బేడర కన్నప్ప (కన్నడ సినిమా)
బేడర కన్నప్ప (కన్నడ: ಬೇಡರ ಕಣ್ಣಪ್ಪ) 1954లో నిర్మించబడిన కన్నడ సినిమా. గుబ్బి వీరణ్ణ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం ద్వారా ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ సినిమా రంగానికి పరిచయం చేయబడ్డాడు. సినీ నటి పండరీబాయికి కూడా ఇది తొలి సినిమా[1]. దీనిని సినిమాగా తీయకముందు నాటకంగా గుబ్బి వీరణ్ణ నాటక కంపెనీ ప్రదర్శించేది. కన్నడ చలనచిత్ర చరిత్రలో ఈ సినిమా విడుదల ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ చిత్రం 1954లో నిర్మించబడిన సినిమాలలో ఉత్తమ కన్నడ సినిమాగా జాతీయ చలన చిత్ర పురస్కారాన్ని పొందింది[2][3]
ఈ సినిమా కన్నప్ప అనే బోయవాడు తన మూఢభక్తితో కళ్ళు రెండూ పెరికివేసి శివునికి సమర్పించడమనే ఒక జానపద కథపై ఆధార పడింది.ఈ సినిమా థియేటర్లలో వందరోజులకు పైగా ప్రదర్శింపబడింది. దీనిని తమిళంలో "వేడన్ కన్నప్ప" (తమిళం: வேடன் கண்ணப்பா) పేరుతో 1955లో డబ్బింగ్ చేశారు. ఇదే సినిమాను కాళహస్తి మహాత్యం పేరుతో తెలుగులో పునర్నిర్మించారు. రాజ్‌కుమార్ నటించిన ఏకైక కన్నడేతర చిత్రం కాళహస్తి మహాత్యం.
మూలాలు
[మార్చు]- ↑ "Bedara Kannappa (1954)". Indiancine.ma. Retrieved 2024-10-16.
- ↑ "ಕನ್ನಡ ಚಿತ್ರರಂಗ ಕಂಡ ಅಪರೂಪದ ನಟ ಬಾಲಣ್ಣನ ಸಿನಿಮಾಯಾನ | TN Balakrishna Ep 05". YouTube.
- ↑ "Here are some must-watch iconic films of Dr Rajkumar". 24 April 2020.