Jump to content

బెల్జియంలో హిందూమతం

వికీపీడియా నుండి

బెల్జియంలో హిందూ మతం మైనారిటీ మతం. ప్యూ 2014 సర్వే ప్రకారం, బెల్జియంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మతం కూడా హిందూమతం. [1] [2] [3] హిందూ ఫోరమ్ ఆఫ్ బెల్జియం (HFB), బెల్జియంలో హిందూమతాన్ని అధికారికంగా గుర్తింపజేసేందుకు కృషి చేసింది. [4]

జనాభా వివరాలు

[మార్చు]
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
20066,500—    
20157,901+21.6%
202010,000+26.6%
సంవత్సరం శాతం మార్పు
2006 0.06% -
2015 0.07% +0.01%
2020 0.08% +0.01%

2006 నాటికి దేశంలో దాదాపు 6500 మంది హిందువులు ఉన్నారు. [5] 2015 నాటికి 7901 మంది ఉన్నారు. [6] 2020 నాటికి, ఆ సంఖ్య 10,000కి పెరిగింది. [7]

బెల్జియంలోని భారతీయ సంఘం

[మార్చు]

బెల్జియంలో దాదాపు 7,000 మంది భారతీయ సంతతికి చెందిన వారు ఉన్నారు.

గుజరాత్‌లోని పాలన్‌పూర్ జిల్లా నుండి వలస వచ్చిన వారిలో ఒక వర్గం యూదు సంఘంతో కలిసి వజ్రాల వ్యాపారంలో పని చేసేందుకు ఆంట్‌వెర్ప్‌లోని ఓడరేవు నగరానికి వచ్చి, చివరికి వారి స్వంత వ్యాపారాన్ని ప్రారంభించారు. [8] ఆంట్వెర్ప్ భారతీయులు ఇప్పటికీ చాలా దట్తంగా అల్లుకున్న సమూహంగా ఉంటారు. భారతీయ పండుగలను చురుకుగా జరుపుకుంటారు.

అరిసెంట్, HCL,, డాఫోడిల్ సాఫ్ట్‌వేర్ లిమిటెడ్, ఇన్ఫోసిస్ వంటి భారతీయ సాఫ్ట్‌వేర్ కంపెనీలు బెల్జియంలో ఉన్నాయి.

కొంతమంది వ్యవసాయ కార్మికులు, దుకాణదారులు, ప్రధానంగా ఉత్తర భారతదేశం నుండి వలస వచ్చినవారు, బెల్జియంలోకి అక్రమంగా ప్రవేశించారు. [9]

బెల్జియంలోని నేపాల్ హిందూ సంఘం

[మార్చు]

నేపాల్ మూలానికి చెందిన దాదాపు 8,000 మంది హిందువులు బెల్జియంలో నివసిస్తున్నారని అంచనా. లీవెన్, ఆంట్వెర్ప్, బ్రస్సెల్స్, బ్రూగెస్ లలో నేపాలీ హిందువులు నివసిస్తున్నారు. వారు ప్రతి సంవత్సరం ప్రత్యేక సందర్భాలలో సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలను నిర్వహిస్తారు. న్వారం, పస్ని, పుట్టినరోజు, బ్రతబంధ, వివాహం, గృహ ప్రవేశం వంటి ప్రధాన ఆచారాలను వారి ఇళ్లలో నిర్వహిస్తారు. నవరాత్రి, శివరాత్రిలలో దేవి పూజ, శివపూజలను కూడా నిర్వహిస్తారు.

నేపాలీ సమాజం ఇంకా ఆలయాన్ని నిర్మించలేదు కానీ వారు హిందూ సంస్కృతి, సంప్రదాయాన్ని కాపాడేందుకు ఒక దేవాలయాన్ని స్థాపించాలని భావిస్తున్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి శ్రీమద్ భగబత్ మహాయజ్ఞం చేసారు. అయితే ఇది ఇంకా ప్రక్రియలో ఉంది. రామ్ హరి శాస్తి బెల్జియంలోని నేపాలీ హిందూ సమాజానికి పూజారిగా పనిచేస్తున్నాడు.

హిందూ సంస్థలు

[మార్చు]

హిందూ ఫోరమ్ ఆఫ్ బెల్జియం

[మార్చు]

హిందూ ఫోరమ్ ఆఫ్ బెల్జియం (HFB లేదా FHB) [10] బెల్జియంలోని హిందూ సంస్థలు ఏర్పాటు చేసాయి. ఇది 2007 మార్చి 16 న బ్రస్సెల్స్‌లో మొదలైంది.

