బూర్ల వేంకటేశ్వర్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బూర్ల వేంకటేశ్వర్లు
బూర్ల వేంకటేశ్వర్లు
బూర్ల వేంకటేశ్వర్లు
జననంవేంకటేశ్వర్లు
(1973-08-26) 1973 ఆగస్టు 26 (వయస్సు: 45  సంవత్సరాలు)
లాలపల్లి, కరీంనగర్ జిల్లా, తెలంగాణ, భారతదేశం
వృత్తిఅసిస్టెంట్ ప్రొఫెసర్
కవి
భార్య / భర్తసంతోష
పిల్లలువేదశీర్ష్, వేదవ్యాస్
తండ్రిరాజవీరయ్య
తల్లిసుభద్ర (భద్రమ్మ)

బూర్ల వేంకటేశ్వర్లు వర్థమాన తెలుగు కవి మరియు తెలుగు సహాయ ఆచార్యుడు. మానవతను మేల్కొల్పడమే కవిత్వమంటూ, ప్రజా పక్షం వహిస్తూ సకల ఆధిపత్యాలను ధిక్కరిస్తూ కవిత్వం రాస్తున్న వీరు సౌమ్యులు, మెత్తని హృదయులు.

జననం - విద్యాభ్యాసం[మార్చు]

ఈయన రాజవీరయ్య, సుభద్ర (భద్రమ్మ) దంపతులకు కరీంనగర్ జిల్లా ఎలిగేడ్ మండలం లాలపల్లిలో 26వ ఆగష్టు, 1973న జన్మించారు. ఎం.కాం. పూర్తి చేసిన వీరు ఆ తర్వాత తెలుగు, సంస్కృతాలలో ఎం.ఏ. చేసారు.తెలుగు పండిత శిక్షణ మరియు నెట్, స్లేట్ లలో ఉత్తీర్ణులయ్యారు.

ప్రస్తుత నివాసం – వృత్తి/ఉద్యోగం[మార్చు]

వీరు ప్రస్తుతం కరీంనగర్ లో నివసిస్తున్నారు. 1998 నుండి 2004 వరకు ద్వితీయ శ్రేణి, ప్రథమ శ్రేణి తెలుగు పండితులుగా పనిచేసారు. 2004 నుండి 2013 వరకు జూనియర్ లెక్చరర్ గా పనిచేసి ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ & పి. జి. కళాశాల, గోదావరిఖనిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల!హుస్నాబాద్ లో పని చేస్తున్నారు.

వివాహం[మార్చు]

సంతోషతో 1995, జూన్ 2న వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు వేదశీర్ష్, వేదవ్యాస్ లు గలరు.

ప్రచురించిన పుస్తకాలు[మార్చు]

 1. వాకిలి (వచన కవిత్వం) 2007
 2. రంగుల విల్లు (నానీలు) 2007
 3. పెద్ద కచ్చురం (వచన కవిత్వం) 2013[1]
 4. బాయి గిర్క మీద ఊరవిశ్క (వచన కవిత్వం) 2015[2]
 5. "రెండు పక్షులూ ఒక జీవితం" కవిత్వం

సహ సంపాదకత్వం[మార్చు]

 • ఆంధ్ర సారస్వత పరిషత్ ఛాత్రోపాధ్యాయ పత్రిక శ్రీముఖి 1997
 • కరీంనగర్ కవిత – 2011
 • కరీంనగర్ కవిత – 2012
 • నవనీతం (డా.నలిమెల భాస్కర్ సాహిత్యం పై విశ్లేషణ) 2013
 • వస్త్రగాలం ( అన్నవరం దేవేందర్‌ కవిత్వం పై వివేచన) 2013
 • ఎన్నీల ముచ్చట్లు (వచనకవిత్వం) 2013
 • వాగు సాహిత్య మాస పత్రిక 2014 జూన్ నుండి
 • ఎన్నీల ముచ్చట్లు (2013 ఆగస్టు నుండి)

పురస్కారాలు – బిరుదులు[మార్చు]

 • స్పందన సాహితీ సాంస్కృతిక సమాఖ్య ఒరిస్సా వారి జాతీయ స్థాయి వచన కవితా పోటీల్లో ద్వితీయ బహుమతి/2005.
 • సాహితీ మిత్రులు మచిలీపట్నం వారి వారి జాతీయ స్థాయి వచన కవితా పోటీల్లో ద్వితీయ బహుమతి/2007.
 • కళాలయ సాంస్కృతిక సంస్థ పాలకొల్లు వారి విశిష్ట పురస్కారం, యువకవిమిత్ర బిరుదు/2007.
 • ఎక్స్ రే విజయవాడ ఉత్తమ కవితా అవార్డు/2007.
 • చెలిమి సాంస్కృతిక సంస్థ విజయవాడ వారి దేవులపల్లి కృష్ణ శాస్త్రి స్మారక అవార్డు/2008.
 • ఆంధ్ర భూమి దినపత్రిక స్వర్ణోత్సవ కవితల పోటీ జాతీయస్థాయి తృతీయ బహుమతి/2009.
 • రంజని-కుందుర్తి ఉత్తమ కవిత అవార్డు /2010.
 • భూంపల్లి విజయ సమైక్య సాహితీ పురస్కారం/2013

సాహితీ సంస్థల సాంగత్యం[మార్చు]

 1. సాహితీ గౌతమి, 2007
 2. తెలంగాణ రచయితల వేదిక, 2008 నుంచి వివిధ హోదాల్లో.
 3. సాహితీ సోపతిలో 2010
 4. తెలంగాణ రచయితల వేదిక, కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా 2014, ఫిబ్రవరి నుంచి పనిచేసి, రాష్ట్ర బాధ్యులుగా కొనసాగుతున్నారు.

చిత్ర మాలిక[మార్చు]

ఇతర లంకెలు[మార్చు]

 1. ఫేస్బుక్ లో పేజి
 2. ఫేస్బుక్ లో తెరవే పేజి
 3. సద్గుణ సమాజం బ్లాగ్స్
 4. ఫేస్బుక్ లో మరో పేజీ
 5. బ్లాగులో
 6. ఫేస్బుక్ అకౌంట్
 7. కినిగెలో వాకిలి వచన కవిత్వం ఇ-పుస్తకం
 8. కినిగెలో రంగుల విల్లు నానీల ఇ-పుస్తకం

మూలాలు[మార్చు]

 1. కినిగెలో, పెద్ద కచ్చురం (Nov 18, 2015). "పెద్ద కచ్చురం కవితా సంపుటి". Retrieved 27 September 2016.
 2. నమస్తే తెలంగాణా, సాహితి. "బాయి గిర్క మీది ఊర విష్క సమీక్ష". www.namasthetlangaana.com. Retrieved 25 September 2016.