బెట్టీ విల్సన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బెట్టీ విల్సన్
A full length black and white photograph of a female cricketer in pads playing a shot in the nets
1951 లో బెట్టీ విల్సన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
బెట్టీ రెబెకా విల్సన్
పుట్టిన తేదీ(1921-11-21)1921 నవంబరు 21
మెల్బోర్న్, ఆస్ట్రేలియా
మరణించిన తేదీ2010 జనవరి 22(2010-01-22) (వయసు 88)
మెల్బోర్న్, ఆస్ట్రేలియా
బ్యాటింగుకుడి చేతి వాటం
బౌలింగుకుడి చేతి ఆఫ్ స్పిన్ బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 25)1948 20 మార్చ్ - న్యూజిలాండ్ తో
చివరి టెస్టు1958 24 మార్చ్ - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1937/38–1957/58విక్టోరియా జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ WTests WFC
మ్యాచ్‌లు 11 49
చేసిన పరుగులు 862 2,197
బ్యాటింగు సగటు 57.46 43.94
100లు/50లు 3/3 6/8
అత్యధిక స్కోరు 127 145
వేసిన బంతులు 2,885 4,752
వికెట్లు 68 200
బౌలింగు సగటు 11.80 9.80
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 4 14
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 2 5
అత్యుత్తమ బౌలింగు 7/7 7/7
క్యాచ్‌లు/స్టంపింగులు 10/– 29/–
మూలం: CricketArchive, 2022 జనవరి 13

బెట్టీ విల్సన్ ఆస్ట్రేలియా మహిళా జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఆమెను ప్రపంచంలోనే అత్యుత్తమ మహిళా క్రికెటర్లలో ఒకరిగా పరిగణించబడింది.[1][2][3] ఆమె 1947-48, 1957-58 మధ్య మహిళల టెస్ట్ క్రికెట్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించింది. విల్సన్ కుడిచేతి వాటం బ్యాట్స్ వుమన్ గా, మంచి ఆఫ్ స్పిన్ బౌలర్ గా, అద్భుతమైన ఫీల్డర్ గా రాణించింది.

వ్యక్తిగత వివరాలు[మార్చు]

మెల్ బోర్న్ లో 1921 నవంబరు 21న జన్మించిన విల్సన్ కాలింగ్ వుడ్ పరిసరాల్లో పెరిగింది. ఆమె వీధిలో ఒక దీపస్తంభంతో ఆడటం ద్వారా ఆట నేర్చుకుంది. 10 సంవత్సరాల వయస్సులో ఆమె కాలింగ్ వుడ్ ఉమెన్స్ క్రికెట్ క్లబ్లో చేరింది, అక్కడ ఆమె పెద్దవాళ్ళతో కలిసి ఆడింది. ఆమె 14 సంవత్సరాల వయస్సులో విక్టోరియా రెండవ XI జట్టుకి, 16 సంవత్సరాల వయస్సులో సీనియర్ జట్టుకు చేరుకుంది. ఆమె పూర్తి పేరు బెట్టీ రెబెక్కా విల్సన్. ఆమె 2010 జనవరి 22 మెల్ బోర్న్ లో నే మరణించింది.

క్రికెట్ విశేషాలు[మార్చు]

రెండవ ప్రపంచ యుద్ధం వలన 1948 వరకు ఆమె టెస్ట్ మ్యాచ్ లను ఆడలేక పోయింది. న్యూజిలాండ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ఆమె 90 పరుగులు చేసి, 4/37, 6/28 పరుగులకు వికెట్లు తీసింది. 1949లో తన రెండవ టెస్టులో ఇంగ్లాండ్ పై 111 పరుగులు చేసి శతకము సాధించింది. దీంతో మహిళల టెస్ట్ మ్యాచ్ లో శతకము సాధించి, ఐదు వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్ గా ఆమె పేరు నిలిచింది.[4]

ఆమె 1951లో ఇంగ్లాండ్ పర్యటన చేసి స్కార్ బరోలో జరిగిన మొదటి టెస్టులో 81 పరుగులు చేసింది. యార్క్ షైర్ లో ఆమె 77 నిమిషాల్లో 100 పరుగులు చేసి ఆస్ట్రేలియాను చివరి బంతికి గెలిపించింది. ఈ సిరీస్ తర్వాత ఆమె రెండున్నర సంవత్సరాలు ఇంగ్లాండ్ లో ఉండిపోయింది.