సనాతన ధర్మ సేవా పరిషద్

[మార్చు]

ఇది బెల్జియంలోని పురాతన హిందూ సాంస్కృతిక సంఘం. శివరాత్రి, శ్రావణ మాసం వంటి ప్రత్యేక సందర్భాలలో వివిధ పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తుంది. ఇటీవలి సంవత్సరాలలో, ఇది డర్బుయ్‌లో ఇస్కాన్‌తో కలిసి శ్రీ కృష్ణాష్టమి పండుగను జరుపుకుంటోంది.

జయతు సంస్కృతం

[మార్చు]

జయతు సంస్కృతం అసోసియేషన్ బెల్జియంలో హిందూ సాంప్రదాయ సంస్కృతిని ప్రోత్సహించడానికి పనిచేస్తోంది. ఇది 2011లో ల్యూవెన్‌లో జరిగిన శ్రీమద్ భగబత్ మహాపురాణ్ నిర్వహించింది. బెల్జియంలో మొట్టమొదటిసారిగా ఇది నిర్వహించిన భారీ మహాయాగంలో సుమారు 5000 మంది భక్తులు చురుకుగా పాల్గొన్నారు. సాయి పరివార్ బెల్జియం, సనాతన్ ధర్మ సేవా పరిసద్ వంటి ఇతర సంఘాలు అక్కడ చురుకుగా ఉన్నాయి.

సత్యసాయి పరివార్

[మార్చు]

సత్య సాయి భజన మండలి బెల్జియంలోని నేపాలీ ప్రజల హిందూ సంఘం. వారు ప్రతి ఆదివారం లీవెన్, ఆంట్‌వెర్ప్, ఓస్టెండ్‌లలో సాయి భజన నిర్వహిస్తారు. వారు బ్రస్సెల్స్‌లోని సత్య సాయి కేంద్రంతో కలిసి పనిచేస్తారు.

బ్రస్సెల్స్ హిందూ దేవాలయం

[మార్చు]

2000 సంవత్సరంలో, బ్రస్సెల్స్ (బెల్జియం)కి వలస వచ్చిన భారతీయ కుటుంబాలు మా దుర్గా జాగరణ్‌ని జరుపుకోవడానికి స్థానిక చర్చి లోనో పాఠశాల లోనో సమావేశమయ్యేవారు. ఈ కుటుంబాలు బ్రస్సెల్స్‌లో పూర్తి స్థాయి హిందూ దేవాలయాన్ని నిర్మించి, నిర్వహించాలని భావించాయి. అప్పటికి ఇది చాలా పెద్ద ఆలోచనగా అనిపించినప్పటికీ, సంవత్సరాలు గడిచేకొద్దీ భారతీయ సమాజం పెరిగింది. ఆలయాన్ని నిర్మించడానికి హిందూ మందిర్ అసోసియేషన్ నిధుల సేకరణను నిర్వహించింది. బ్రస్సెల్స్ దేవాలయ ప్రారంభోత్సవం 2012 ఫిబ్రవరి 19 న బ్రస్సెల్స్‌లోని భారతీయ సంఘం విరాళాలతో నిర్వహించారు. ప్రతి ఆదివారం సేవలు జరుగుతాయి. ఎవరే (బ్రస్సెల్స్)లోని దేవాలయంలో ప్రధాన హిందూ పండుగల సమయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి [11]

ఓస్టెండ్ హిందూ దేవాలయం

[మార్చు]

2012 నుండి ఓస్టెండ్‌లోని హిందూ దేవాలయం కోసం ఫేస్‌బుక్ గ్రూప్ కూడా ఉంది. [12]

బెల్జియంలో ఇస్కాన్

[మార్చు]
భక్తివేదాంత కళాశాల, బెల్జియంలోని ఏకైక హిందూ వైష్ణవ విశ్వవిద్యాలయం

అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ( ఇస్కాన్ ) బెల్జియంలో చురుకుగా ఉంది. బెల్జియంలో దాదాపు 1,500 మంది హరే కృష్ణ ఉద్యమ సభ్యులు ఉన్నారు. [13] సెప్టన్-డర్‌బుయ్‌లో ఇస్కాన్ ఆలయం నిర్మించారు. దీనిని రాధాదేశ్ అని పిలుస్తారు. ఆంట్‌వెర్ప్, జెంట్‌లలో ఇస్కాన్ కేంద్రాలను స్థాపించారు. అటువంటి కేంద్రం లేని ఇతర పట్టణాలలో, ప్రైవేట్ వ్యక్తుల ఇళ్లలో "స్థానిక కలయిక కార్యక్రమాలు" నిర్వహిస్తారు. వీటిని సాధారణంగా జన్మాష్టమి, దీపావళి వంటి పండుగ సందర్భాలలో నిర్వహిస్తారు.

