బుద్దా మురళి
Jump to navigation
Jump to search
బుద్దా మురళి | |
---|---|
జననం | బుద్దా మురళి 1964 ఏప్రిల్ 2 తుర్కపల్లి, యాదాద్రి జిల్లా తెలంగాణ |
వృత్తి | తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ & జర్నలిస్టు |
బుద్దా మురళి, తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్టు.[1] తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌గా బాధ్యతలు నేరవేరుస్తున్నారు.
బాల్యం- విద్యాభ్యాసం
[మార్చు]బుద్దా మురళి 1964 ఏప్రిల్ 2వ తేదీన యాదాద్రి జిల్లా తుర్కపల్లిలో జన్మించారు. ఎం.ఏ. రాజనీతి శాస్త్రం అభ్యసించారు.
వృత్తి జీవితం
[మార్చు]ఆంధ్రభూమి దినపత్రికలో జర్నలిస్టుగా, చీఫ్ రిపోర్టర్ గా పనిచేశారు.
రచనాప్రస్థానం
[మార్చు]జనాంతికం, ఓటమే గురువు అనే పుస్తకాలను రచించారు. మాసపత్రికలో వర్తమానం శీర్షిక తో కాలం రాస్తున్నారు. అరడజను పైగా కథలు రాశారు.
సమాచార కమిషనర్‌గా
[మార్చు]2017 సెప్టెంబరులో తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి సమాచార కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన సమాచార కమిషనర్‌గా ఉన్న రాజా సదారాం ఆగస్టు 2020లో పదవీ విరమణ చేయడంతో, ఆ అదనపు బాధ్యతలను కూడా బుద్ధ మురళి నిర్వర్తిస్తున్నారు.
పురస్కారాలు
[మార్చు]- హాస్య రచన విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారం (2013)[2]
మూలాలు
[మార్చు]- ↑ బుద్దా మురళి. "ఆర్‌టీఐ ప్రధాన కమిషనర్‌గా రాజాసదారాం". నమస్తే తెలంగాణ. Archived from the original on 20 June 2018. Retrieved 16 September 2017.
- ↑ "35 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". www.andhrajyothy.com. 2015-06-27. Archived from the original on 2022-09-17. Retrieved 2022-09-17.