Jump to content

బొంబాయి హల్వా

వికీపీడియా నుండి

ఇది గోధుమలతో చేసుకొనే ఒక రకమైన హల్వా. ఇది మెత్తగా తియ్యగా ఏ వయసువారైనా తినే విధంగా ఉంటుంది.

కావలసిన పదార్ధాలు

[మార్చు]

తయారుచేయు విధానం

[మార్చు]
  • తెల్ల గోధుమ రవ్వను శుభ్రం చేసుకోవాలి. ప్ప్సగ్గుబియ్యం[[ రాళ్ళు లేకుండా శుభ్రం చేసుకోవాలి.
  • ఈ రెండింటిని ఒక్కసారి నీరులో కడిగి అవి మునిగేటంత నీరుపోసి నానబెట్టాలి. ఇలా రెండు గంటల ఉంచాలి.
  • ఇలా నానిని రవ్వ సగ్గుబియ్యంతో పాటు మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుతుంటే జిగురు వచ్చి ఇంచుమించు గోధుమ పాలులాగా రావాలి.
  • వేయవలసిన పప్పులు అన్నింటిని విడివిడిగా నేతిలో వేయించుకోవాలి. పచ్చి పప్పులు వేస్తే హల్వా నిలువ వుండదు. ఏలకులు పొడిచేసుకోవాలి.
  • మూడు కప్పుల చక్కెరలో ఒక కప్పు నీరుపోసి, పంచదార కరిగి లేత పాకం వచ్చే వరకు ఉడకనివ్వాలి.
  • ఈ పాకంలో రుబ్బి ఉంచుకున్న గోధుమ సగ్గుబియ్యం పాలు మెల్లగా పోస్తూ తాపీగా సన్నని సెగమీద ఉడకనివ్వాలి. అడుగు అంటకుండా కాస్త నెయ్యివేసి, ముద్ద కట్టకుండా తిప్పుతూ ఉండాలి. గోధుమపాలు, పంచదార పాకంలో ఉడికి దగ్గరగా ముద్దలాగా అవుతుంది. ఇది గడ్డకట్టే సరికి పంచదార ముదురుపాకం వస్తుంది. ముట్టుకొని చూస్తే వేలికి అంటుకోకూడదు. హల్వా ముద్దను బాగా కలియబెడుతూ కొంచెం నెయ్యిపోస్తూ తాపీగా ఉడకనివ్వాలి. ముదురుపాకం వచ్చేసరికి హల్వా రబ్బరు లాగా సాగుతుంది. అప్పుడు వేపిన పప్పులు, ఏలకుల పొడి వేసి ఒక చెంచా పాలలో మిఠాయి రంగు కలిపి అది కూడా వేసి క్రిందికి దించుకోవాలి.
  • ఈ హల్వాను వేడిమీదనే పళ్ళెంలో పరచి, ముక్కలుగా కోయవచ్చును.

చిట్కాలు

[మార్చు]
  • హల్వాకు ముదురు పాకం రావడం చాలా ముఖ్యం. బాగా పాకం రాకుండా దించితే హల్వా నిలువ ఉండదు.
  • ఇందులో వేయవలసిన పప్పులు నెయ్యిలో వేపుకుంటే హల్వా ఎక్కువకాలం నిలువ ఉంటుంది.