ISKCON బెల్జియంలో ఈ క్రింది కార్యకలాపాలను నిర్వహిస్తుంది:

  • కేంద్రం-1: ఇస్కాన్ సెంటర్, ఆంట్వెర్ప్, బెల్జియం
  • కేంద్రం-2: స్థానిక గెట్-టుగెదర్ ప్రోగ్రామ్, ఘెంట్, బెల్జియం
  • సెంటర్-3: ISKCON రాధాదేశ్ ఆలయం. బెల్జియంలో ఉన్న ఏకైక ఇస్కాన్ దేవాలయం ఇదే. ఇందులో కింది విశేషాలున్నాయి.
    • ప్రధాన ఆలయం, రోజువారీ పూజలు పండుగలు జరుపుకునే గొప్ప నిర్మాణం
    • భక్తివేదాంత లైబ్రరీ సర్వీసెస్ (BLS), గణనీయమైన లైబ్రరీ పరిశోధనా సౌకర్యం
    • భక్తివేదాంత కళాశాల, ఒక మతపరమైన విద్యా ప్రాంగణం, బెల్జియంలోని ఏకైక హిందూ వైష్ణవ విశ్వవిద్యాలయం.
    • రాధాదేశ్ గోవిందా, ఇస్కాన్ యొక్క ఫుడ్ ఫర్ లైఫ్ కార్యక్రమం

బాలినీయ హిందూమతం

[మార్చు]

బెల్జియంలోని పైరి డైజా బొటానికల్ గార్డెన్‌లో రెండు బాలినీయ దేవాలయాలు ఉన్నాయి. [14] [15]

2009లో ప్రారంభించబడిన 4-హెక్టార్ల (9.9-ఎకరాలు) గణేశ రాజ్యం, ఐరోపాలో అతిపెద్ద ఇండోనేషియా ఉద్యానవనం. ఇండోనేషియా ద్వీపసమూహం, ముఖ్యంగా బాలి లోని మొక్కలను, అనుభూతిని పునరుత్పత్తి చేస్తుంది. దీనిలో పురా అగంగ్ శాంతి బువానా బాలినీయ హిందూ ఆలయం, ఈస్ట్ న్యూసా టెంగ్గారా తొరాజా సంప్రదాయంలో ఇళ్ళు, బోరోబుదూర్, ప్రాంబనాన్ దేవాలయాల సూక్ష్మ ప్రతిరూపాలు ఉన్నాయి. 2009 ఆగస్టులో ఇండోనేషియా ప్రభుత్వం ఇండోనేషియా పార్క్‌కు ప్రోత్సాహకంగా ఒక జత సుమత్రా ఏనుగులను పంపింది. ఇది ఇండోనేషియా అంతరించిపోతున్న జంతువుల కోసం ఐరోపాలో చేపట్టిన మొదటి పెంపక కార్యక్రమం. [16]

సామాజిక జీవనం

[మార్చు]

Ipsos చేసిన సర్వే ప్రకారం, దాదాపు 40% మంది బెల్జియన్లు, హిందువులను నిజమైన బెల్జియన్లుగా పరిగణిస్తూండగా, దాదాపు 35% మంది, హిందువులు నిజమైన బెల్జియన్లు కాదని పేర్కొన్నారు. [17]

ఇది కూడ చూడు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Fastest Growing Religion in Each Country Around the World – Brilliant Maps".
  2. IRF2006
  3. United States Department of State
  4. "Hindu Forum Gains Support to Make Hinduism Official Religion in Belgium". Archived from the original on 2021-12-04. Retrieved 2022-01-21.
  5. IRF2006
  6. "Belgium, Religion and Social Profile". Archived from the original on 2022-06-27. Retrieved 2022-01-21.
  7. Table: Religious Composition by Country, 2010-50 Pew Research Center (April 2015)
  8. Gujaratis families dominate 60 percent diamond trade in Belgium
  9. "Diaspora - chapter 11" (PDF). Archived from the original (PDF) on 2014-12-26. Retrieved 2007-03-19.
  10. "HFB". Archived from the original on 2016-03-03. Retrieved 2022-01-21.
  11. [ https://www.brusselsmandir.com]
  12. [1]
  13. United States Department of State
  14. "The Flower Temple | Pairi Daiza".
  15. "Archived copy". Archived from the original on 2018-04-17. Retrieved 2018-04-16.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  16. "BRUGELETTE – Pairi Daiza – Royaume de Ganesha – the Temple". Archived from the original on 2022-01-21. Retrieved 2022-01-21.
  17. "Belgium: Hindus as part of the national community 2018".