు తయారికి యే కాకుండగా ప్రహారిగా (కంచె) కూడా ఉపయోగిస్తున్నారు. లేత వెదురు పాండా (panda) లకు ఆహారము కూడా. బుట్టలు అల్లుటకు వుపయోగించు వెదురును పచ్చిగా (Wet) వున్నప్పుడే సన్నని బద్దిలుగా, పొడవుగా వంచుటకు అనుకూలముగా కత్తిరించి, కట్టలుగా కట్టి కొన్నిరోజులపాటు నీటిలో నానబెట్టెదరు. ఇలా నాన బెట్టడం వలన బుట్టలను అల్లునప్పుడు వెదురు బద్దిలు తెలికగా, అల్లుటకు అనుకూలముగా వంగును. అల్లే బుట్ట సైజును బట్టి వెదురుబద్దిల మందము, వెడల్పు వుండును. బుట్టను అల్లడము బుట్ట క్రింది భాగము నుండు మొదట మొదలు పెట్తి, అతరువాత పక్కభాగాలు, చివరలో పై భాగమును అల్లెదరు. ఆకులతో చెయ్యుబుట్లను ఆకులు పచ్చిగా వున్నప్పుడె అల్లి, నీడలో ఆరబెట్టెదరు.
కర్రదుంగలతో బుట్టలు అల్లడం[మార్చు]
బ్లాక్ యాష్ (Black ash), స్వాంప్ యాష్ (swamp ash) చెట్ల దుంగల నుండి (Wood log) బుట్టలను చెయ్యుటకై, మొదట లావుగా వున్న చెట్టు కాండం నుండి దుంగలను పచ్చిగా వున్నప్పుడే కత్తరించి వేరు చెయ్యుదురు. చెట్టు పెరుగుచున్నప్పుడు, చెట్టు వయసును బట్టి, చెట్టు కాండంలో వలయాకారపు పెరుగుగల రింగులు (growth rings) ఏర్పడును.బుట్టల అల్లికకై ఎక్కువ పెరుగుదల రింగులున్న దుంగలను ఎంచుకొనెదరు. యిలా కత్తరించిన దుంగలకున్న కొమ్మలను, బెరడును మొదట తొలగించెదరు. యిప్పుడు గొడ్డలి వెనుకభాగంతో గుంగలపై చుట్టు కొట్ట్టటం (Pounding) వలన పెరుగుదల వలయాకారపు రింగులు పలుచని పొరలుగా వేరుపడును. ఈ పొరలను వేరుచేసి, శుభ్రపరచి, కావలసిన సైజుకు సన్నని, పొడవైన బద్దిలుగా కత్తరించి సిద్దమ్ చెయ్యుదురు. ఈ సన్నని బద్దిలను (strips) నీటిలో నానబెట్టి (soaking), వంచుటకు అనుకూలంగా తయారుచేసి, బుట్టలను అల్లెదరు. రంగురంగుల బుట్టలను అల్లుటకై బద్దిలకు రంగులను అద్ది, ఆరబెట్తి, బుట్టలను అల్లెదరు. ఆహార ధాన్యమును నిలువ వుంచు బుట్టలు (గాదెలు) వలయాకారంగా, పెద్దవిగా వుండును. చిన్నచిన్న ఫ్యాక్టరిలో ఉపయోగించు బుట్టలు వెడల్పుగా వుండును. యురొప్, తూర్పు ఆసియా దేశాలలో బుట్టలల్లికను నేర్పించు ట్రైనింగ్ సంస్దలు ఉన్నాయి. ఆసియా దేశాలలో మిలియను మంది ప్రజానీకం బుట్టల అల్లిక మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ప్లాస్టిక్‌తో చేసిన బుట్టల వినియోగం పెరిగింది. కాని ప్లాస్టిక్ బుట్టలను ఎక్కువగా వినియోగించడం వలన పర్యావరణానికి మిక్కిలి హనికరం. అందుచే ప్లాస్టిక్ బుట్టల వాడకం తగ్గించడం అందరి ప్రాథమిక కర్తవ్యము.
గ్యాలరీ[మార్చు]


Ethiopian woman gathering coffee beans in a basket
Seri Indian pot-shaped basket (Northern Mexico)
Bending vines for basket construction - Pohnpei
Inuit basket of whale baleen with a walrus ivory finial, Barrow, Alaska
Black ash baby basket by Odawa-Ojibwe Kelly Church, Michigan
Yurok baskets from Redwood National Park area, California
Traditional western Hubei baskets (China)