1957 - 58లో ఇంగ్లాండ్ లో జరిగిన సెయింట్ కిల్డా టెస్టులో ఆమె 100 పరుగులు చేసి, 10 వికెట్లు తీసిన మొదటి క్రికెటర్ (మహిళలు/పురుషులలో) గా ఘనత సాధించింది.[5] తడి వికెట్ పై ఆమె మొదటి ఇన్నింగ్స్ లో 7/7 ను తీసుకుంది. ఇది మహిళల టెస్టులో మొట్టమొదటి హ్యాట్రిక్ కూడా.[6] 2004లో పాకిస్తాన్ కు చెందిన షైజా ఖాన్ ఈ ఘనత సాధించేవరకు ఈ రికార్డ్ పునరావృతం కాలేదు. ఆస్ట్రేలియా మొదటి తక్కువ ఇన్నింగ్స్ లో 12 పరుగులు, రెండవ ఇన్నింగ్స్ లో 100 పరుగులతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. ఇంకా రెండవ దాంట్లో 19 ఓవర్లకి 4/9 తీసుకొని, ఒక మ్యాచ్ లో 11/16 అత్యుత్తమ బౌలింగ్ చేసిన మరో రికార్డును నెలకొల్పింది. ఇది 2004 వరకు రికార్డుగా నిలిచింది. విల్సన్ తన కెరీర్లో 11 టెస్టులు ఆడి, 57.4 సగటుతో 862 పరుగులు చేసి, 11.8 సగటుతో 68 వికెట్లు తీసింది.

టెస్టు మ్యాచ్ లో శతకాలు[మార్చు]

బెట్టీ విల్సన్ టెస్ట్ శతకాలు[7]
నెం. పరుగులు. ప్రత్యర్థులు నగరం / దేశం వేదిక సంవత్సరం.
1. 111  ఇంగ్లాండు అడిలైడ్ ఆస్ట్రేలియా అడిలైడ్ ఓవల్ 1949[8]
2. 100  ఇంగ్లాండు మెల్బోర్న్ ఆస్ట్రేలియా జంక్షన్ ఓవల్ 1958[9]
3. 127  ఇంగ్లాండు అడిలైడ్ ఆస్ట్రేలియా అడిలైడ్ ఓవల్ 1958[10]

గౌరవాలు[మార్చు]

 • 1985లో విల్సన్ 'ఆస్ట్రేలియన్ స్పోర్టింగ్ హాల్ ఆఫ్ ఫేమ్' ప్రవేశించిన మొదటి మహిళా క్రికెటర్ అయింది.
 • 1985 - 86లో జాతీయ అండర్ - 21 మహిళల క్రికెట్ ఛాంపియన్షిప్ పేరును, బెట్టీ విల్సన్ షీల్డ్ గా మార్చారు. 1996 - 97లో ఈ వయస్సు వర్గాన్ని అండర్-19 గా మార్చారు.
 • 2015లో విల్సన్ 'ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్' ప్రవేశించారు.[11]
 • 2017లో విల్సన్ ఆస్ట్రేలియన్ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ కి ప్రేరణ ఇచ్చింది.[12]
 • బెట్టీ విల్సన్ యంగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును 2017లో అలన్ బోర్డర్ మెడల్ వేడుకలో 2015 డిసెంబరు 5కి ముందు 25 ఏళ్లలోపు వయస్సు గల, 10 లేదా అంతకంటే తక్కువ మ్యాచ్ లు ఆడిన మహిళా క్రికెటర్ను గుర్తించడానికి ఆరంభించారు.[13]

సూచనలు[మార్చు]

 1. "Betty Wilson". Cricinfo. Archived from the original on 14 April 2010. Retrieved 22 January 2010.
 2. Obituary The Times, 15 February 2010.
 3. Obituary The Independent, 16 April 2010.
 4. "Records | Women's Test matches | All-round records | A hundred and five wickets in an innings | ESPN Cricinfo". Cricinfo. Archived from the original on 6 July 2018. Retrieved 2017-07-24.
 5. "Records | Women's Test matches | All-round records | 100 runs and 10 wickets in a match | ESPN Cricinfo". Cricinfo. Archived from the original on 23 June 2019. Retrieved 2017-07-24.
 6. "Records | Women's Test matches | Bowling records | Hat-tricks | ESPN Cricinfo". Cricinfo. Archived from the original on 6 July 2018. Retrieved 2017-05-03.
 7. "All-round records | Women's Test matches | Cricinfo Statsguru | ESPNcricinfo.com – BR Wilson". Cricinfo. Retrieved 6 December 2021.
 8. "Full Scorecard of ENG Women vs AUS Women 2nd Test 2001 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 6 December 2021.
 9. "Full Scorecard of AUS Women vs ENG Women 2nd Test 1957/58 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 6 December 2021.
 10. "Full Scorecard of AUS Women vs ENG Women 3rd Test 1957/58 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 6 December 2021.
 11. Cricket Network (22 February 2015). "Kumble, Wilson inducted into ICC Hall of Fame". CA Digital Media. Archived from the original on 19 July 2019. Retrieved 19 July 2019.
 12. "Hayden, Boon, Wilson to join Hall of Fame". Cricket Australia. 22 January 2017. Archived from the original on 25 January 2017. Retrieved 22 January 2017.
 13. Jolly, Laura (23 January 2017). "Molineux wins Betty Wilson Award". cricket.com.au. Archived from the original on 26 January 2017. Retrieved 27 January 2017.

 గమనికలు[మార్చు]

 • ఆక్స్ఫర్డ్ కంపానియన్ టు ఆస్ట్రేలియన్ క్రికెట్

బాహ్య లింకులు[మార్చు]