బులుసు శివశంకరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉగాది పురస్కారాన్ని అందుకొన్న బులుసు శివశంకరరావు.

బులుసు శివశంకరరావు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన న్యాయవాది, న్యాయమూర్తి[1].

జీవిత విశేషాలు[మార్చు]

అతను తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం వద్దనున్న సాకుర్రు గ్రామంలో గవర్రాజు, సూర్యకాంతం దంపతులకు 1959 మార్చి 29న జన్మించాడు[2]. అతను న్యాయశాస్త్రంలో డిగ్రీ, కామర్స్ లో మాస్టర్స్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పూర్తిచేశాడు. పిదప కాకతీయ విశ్వవిద్యాలయం నుండి లా లో మాస్టర్స్ చేసి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి లా లో పి.హెచ్.డి. చేశాడు.

న్యాయవాది వృత్తి[మార్చు]

విద్యాభ్యాసం తర్వాత 1984లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నాడు. పాలగుమ్మి సూర్యారావు గారి వద్ద చేరి తూర్పు గోదావరి జిల్లాలోని జిల్లా సెషన్స్ కోర్టులో న్యాయవాదిగా చేవచేశాడు.

వివిధ పదవులలో 30 సంవత్సరాల ఆనుభవంతో 2013లో అదనపు న్యాయమూర్తిగా పదవోన్నతిని పొందాడు. పిదప 2016లో హైదరాబాదులో ఉమ్మడి హైకోర్టులో న్యాయమూర్తి పదవిని అలంకరించారు.

కుటుంబం[మార్చు]

వీరు ఏడుగురు తోడుట్టువులు, ముగ్గురు అన్నదమ్ములలో కనిష్టులు. వీరి ధర్మపత్ని జయలక్ష్మి. వీరికి ఒక కుమార్తె.

మూలాలు[మార్చు]

  1. "Appointment of Additional Judges in Teangana & Andhra Pradesh High Court".
  2. "THE HON'BLE DR JUSTICE B.SIVA SANKARA RAO". Archived from the original on 2019-04-18. Retrieved 2019-04-18.