బొగ్గులవాగు ప్రాజెక్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బొగ్గులవాగు ప్రాజెక్టు
దేశంభారత దేశం
ప్రదేశంరుద్రారం, మల్హర్రావు మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
ఆవశ్యకతనీటిపారుదల
స్థితిపనిచేస్తోంది
నిర్మాణ వ్యయం341 లక్షలు
జలాశయం
మొత్తం సామర్థ్యం0.365 టిఎమ్‌సి

బొగ్గులవాగు ప్రాజెక్టు మానేరు నదికి ఉపనది యైన బొగ్గులవాగుపై నిర్మించిన మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టు. దీన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మల్హర‌రావు మండలం లోని రుద్రారం గ్రామం నుండి 6.5 కి.మీ. దూరాన నిర్మించారు. ఇది కరీంనగర్ నుండి 96 కి.మీ. దూరంలో ఉంది. దీన్ని 1976-77లో ప్రారంభించి 1987లో పూర్తిచేశారు. దీనిద్వారా 5,150 ఎకరాలకు సాగునీరందుతుంది.[1]

దీని జలాశయ నిల్వ సామర్థ్యం 0.365 టిఎమ్‌సి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని కాటారం, మల్హర్రావు మండలాల్లోని 5,150 ఎకరాలకు ఈ ప్రాజెక్టు నుండి నీరందుతుంది. [2]

మూలాలు[మార్చు]

  1. బొగ్గులవాగు ప్రాజెక్టు. "తెలంగాణ ప్రాజెక్టులు ప్రత్యేకతలు". నమస్తే తెలంగాణ. Retrieved 13 September 2017.
  2. "బొగ్గులవాగు ప్రాజెక్ట్" (PDF). తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదల శాఖ. Archived (PDF) from the original on 2020-07-09. Retrieved 2020-07-09.