బులుసు వెంకటేశ్వర్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బులుసు వెంకటేశ్వర్లు
Bulusu.jpg
జననం(1906-04-10)1906 ఏప్రిల్ 10
రామచంద్రాపురం, తూర్పు గోదావరి జిల్లా
విద్యవేదాంతం, తెలుగు సాహిత్యంలో ఎం. ఎ
విద్యాసంస్థమద్రాసు విశ్వవిద్యాలయం
వృత్తికవి, సాహితీ విమర్శకుడు
పురస్కారాలుసాహిత్య అకాడమీ పురస్కారం

బులుసు వెంకటేశ్వర్లు ప్రముఖ కవి ,రచయిత, సాహితీ విమర్శకులు. ఆయన 1956 లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు.[1]. కవివతంస బిరుదాంకితులు.

జీవిత విశేషాలు[మార్చు]

ఇతడు తూర్పు గోదావరి జిల్లా, పొడగట్లపల్లి శివారుప్రాంతమైన రామచంద్రాపురంలో 1906, ఏప్రిల్ 10న జన్మించాడు. ఇతడు మొదట వేదవిద్య, తరువాత ఆంగ్ల విద్యను అభ్యసించాడు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి వేదాంతంలో, తెలుగు సాహిత్యంలో రెండు ఎం.ఎ.పట్టాలు సంపాదించాడు. తరువాత తెలుగు ఉపన్యాసకునిగా 30 సంవత్సరాలు పనిచేసి 1963లో పదవీ విరమణ చేశాడు. ఇతడు గొప్ప వచన రచయితగా, వక్తగా రాణించాడు.

రచనలు[మార్చు]

  • మన కవులు : 'రామరాజ భూషణుడు’, 'ధూర్జటి’, 'తెనాలిరామకృష్ణుడు’ వంటి ప్రాచీన కవుల నుండి మొదలుకొని, ’విశ్వనాథ సత్యనారాయణ’, ’నండూరి రామకృష్ణమాచార్య’, ’గుంటూరు శేషేంద్ర శర్మ’, ’వేముగంటి నరసింహాచార్యులు’ వంటి దివంగత ఆధునిక కవులతోబాటు; ’అనుమాండ్ల భూమయ్య’, ’దుగ్గిరాల రామారావు’, ఇంకా 'ఆచార్య ఫణీంద్ర' వంటి సమకాలీన కవుల వరకు 50 మంది కవులు రచించిన అనేక విశిష్ట పద్యాలను హృద్యంగా విశ్లేషిస్తూ రచించిన చక్కని విమర్శన గ్రంథం.[2]
  • వావిళ్ల నిఘంటువు” (1949) : వేదం లక్ష్మీనారాయణ శాస్త్రి తో కలసి వ్రాసినది.[3]
  • భారతీయ తత్వశాస్త్రము-పరిశీలన : (1956 సాహిత్య అకాడమీ అవార్డు)[4]
  • యజ్ఞఫలము [5]- 1962
  • Thousand Steps to God [6]- 1975
  • శ్రీరామాష్టవ సుధాలహరి - 1967
  • బులుసు వెంకటేశ్వర్లు జీవిత చరిత్ర[7] - 1977
  • నిర్వచనాంధ్ర శ్రీమహాభాగవతము [8]
  • శ్రీ శివప్రభుశతకం - 1978
  • సర్వదుఃఖ నివారణోపాయము[9] - 1967
  • Lives of ancient India Saints[10] - 1982
  • అష్టావక్ర చరిత్రము[11]

మూలాలు[మార్చు]

  1. "AKADEMI AWARDS (1955-2014)". Archived from the original on 2016-03-04. Retrieved 2015-08-28.
  2. బులుసు వారి “మన కవులు”
  3. "నిఘంటువులు". Archived from the original on 2015-06-02. Retrieved 2015-08-28.
  4. డిజిటల్ ఇండియా లైబ్రరీలోగ్రంథ ప్రతి
  5. ajñaphalamu
  6. Thousand steps to God
  7. 'The autobiography of Bulusu Venkateswarlu : or, The solution for all problems and panacea for all ills of life'
  8. "Nirvachanadhra Sri Mahabhagavatamu/ Bulusu Venkateswarlu". Archived from the original on 2016-03-04. Retrieved 2015-08-28.
  9. Bulusu Venkateswarlu1908 - .
  10. పుస్తక సమాచారం
  11. డిజిటల్ లైబ్రరీలో గ్రంథ ప్రతి

ఇతర లింకులు[మార్చు]